Personalized
Horoscope
  • Talk To Astrologers
  • Talk To Astrologers
  • Pavan
  • Hariharan

Rasi Phalalu 2013 - Telugu Astrology 2013 - Telugu Horoscope 2013

2013 తెలుగు రాశిఫలాలు / 2013 తెలుగు జాతక చక్రము / 2013 తెలుగు జ్యోతీష్యము

To check out Telugu Horoscope 2014, please click here - Telugu Horoscope 2014

Horoscope is called Rasi Phalamulu or Rasi Phalalu in Telugu. Our Telugu Rasi Phalalu 2013 is based on Moon sign called Janma Rasi in Telugu. Janma Rasi is determined by the position of the Moon in a Zodiac sign during the time of birth. This position of Moon can give a good clue of the year which in case is year 2013. In this Varshika Rasi Phalamulu, you will get detailed 2013 Rasi Phalalu for each month i.e. January Rasi Phalalu, February Rasi Phalalu, March Rasi Phalalu, April Rasi Phalalu, May Rasi Phalalu, June Rasi Phalalu, July Rasi Phalalu, August Rasi Phalalu, September Rasi Phalalu, October Rasi Phalalu, November Rasi Phalalu, December Rasi Phalalu. Check free Rasi Phalalu 2013 predictions based on Moon sign Astrology NOW IN TELUGU!!

2013 Rasi Phalalu in Telugu is based on your moon sign and prepared according to ancient principles of Indian Vedic Astrology. If you do not know your Moon Sign, please click Find your Moon Sign to find out it free. its free.


మీ జన్మరాశిని ఎంచుకొనండి
మేషం వృషభం మిథునం కర్కాటకం
సింహం కన్య తుల వృశ్చికం
ధనుస్సు మకరం కుంభం మీనం

మేషం మేషరాశి 2013 వార్షిక రాశిఫలాలు (జన్మరాశి ప్రకారము) ఈ రాశి వారికి 2013 వ సంవత్సరమున మిశ్రమ ఫలితములు ఉండవచ్చును. ఆనందమయమైన సంఘటనలు జరిగినను, తప్తిచెందక చింతింతురు. విద్య, ధనార్జన, వుత్తివ్యాపారములు, వివాహము, ఆరోగ్యము మరియు కుటుంబ అవసరములకు అధికముగా ధనము ఖర్చు చేయుదురు. ధరార్జన గణనీయముగా పెరుగుటకు అవకశము కలదు కావున చింతించక పొదుపు – పెట్టుబడులయందు అప్రమత్తముగా ఉండగలరు. ఈ రాశి వారు 21013 వ సంవత్సరమున ప్రేమ, వివాహము, కుటుంబమునకు సంబందించిన విషయములయందు ధైర్యముగా నిర్ణయములు తీసుకుందురు. కానీ ఈ నిర్ణయములు కొంతవరకే ఫలవంతములు కాగలవు. కావున తొందర పడక నిదానముగా వ్యవహరించుట యుక్తము. ఆరోగ్యమునకు హాని కలిగించు విషయములకు దూరముగా ఉండవలయును. ముఖ్యముగా ఈ 2013 వ సంవత్సరము విద్యార్ధులకు అనుకూలముగా ఉండును. విద్యా కోర్సులను, విద్యాలయములను, కళాశాలలను ఎంచుకొనుటయందు జాగ్రత్త వహించిన సత్ఫలితములు పొందవచ్చును.

