Personalized
Horoscope
  • Talk To Astrologers
  • Talk To Astrologers
  • Pavan
  • Hariharan

2018 రాశి ఫలాలు (Rasi Phalalu 2018)

Do you want to know how 2018 is going to be for you as per Jyotisham? Read Rasi Phalalu 2018 for your zodiac sign now–it is going to help you achieve success and prosperity throughout the year. This Telugu horoscope also explains how you can avoid problems and get peace and progress. In case you have any query about it, you may contact us too. Let us have a look at what this year has to offer you now:

వేద జ్యోతిషశాస్త్రం యొక్క భావనల ఆధారంగా 2018 రాశి ఫలాలు రూపొందించబడ్డాయి. ప్రతిరాశి వారికి 2018వ సంవత్సరం ఎలా ఉండబోతున్నదో చూద్దాం రండి.

గమనిక: ఈ జ్యోస్యాలు మీ జన్మరాశిపై ఆధారంగా చెప్పబడ్డాయి. మీకు మీ జన్మరాశి గురించి తెలియకపోతే, దయచేసి ఈ పేజీని సందర్శించండి - AstroSage జన్మరాశి లెక్కింపు..

మేషం (Mesha)

మేషమేషరాశి వారికి 2018 రాశిఫలాలకు అనుగుణంగా, సంవత్సరం యొక్క ప్రారంభంలో పూర్తి శక్తి మరియు అంకితభావం ఉంటుంది. తెలివైన నిర్ణయాలు మీకు సంవత్సరం అంతటా కూడా శుభవార్తలను అందిస్తాయి. క్లిష్టమైన షెడ్యూల్ మరియు భోజనం తినకపోవడం వల్ల సుఖసంతోషాలు లోపించినట్లుగా మీరు భావించడం వల్ల కుటుంబజీవితం గందరగోళంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. మొదటి రెండు నెలలు ఆరోగ్యపరంగా సులభంగా ఉండకపోవచ్చు ఆదాయం పెరుగుతుంది,కెరీర్‌పరంగా పురోభివృద్ధి ఉంటుంది. దూర ప్రయాణాలు ఫలప్రదంగా ఉంటాయి మరియు దీని వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అక్టోబర్ మధ్య నుంచి, సంపాదన కాస్తంత తగ్గుతుంది మరియు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. పిల్లల యొక్క ఆరోగ్యంలో ఒడుదుడుకులు ఉండవచ్చు, వైవాహిక జీవితంలో మీరు మరింత సమయం మరియు అంకితభావం ప్రదర్శించాలి, అలానే మీరు ఇతరుల యొక్క హృదయాలను గెలుచుకోగలుగుతారు. పని నుంచి అప్పుడప్పుడు వేరుపడే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఏడాది, మీకు చక్కటి మరియు ఒక పురోగామి సంవత్సరంగా ఉంటుంది.

వృషభం (Vrusha)

వృషభప్రారంభంలో దుడుకుగా ఉండటం వల్ల అది మీ పై తీవ్రంగా ప్రభావం చూపుతుంది, మీరు ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. క్రమేపీ, మీరు ఆత్మస్థైర్యాన్ని పొందుతారు మరియు ఏదైనా సాధించాలని ఆశిస్తారు. విజయం సాధించడం కొరకు, సంవత్సరం అంతటా కూడా మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. పనిలో కొంత నిరుత్సాహం కూడా కలగవచ్చు. అక్టోబర్ తరువాత, మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది, మీ వైవాహిక జీవితం ఫలప్రదంగా ఉంటుంది. 2018లో వృషభరాశివారి రాశిఫలాల ప్రకారం, కొన్ని చిన్నపాటి ప్రయోజనాల వల్ల మంచి ఫలితాలుంటాయి; మీరు పుణ్యక్షేత్ర సందర్శన చేయవచ్చు. పిల్లల్లలో పురోగతి ఉంటుంది మరియు బాగా రాణిస్తారు. మీరు వివాదాలు మరియు తగాదాలను పరిహరించాలి, ఇవి మీ సంపద నాశనానికి కారణం అవుతాయి. మొదటి రెండు నెలలకాలంలో వివాదాలకు దూరంగా ఉండండి, ఇది మీ ఇమేజ్‌కు హాని కలిగించవచ్చు. అయితే, సవాళ్లను ఎదుర్కొనడానికి మీరు మరింత వేగంగాఉంటారు. ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది, అందువల్ల మీ ఆహారంపై దృష్టి కేంద్రీకరించండి, మీరు బరువు పెరిగే సంభావ్యత ఉంది. మీరు మీ జీవితభాగస్వామి మరియు మతపరమైన కార్యక్రమాలపై ఖర్చు పెట్టాల్సి రావొచ్చు. మొత్తం మీద, ఇది ఒక సగటు సంవత్సరం, మీరు అనేక కొత్త విషయాలను నేర్చుకోవచ్చు. మీకు చక్కటి వైవాహిక మరియు ఆర్థిక స్థితి ఉంటుంది.