వృషభం వృషభరాశి 2013 వార్షిక రాశిఫలాలు (జన్మరాశి ప్రకారము) ఈ రాశియందు జన్మించినవారికి ఈ సంవత్సరము అద్భుతమైన ఫలితములు కలుగవచ్చును. తలపెట్టిన కార్యములు నిర్విఘ్నముగా పూర్తి కాగలవు. మీరు ఆశించు ఫలితములు పొందుటకు సహనము – ఖర్చు మాత్రమే మార్గములు. తొలుత కొంత జాప్యము జరిగినప్పటికిని తప్పక విజయము సాధింతురు. 2013 వ సంవత్సరమున ఉద్యోగ, వ్యాపారములు, వివాహాది కార్యక్రమములయందు కుటుంబ విషయముల యందు ప్రోత్సాహకరముగా ఉండును. ఆరోగ్యపరముగా ప్రత్యేక శ్రద్ధ అవసరము. ఆరోగ్యమునకు భంగము కలిగించు పనులను సత్వరమే నిలిపివేయవలెను. కళత్ర – కుటుంబ సౌఖ్యము మెండుగా యుండును. అవివాహితులకు వివాహము, వివాహితులకు సంతానము కలుగుట తగస్థించును. ఉద్యోగమునందు స్వల్ప ఇబ్బందులు కలిగిననూ శక్తి యుక్తులతోను, స్వయంక్రుషితోను వాటిని అధిగమించగలరు. ఇతరుల యందు మీకు కల జాలి, దయ వంటి సద్గుణములు మీ జీవితమును మరింత ముందుకు తీసుకువెళ్ళగలవు. విద్యార్ధులకు విజయావకాశములు మెండు కావున నిస్సంకోచముగా పరీక్షలకు దరకాస్తు చేసుకొనవచ్చును.

మిథునం మిథునరాశి 2013 వార్షిక రాశిఫలాలు (జన్మరాశి ప్రకారము) ద్వాదశ రాశులయందు చురుకైన-ప్రశాంతమైన రాశి మిథునరాశి ఈ సద్గుణములే ఈ 2013 వ సంవత్సరమును గడుపుటకు ఉపకరించును. ఈ సంవత్సరము ఒడిదుడుకులతో కూడినదై ఉండవచ్చు. కుటుంబ సభ్యులు, ప్రేమికుడు/రాలు మిమ్ములను అపార్ధము చేసుకొనవచ్చును. కావున మీరు జాగ్రత్తగా వ్యవహరించవలెను. మీకు అత్యంత నమ్మకస్థులకే అందుబాటులో ఉండుట మంచిది. లేకున్న ఈ 2013 వ సంవత్సరమున మోసగించబడుదురు. స్నేహితులుసైతం మిమ్ములను నమ్మని పరిస్థితి తటస్థించగలదు. ఉద్యోగమునందు కూడా ఇబ్బందులు, చికాకులు కలుగవచ్చును. కావున ధనము, ఉద్యోగ వ్యాపారముల యందు బాగుగా యోచించి నిర్ణయములను తీసుకొనవలెను. విద్యార్ధి దశలో నున్న వారు కళాశాలల యొక్క మంచి-చెడులను విచారించి చేరవలెను. చిన్న తరహాపరిశ్రమలవారికి కొంత వరకు లాభించినను, భారీ పరిశ్రమలవారు-పెట్టుబడిదారులు అప్రమత్తముగా ఉండవలెను. మీ అజాగ్రత్త వలన చట్టపరమైన విషయములలో చిక్కు కొందురు కావున జాగ్రత్తగా వ్యవహరించగలరు.

కర్కాటకం కర్కాటకరాశి 2013 వార్షిక రాశిఫలాలు (జన్మరాశి ప్రకారము) ఈ రాశివారు 2013వ సంవత్సరమునందు తమకు మించిన కార్యభారమును ఉద్యోగమందు, గృహమందు తీసుకుందురు. మీకు సంబంధించని విషయములయందు పరులచే నిందించబడుటయే కాక ఆత్మ నింద కూడా చేసుకొందురు. మితిమీరిన మంచితనమునకు పోక వాస్తవికతకు దగ్గరగా ఉండుట యుక్తము. ఆర్ధిక, ఉద్యోగవ్యాపార మరియు ప్రేమవ్యవహారముల యందు రాణింతురు. ప్రేమాభిమానములకై తపించు వారికి ఈ 2013వ సంవత్సరమున అవి లభించగలవు. చిరు వలహములకు పోక ప్రేమ యొక్క మాధుర్యమును ఆశ్వాదించ వలెను. ఉద్యోగమునందు కార్యభారము వలన ఈ సంవత్సరము అంతయు ఒత్తిడికి గురికాగలరు. నూతన వ్యాపారములను ప్రారంభించుటయు, విదేశీ వర్తకము వలన స్వల్ప లాభములు ఆర్జించుటయు కలదు. నష్టము కలిగే అవకాశమున్నది కావున తెగింపుతో పనులు చేయరాదు.

సింహం సింహరాశి 2013 వార్షిక రాశిఫలాలు (జన్మరాశి ప్రకారము) ఈ రాశివారిని 2013వ సంవత్సరము నందు గొప్ప అద్రుష్టవంతులుగా చెప్పవచ్చును. మీరు తలపెట్టిన కార్యములు అద్భుతముగా ఫలించును ’’పట్టిందల్లా బంగారమే’’ అన్నట్లుగా ఉండును. మీరు చేయు వ్యాపార విస్తరణ వల్ల ఆదాయము గణనీయముగా పెరుగుటయే కాక మీరు చాలా ధనమును పొదుపు చేయగలరు. మీ సామర్ధ్యమును నమ్ముకొనుటయే కానీ ఆత్మాభిమానమును అహంకారముగా మార్చరాదు. పెట్టుబడులు పెట్టుటకు ఈ సంవత్సరము అనుకూలము. విద్యార్ధులు ఉన్నత విద్యయందు లక్ష్యమునుంచవలెను. విద్యయందు విజయము నిస్సంకోచముగా కలుగును. ప్రేమ వ్యవహారములు మరింత గాఢముగా మారును. కుటుంబ సభ్యులతో అన్యోన్యత పెరుగుట వలన ఇంటి వాతావరణము మరింత ఆహ్లాదముగానూ, సంత్రుప్తికరముగాను ఉండును. ఈ 2013వ సంవత్సరమున మీకు కలుగు మానుసిక శాంతినే అత్యంత ఉన్నతమైనదిగా పరిగణించవచ్చు.

కన్య కన్యారాశి 2013 వార్షిక రాశిఫలాలు (జన్మరాశి ప్రకారము) ఈ 2013వ సంవత్సరములో ముఖ్యముగా కుటుంబ, వివాహ, ఆధ్యాత్మిక విషయముల యందే ఎక్కువ సమయము గడుపుదురు. మీరు కుటుంబముతో కలసి దూరప్రయాణము చేయు యోచన ఫలించును. దాని వలన మీకు-మీ కుటుంబ సభ్యులకు మధ్య గల బంధము బలపడును. ఈ సంవత్సరమున మీ ఆరోగ్యము కూడా బాగుండును. మీ కుటుంబముతో మీరు గడిపిన కాలము వలన మీకు మీ అంతరంగము పై అవగాహన పెరుగును. విద్య, ధన, వృత్తి వ్యాపారములకు సంబంధించిన విషయములయందు మిశ్రమ ఫలితములుండును. మీరు ఒకప్పుడు పరాజయము పాలైనను మరొకప్పుడు పైచేయి సాధించగలరన్న విషయమును మననము చేసుకొనవలెను. మీరు ఉత్కృష్ట కార్యములు చేయ సమర్ధులు కావున ఈ 2013వ సంవత్సరమున మీరు మీ ఉద్యోగమందు చేసిన కృషికి గుర్తింపు మరియు గౌరవ మన్ననలను పొందుతారు. పెట్టుబడులు పెట్టునపుడు జాగ్రత్త వహించవలెను. వ్యాపార నిమిత్తము ప్రయాణము చేయుదురు.

తుల తులారాశి 2013 వార్షిక రాశిఫలాలు (జన్మరాశి ప్రకారము) ఈ రాశివారిపై 2013వ సంవత్సరము యెక్క ప్రభావము మెండుగా నుండును. ద్వాదశ రాశులలో ఈ రాశివారికి పంతృప్తికరమైన ఫలితములు కలుగునని ఉన్ననూ కొన్ని పరిస్ధితులు అసంతృప్తికి గురి చేయును. ఈ సంవత్సరము కొన్ని నిరాశాజనకమైన సంఘటనలను సూచించిననూ నమ్మకమును వదులుకొనుట, ఆరోగ్యమును అలక్ష్యము చేయుటవలన కలుగు ప్రయోజనము లేదు. ప్రేమవ్యవహారముల యందు, కుటుంబ విషయముల యందు చాలా జాగ్రత్తతతో మెలగవలెను. ఉద్యోగ పరమైన కీలక నిర్ణయములు తీసుకొనుటకు ముందు నిశిత పరిశీలన అనుభవముగలవారి సూచనలను తీసుకొనుట మంచిది. అసంత్రుప్తివలన ఇదివరకటి భాగస్వామ్య వ్యాపారములను రద్దు చేయవచ్చును. ధన వ్యయమును నిలువరించిన మంచిది. తొందరపాటు లేక తెగింపుతో నిర్ణయములను తీసుకొనక నిలకడగా వ్యవహరించవలెను. పెట్టుబడి పెట్టుటకు ముందే లోతు పాతులను బాగుగా విచారించవలెను. అధిక శ్రమ-కృషి వలన విద్యార్ధులు తప్పక విజయము సాధించగలరు.