మిధున రాశి (Mithuna)

మిధునరాశి మిధునం యొక్క వ్యక్తీకరించే శక్తి మీకు సంవత్సరం అంతటా లాభం చేకూరుస్తుంది. అయితే, మొదటి నెలలో, మీరు మీ పదాలపై దృష్టి కేంద్రీకరించాలి, ఇది గొడవలకు దారితీయవచ్చు. మీ పనిని విస్తరించడం కొరకు మీరు మీ ఇంటి నుంచి దూరంగా వెళ్లవచ్చు మరియు మీరు బాగా సంపాదించవచ్చు. అయితే, ఇది మీరు ప్రేమించిన వారిని దూరం చేయవచ్చు. అందువల్ల, వ్యక్తిగత జీవితం అదేవిధంగా వృత్తిపరమైన జీవితంలో ఒక సంతులనం అవసరం అవుతుంది. మిధున రాశివారి యొక్క 2018 యొక్క జాతక ఫలితాల ప్రకారంగా, పిల్లలు అల్లరిగా ఉంటారు, అయితే, వారు కొత్తవిషయాలను తెలుసుకుంటూ ఉంటారు మరియు వారి రంగంలో వారు బాగా రాణిస్తారు. ఒకవేళ వివాహం కానట్లయితే, డిసెంబర్ మధ్య నుంచి, మీరు కోరుకున్న భాగస్వామితో మీరు మూడుముళ్లు వేయవచ్చు. సంవత్సరం యొక్క త్రైమాసికంలో ఖర్చు ఎక్కువగా ఉండవచ్చు. మీ ఆరోగ్యం ఒడుదుడుకులను ఎదుర్కొనవచ్చు, అంటువ్యాధులు, కీళ్ల నొప్పులు మొదలైన వాటితో మీరు బాధించవచ్చు, చెడ్డ ఆహారానికి దూరంగా ఉండాలి. ఈ ఏడాది వ్యాపారం మరింత లాభదాయకంగా ఉంటుంది. మీరు గతంలో పడ్డ కష్టం అనేది మీ వృత్తిపరమైన పురోగతికి పునాదిగా నిలుస్తుంది. మొత్తం మీద ఈ ఏడాది మీరు ఎదగడానికి మరియు విజయం సాధించడానికి అనేక అవకాశాలను కల్పిస్తుంది.

కర్కటరాశి (Kataka)

కర్కాటక కర్కాటకరాశి వారికి 2018 రాశిఫలాలకు అనుగుణంగా,మీ చుట్టూ మీరు మరింత శక్తిగా ఉన్నట్లుగా భావిస్తారు మరియు ఇతరులకు నాయకత్వం వహించాలని మీరు విశ్వసించవచ్చు. మీరు బాగా ప్రేమించేవారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు మరియు ఇది మీ మధ్య సంబంధాలు దెబ్బతినడానికి కారణం కావొచ్చు. అప్పుడప్పుడు చిన్నపాటి వివాదాలు ఉన్నప్పటికీ కూడా వైవాహిక జీవితం సామరస్యంగా సాగుతుంది. పనిప్రాంతంలో మీ పేరుప్రఖ్యాతులు మరియు స్థాయి పెరుగుతుంది. మీ సామాజిక స్థితి కూడా పెరుగుతుంది. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించే సంభావ్యత ఉండటం వల్ల మీరు ప్రధానంగా ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించాలి. మీ వైవాహిక జీవితంలో సంతోషం లోపించవచ్చు. మీ వైవాహిక జీవితం సజావుగా సాగడం కొరకు మీరు వాదనలను దూరంగా ఉండాలి. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సంపాదన ఉంటుంది, అయితే మీ ఆర్థిక స్థితిని గతి తప్పే అవకాశం ఉండటం వల్ల మీరు మీ ఖర్చుల్ని నియంత్రించుకోవాలి. విద్యార్థులు బాగా చదువుతారు మరియు పిల్లలు అంకితభావాన్ని పొందుతారు. ఏడాది పొడవునా మీ జీవితం మరియు ఖర్చు పెట్టడాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశ్యం ఉండటం వల్ల మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. దీని కొరకు మీరు బాగా కష్టపడి పనిచేస్తారు. మొత్తం మీద, ఈ ఏడాది కొన్నిపాటి సవాళ్లతో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది.