వృశ్చికం వృశ్చికరాశి 2013 వార్షిక రాశిఫలాలు (జన్మరాశి ప్రకారము) ఈ రాశివారికి 2013వ సంవత్సరమున విశ్రమ ఫలితములుండును. ఈ సంవత్సరమున మీ జీవితము ఆశ్చర్యకరమైన మలుపులు తిరుగును. నూతనోత్సాహము కలవారై ఆనందమయమైన జీవితమును గడిపెదరు. ఇంటి వాతావరణము ప్రశాంతముగా ఉన్నప్పటికి చిన్న చిన్న తగువులు నిరాశపరచును. కుటుంబ సభ్యుల అనారోగ్యము కలవర పరచ గలదు. 2013వ సంవత్సరమున జలుబు, జ్వరము వంటి చిన్న సమతస్యలు మినహా మీ ఆరోగ్యము బాగుండును. మీరు ప్రేమించిన వ్యక్తితో సంతోషముగా కాలమును గడిపినప్పటికీ సంవత్సరము ద్వితీయార్ధములో జాగ్రత్తగా ఉండవలెను. విద్య, ధన, ఉద్యోగ పరమైన విషయములయందు రాణింతురు. మీరు చేయగలిగినంత మేరకు ప్రయత్నించిన విధి మీకు విజయమును అందించగలదు. 2013వ సంవత్సరమున మీరు పొదపు మాత్రము చేయలేరు.

ధనుస్సు ధనుస్సురాశి 2013 వార్షిక రాశిఫలాలు (జన్మరాశి ప్రకారము) ఈ 2013వ సంవత్సరము చాలావిషయముల యందు మనోహరముగా నుండును. మీరు అదృష్ట-భాగ్యములను ప్రక్కన పెట్టి పరిస్థితులను నేర్పుతో ఎదుర్కొనవలెను. సంవత్సర ప్రారంభమున కుటుంబములో ఇబ్బందులు తలెత్తిననూ కాలక్రమేణ అవి పరిష్కరించబడును. ఈ సంవత్సరమున ఆరోగ్యపరమైన శ్రద్ధ అత్యంత అవసరము. చిన్న అజాగ్రత్తకు సైతము పెద్ద మూల్యము చెల్లించవలసి రాగలదు. మీరు ప్రేమించిన వ్యక్తిని మీ మొండి పట్టుదల వలన దూరము చేసుకొనెదరు. మీరు పట్టుదల వదిలి లౌక్యముగా లేక చాకచక్యంగా వ్యవహరించిన సదరు వ్యక్తితో వివాహము నిశ్చయము కాగలదు. వివాహితులు అన్యోన్య దాంపత్యమును అనుభవింతురు. వృత్తి-వ్యాపారముల యుదు ఈ సంవత్సరము అంత శుభదాయకము కాదు. శ్రమకు తగ్గ ఫలితము దక్కనందున మీరు బాగా విచారింతురు లేక అసహనమునకు గురికాగలరు. 2013వ సంవత్సరములో ఆర్ధిక స్థితి నిలకడగా ఉండును.

మకరం మకరరాశి 2013 వార్షిక రాశిఫలాలు (జన్మరాశి ప్రకారము) ఈ 2013వ సంవత్సరమున మీ జీవితము తీర్చిదిద్దుకొను అవకాశములు వచ్చును. ఉద్యోగ వ్యాపారములు, ప్రేమవ్యవహారముల యందు అత్యంత అనుకూలముగా ఉన్ననూ కుటుంబ పరిస్థితులు మాత్రము కృంగదీయును. సంవత్సర ద్వితీయార్ధమున కుటుంబ పరిస్థితులు దిగజారును. అయినప్పటికీ ఉద్యోగమందు పూర్తి ఏకాగ్రతతో ముందుకు వెళ్ళవలెను. ఉద్యోగపరముగా 2013వ సంవత్సరమున మీరు తీసుకున్న చర్యలు మీకు కీర్తి-ప్రతిష్టలు తెచ్చిపెట్టగలవు. మీరు ఇతరులను అర్ధము చేసుకొనగలరు కావున ఇతరులతో సంబంధ బాంధవ్యములు పెంపొందును. ఆర్థికముగా పురోభివృద్ధి కలదు కావున ఈ రంగమున 2013వ సంవత్సరము బాగున్నదనవలెను. ఆర్ధిక స్థితి బాగున్న మాత్రమున పెట్టుబడులు పెట్టరాదు. విద్యార్ధులు చదువు పట్ల మరింత శ్రద్ధ కలవారై అనవసర కాలయాపన చేయక విద్యయందు కృషి చేయవలెను.

కుంభం కుంభరాశి 2013 వార్షిక రాశిఫలాలు (జన్మరాశి ప్రకారము) 2013వ సంవత్సరమున అద్భుతమైన ఫలితములను అనుభవించగలరు. ఈ సంవత్సరము అన్ని విషయముల యందు అనుకూలము. ఉద్యోగస్థానమునందు గౌరవ మర్యాదలు, మీకు నచ్చిన వ్యక్తులు చూపు ప్రేమాభిమానములు వలన ఆనందింతురు. కొన్ని పరిస్థితులయందు మీ అహంకారము మితిమీరును కావున ఆ పరిస్థితులకు దూరముగా ఉండుట మంచిది. విశాలమైన ఆలోచనా విధానము ఈ సంవత్సరము మీకు అవసరము. వాతావరణ మార్పులవలన స్వల్ప అనారోగ్యము కలుగవచ్చును కాని చింతించవలదు. మీరు ప్రేమించినవారి కొరకు తీర్ధయాటన చేయుదురు. మీరు మీ ప్రేమికుడు/రాలు ఇబ్బంది పెట్టినప్పటికీ ప్రేమతో వారి మనసు గెలిచెదరు. ఉద్యోగ పరంగా ఉన్నతస్థాయి వ్యక్తులతో కలసి పని చేయుదురు కావున ఈ సంవత్సరము మీకు బాగున్నదనవలెను. మీ మెరుగైన పని తీరు వలన 2013వ సంవత్సరాంతమున పదోన్నతి కలుగ గలదు. నిరంతరము ఆర్ధిక వనరులు సంవృద్ధిగా అందుబాటులో ఉండుట వలన ఈ సంవత్సరము ఆనందముగా గడచును.

మీనం మీనరాశి 2013 వార్షిక రాశిఫలాలు (జన్మరాశి ప్రకారము) ఈ 2013వ సంవత్సరమున ఇతరులను నమ్మకుండుట మంచిది. మీ సామర్ధ్యమును నమ్ముకొనుట ఎంతైననూ ముఖ్యము. మీరు మీ కుటుంబము కొరకు శ్రమించిననూ వారు దానిని గుర్తించరు. ఆరోగ్య విషయములో ప్రత్యేక శ్రద్ధ అవసరము, లేకున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలుగును. ముఖ్యముగా రక్తము లేక చర్మమునకు సంబంధించిన వ్యాధులు కలుగ గలవు. ప్రేమ వ్యవహారములను పూర్తిగా నమ్ముటకు ఇది సమయము కాదు. ప్రేమ విషయములో మీ నిర్ణయమునకు కట్టుబడి ఉండవలెను. 2013వ సంవత్సరము ఉద్యోగ-వ్యాపారములకు అంత అనుకూలముకాదు. ఉన్నతోద్యోగులతో మీకు జరుగు వాగ్వివాదములు మీపై చెడు ప్రభావమును చూపును. పరిణితి, సహనము ఈ 2013వ సంవత్సరమున మీకు అత్యావశ్యకములు. ఆర్ధికపరమైన ఒత్తిడి ఉండవచ్చును కావున పెద్ద మొత్తములలో పెట్టుబడులు పెట్టుట శ్రేయోదాయకము కాదు.

2014 Articles

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

AstroSage TVSubscribe

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com

Reports

Live Astrologers