సింహం (Simha)

సింహ2018లో సింహరాశి వారి రాశిఫలాలకు అనుగుణంగా, మతపరమైన మరియు ఆధ్యాత్మిక భావనలపట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది; అదేవిధంగా మీరు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. జనవరి - ఫిబ్రవరి మధ్యకాలంలో తోబుట్టువుల ఆరోగ్యం దెబ్బతింటుుంది, అయితే, మీరు ధైర్యంగా ఉంటారు. ప్రేమ జీవితం మిశ్రమ దశల్ని ఎదుర్కొంటుంది. ఒకవైపు కొన్ని అపార్ధాలను ఎదుర్కొంటారు, అయితే, మరోవైపు, మీరు ప్రేమించిన వారి నుంచి ఆశించిన ప్రేమను పొందుతారు. మీ చర్యలు మిమ్మల్ని విజయపథంవైపుకు నడిపిస్తాయి. అయితే, మీరు బద్ధకాన్ని విడిచిపెట్టాలి. వైవాహిక సంతోషం పెరుగుతుంది. మీ జీవితం ముందుకు సాగుతోందని మరియు పరిస్థితులు మీకు అనుకూలంగా మళ్లుతున్నాయనే భావన మీకు కలుగుతుంది మరియు మీరు ఆర్థికంగా బలపడతారు. పిల్లలు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది మరియు మీరు వారిపై అధికంగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది; మరియు వారి ప్రయత్నాలకు మీరు మద్దతు కల్పించాలి. విదేశీ ప్రయణాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గర్భవతులైన మహిళలు జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ మధ్య కాలం నుంచి, కుటుంబ జీవితం అలానే వృత్తిపరమైన జీవితంలో సానుకూలమైన మార్పులను చూడవచ్చు. మీరు ప్రజల గౌరవమన్ననలను అందుకుంటారు.

కన్య (Kanya)

కన్యా 2018లో కన్యారాశి వారి రాశిఫలాలకు అనుగుణంగా, ఈ ఏడాది మీరు అత్యుత్తమ విజయాలను సాధిస్తారు. అపారమైన అవకాశాల ద్వారా మీరు చక్కటి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ సామాజిక వృత్తం చాలా అధికంగా క్రియాత్మకంగా ఉంటుంది మరియు మీ సామాజికస్థిలో కూడా మెరుగుదల ఉంటుంది. స్నేహితులు మరియు ప్రేమించిన వారితో చక్కటి సమయాన్ని గడుపుతారు. విద్యార్థుల్లో ఏకాగ్రత లోపిస్తుంది. అందువల్ల, కష్టపడి పనిచేయడం అనేది విజయానికి కీలకం. మీ బిడ్డలకు ఆరోగ్య సమస్య వల్ల,చిరాకు కలిగే అవకాశం ఉండటం వల్ల మీరు మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు చక్కటి వృత్తిపరమైన జీవితాన్ని ఆశిస్తారు. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ దీర్ఘకాలిక వాంఛనలు నెరవేరతాయి. సంవత్సరం అంతటా కూడా ఆదాయ ప్రవాహం చక్కగా ఉంటుంది. జనవరి నెలలో, ఊహించని విధంగా ఆర్థిక లబ్ధి కలుగుతుంది. అక్టోబర్ తరువాత, ఇది మరింత పెరుగుతుంది. మీ జీవితభాగస్వామి ద్వారా మీరు లబ్ధిని పొందవచ్చు,అయితే అతడు/ఆమెకు అక్టోబర్ వరకు శక్తి తక్కువగా ఉంటుంది లేదా ఆరోగ్య సంక్లిష్టతలు చోటు చేసుకోవచ్చు. అయితే, వారి నుంచి మీరు పూర్తి మద్దతును పొందుతారు. అధికారిక కారణాలు లేదా పనుల నిమిత్తం మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. కుటుంబంలో పుణ్యకార్యాలు జరుగుతాయి. ఏదైనా చేరిక కూడా సాధ్యం అవుతుంది. మొత్తం మీద, ఈ ఏడాది మీకు అన్నివిధాలుగా లాభదాయకంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో శాంతిసామరస్యాలను పాటించడం మరియు వాదనలకు మీరు దూరంగా ఉండాలి.

తుల (Tula)

తులా 2018లో తులారాశి వారి రాశిఫలాలకు అనుగుణంగా, సంవత్సర ప్రారంభంలో ఎంతో శక్తివంతంగా ఉంటుంది, అయితే, దూకుడు ఉంటుంది, కుటుంబ మరియు వైవాహిక జీవితాన్ని ఆస్వాదించడం కొరకు వీటిని మీరు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. జనవరి- మార్చి మధ్య మీ ఆరోగ్యం బాగుండకపోవచ్చు. మాట్లాడేముందు జాగ్రత్త వహించండి, ఇవి ఇతరుల యొక్క సెంటిమెంట్లను దెబ్బతీయవచ్చు. పని చేసేచోట మీకు చక్కగా ఉంటుంది, మీ ఆలోచనలకు చక్కటి ఆకృతి కల్పించబడుతుంది మరియు మీరు విషయాలను మీకు అనుకూలంగా మీరు నిర్వహించుకోగలుగుతారు. బద్ధకాన్ని దూరం చేసుకోవాలి. సహోద్యోగులు తటస్థంగా ఉంటారు. అందువల్ల, మీరు మీ స్వంత సామర్థ్యాలపై ఆధారపడాలి. జనవరి- మార్చి మధ్య, సంపాదన పెరిగే అవకాశాలున్నయి. దాని తరువాత, మీ స్వంత చర్యలు మిమ్మల్ని కొత్త వేదికలకు నడిపిస్తుంది. మీకు ఒంటరి భావన కలగడం వల్ల మీరు మీ కుటుంబజీవితంలో సుఖసంతోషాలను పొందలేకపోతారు మరియు మీ కుటుంబ జీవితానికి మీరు తగినంత సమయాన్ని కేటాయించలేకపోతారు. దీనిపై మీరు దృష్టి సారించాల్సి ఉంటుంది. స్వల్ప ప్రయాణాలు మరియు కొన్న దూర లేదా విదేశీ ప్రయాణాలు చోటు చేసుకోవచ్చు. పిల్లలు బాగుంటారు మరియు వారు చక్కటి జీవితాన్ని ఆస్వాదిస్తారు. విద్యార్థులు కష్టపడి పనిచేస్తారు మరియు తరువాత తాము కష్టపడి చదివిన దాని ఫలితాలను అనుభవిస్తారు. మార్చి తరువాత, వైవాహిక జీవితంలో పురోగతి ఉంటుంది. మొత్తం మీద ఈ ఏడాది, మీకు ఒక పురోగామి సంవత్సరంగా ఉంటుంది. మీరు ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలపై దృష్టి కేంద్రీకరించాలి.

వృశ్చికం (Vrushchika)

వృశ్చిక 2018లో వృశ్చిక రాశి వారి రాశిఫలాలకు అనుగుణంగా, ఈ ఏడాది మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు మరియు వాటిని ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే, మీరు విజయాలను సాధించగలుగుతారు. జనవరినుంచి మార్చి వరకు మీ ఆరోగ్యం క్షీణింవచ్చు, దాని తరువాత అటువంటి సమస్యలు తొలగి, మీరు సామర్థ్యాన్ని పొందుతారు. మీరు మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం కనపరుస్తారు. ఆర్థిక విషయాలకు వస్తే, ఈ ఏడాది అక్టోబర్ వరకు, మీకు వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఇది మీ ఆర్థిక విషయాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. అక్టోబర్ తరువాత, మంచి ఫలితాలు మరింత సమర్థవంతంగా చూడబడతాయి. పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు మరోసారి ఆలోచించండి. ఈ ఏడాది మీరు మీ యొక్క అన్నిరకాల బంధనాలను బిగించి, మరింత ఆదాయం పొందే దిశగా పనిచేస్తారు. విదేశాల్లో చదువుకోవాలని అనుకునేవారికి, ఈ సంవత్సరం వారికి ఎంతో ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలు జీవితాన్ని ఆస్వాదిస్తారు మరియు అల్లరిగా మారతారు, ఏకాగ్రత సమస్యలు ఉండవచ్చు. సంవత్సరంలో ఎక్కువకాలం వైవాహిక జీవితంలో సంతులనం ఉంటుంది. వైవాహిక జీవితం మంచి ఫలితాలను అందిస్తుంది. మీ జీవితభాగస్వామి మీ జీవితంలో అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. పనిప్రాంతం కాస్తంత సవాళ్లుగా ఉంటుంది అయితే పురోగతి ఉంటుంది. మొత్తం మీద, మిశ్రమ ఫలితాలు చూడవచ్చు.

ధనుస్సు (Dhanusu)

ధనుస్సు 2018లో ధనుస్సు రాశివారి రాశిఫలితాల ప్రకారంగా, ఈ ఏడాది మీరు జీవితంలో ఎదగడం కొరకు అనేక అవకాశాలు కల్పించబడతాయి. ఈ ఏడాది ఒక ఖచ్చితమైన సంవత్సరంగా తీర్చిదిద్దుకోవడం కొరకు మీ యొక్క అంకితభావం గరిష్టంగా ఉంటుంది. మార్చి వరకు ఆదాయ ప్రవాహం పెరుగుతుంది. మే చివర వరకు మీ ఖర్చులు పెరుగుతాయి, అయితే దాని తరువాత మిగిలిన సంవత్సరం అంతా కూడా సరైన మార్గంలో సాగుతుంది. అందువల్ల, ఫైనాన్స్ అనేది ఆందోళన చెందాల్సిన అంశం కాదు. మీ యొక్క అనురక్తి వల్ల డంబ్బు సంఆదించే మార్గాలు పెరుగుతాయి మరియు మీరు అనేక వనరుల ద్వారా డబ్బును సంపాదిస్తారు. శని మీరు కష్టపడి పనిచేసేలా చేస్తాడు. అయితే, అధికంగా శ్రమించడం పరిహరించాలి, ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. మార్చి నుంచి మే వరకు కాస్తంత తక్కువగా ఉంటుంది, అక్టోబర్ తరువాత కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే సంభావ్యత ఉంది. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. పిల్లలు కష్టపడి చదువుతారు మరియు చదువుల్లో రాణిస్తారు. అప్పుడప్పుడు చిన్నపాటి వివాదాలు ఉన్నప్పటికీ కూడా వైవాహిక జీవితం సామరస్యంగా సాగుతుంది. అయితే, ఒంటరిగా ఉండటం లేదా కుటుంబ జీవితం నుంచి దూరంగా ఉన్న భావన కలుగుతుంది మరియు తప్పుడు మాటలు ఉపయోగించడం పరిహరించండి. వైవాహిక జీవితంలో మంచి ఫలితాలుంటాయి, అయితే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం సమస్యలు కలిగించవచ్చు. ప్రేమ జీవితం వల్ల బలం కలుగుతుంది. ప్రత్యర్థులపై ఆధిపత్యం సంపాదించడం జరుగుతుంది. మొత్తం మీద, మీకు ఇది ఒక మంచి సంవత్సరం, మీరు మీ ఆరోగ్యంపై దృష్టి సారించాల్సి ఉంటుంది.

మకరం (Makara)

మకర 2018లో మీరు జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోగలుగుతారు. ఒకవైపు, మీ వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది, మరియు మరోవైపు ఆదాయం తగ్గిపోతున్న భావన మీకు కలుగుతుంది. ఇంకా, మీ ఆరోగ్యం కూడా ఆటంకాలు కలిగిస్తుంది. అయితే, మీరు కొన్ని విదేశీ సంబంధాలను పొందుతారు, దీని ద్వారీ మీ సంపాదన మరియు ఆదాయం పెరుగుతుంది. 2018 యొక్క వేద జ్యోతిష్యశాస్త్ర ప్రకారంగా, మీలో ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది, మరియు కొంతకాలంపాటు మీరు భౌతిక ప్రపంచం నుంచి విడిపడిపోయిన భావన కలుగుతుంది. పనిప్రాంతంలో, మీరు అధికారాన్ని సంపాదిస్తారు, అయితే వివాదాలకు దూరంగా ఉండాలి. పనిప్రాంతంలో మీరు పేరుప్రఖ్యాతులు పెరుగుతాయి మరియు మీరు కొత్త అసైన్‌మెంట్ లేదా మీ చేతిలో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్‌ని పొందవచ్చు. విద్యార్థులు బాగుంటారు మరియు విద్య మరియు కొత్త విషయాలను నేర్చుకునే విషయంలో ఆసక్తి కనపరుస్తారు. సీనియర్‌లతో మంచి సంబంధాలను కలిగి ఉండండి, మార్చి మరియు మే నెలల్లో వీరి నుంచి కొన్ని అనుకూలత సిద్ధిస్తుంది. వైవాహిక జీవితం వికసిస్తుంది మరియు కలిసి ఉండటం మరింత బలంగా మారుతుంది. వైవాహిక జీవితంలో, కొన్ని అభిప్రాయాలు బేధాలు రావొచ్చు, మీరు వీటికి దూరంగా ఉండాలి. అక్టోబర్ తరువాత, మీ వైవాహిక జీవితం కూడా మెరుగవుతుంది మరియు మీ వ్యక్తిగత జీవితాన్ని మీరు ఆస్వాదిస్తారు. మొత్తం మీద, మీ జీవితంలో రాణించడానికి మరియు మీ బలహీనతలను మెరుగుపరుచుకోవడానికి ఇది దోహదపడుతుంది.

కుంభం (Kumbha)

కుంభ ఇది 2018లో కుంభరాశివారి యొక్క జాతక ఫలాలు. మీ నిర్ణయాలు సంవత్సరంలో మీ యొక్క పురోగతికి పునాది వేస్తుంది. మీరు కష్టపడి పనిచేయడం వల్ల మీ ప్రధాన దృష్టి సంపదపై ఉంటుంది మరియు, మీరు ఈ సంవత్సరాన్ని ఒక లాభదాయక సంవత్సరంగా రూపొందించుకుంటారు మరియు మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది. సుదూర ప్రయాణాలు చేపడతారు. మీరు తెలివైన మరియు ఉత్పాదక నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆరోగ్య స్థితి బలంగా ఉంటుంది మరియు మీ గత అస్వస్థతల నుంచి దూరం అవుతారు. సీనియర్లు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీరు పుణ్యకార్యాల్లో పాల్పంచుకుంటారు. వైవాహిక జీవితం అనేది ప్రేమ మరియు అనురాగానికి మూలం అవుతుంది. అయితే, మొదటి రెండు నెలలు కాస్తంత సవాళ్లతో కూడినదిగా ఉంటుంది, మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్య లేదా కొన్ని వివాదాలు చోటు చేసుకోవచ్చు. ప్రేమలో ఉన్నవారికి, ఈ ఏడాది తమ ప్రేమపై మరింత ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది మరియు వారు ఒకరినొకరిని మరింత ఎక్కువగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు కష్టపడి పనిచేస్తారు మరియు పిల్లలు కొంత చిరాకును ఎదుర్కొంటారు, మీ ప్రేమ మరియు సంరక్షణ వారి ఎదుగుదలకు దోహదపడతాయి. మొత్తం మీద ఈ ఏడాది, మీకు చక్కటి మరియు ఒక పురోగామి సంవత్సరంగా ఉంటుంది.

మీనం (Meena)

మీన 2018 రాశిపలాల ప్రకారంగా, సున్నితమైన మీనరాశి వ్యక్తులు సంవత్సరం పొడవుగా తమ ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది, మరిముఖ్యంగా అక్టోబర్ వరకు, దాని తరువాత చక్కటి జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఎక్కువ ఒత్తిడి మరియు అధికంగా పనిచేయడం వల్ల మీకు సమస్యలు కలగవచ్చు. పనిప్రాంతంలో, వాంఛిత ఫలితాలను పొందడం కొరకు మీరు అదనంగా శ్రమించాల్సి ఉంటుంది. సీనియర్‌లు మరింత డిమాండ్ చేస్తారు, అందువల్ల, ఒకేసారి వీరి యొక్క ఆకాంక్షలను మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. జనవరి ఆర్థికపరంగా మీకు మరింత సవాళ్లతో కూడుకుని ఉంటుంది; ఫిబ్రవరి కొరకు మీరు పోస్ట్ చేయాలి, దాని తరువాత మీ ఆదాయం మరింత పెరుగుతుంది. ఏదైనా అవాంఛనీయ ప్రయాణాలు చోటు చేసుకోవచ్చు. వైవాహిక జీవితం చక్కగా సాగిపోతుంది మరియు మీ జీవిత భాగస్వామి మీ యొక్క అన్ని ప్రయత్నాలకు చక్కగా సహకరిస్తారు. వృత్తిపరమైన బాధ్యతల వల్ల మీరు మీ నివాసాన్ని మార్చుకోవచ్చు. పిల్లలు అల్లరిగా మారతారు మరియు మంచి మార్గంలో ఉండేందుకు మీరు వారిని నెట్టాల్సి ఉంటుంది. విద్యార్థులు చదువుల్లో షార్ట్‌కట్‌లు వెతుకుతారు మరియు వారు మూడీగా ఉంటారు. మీరు కూడా జీవితంలో షార్ట్‌కట్‌ల కొరకు ప్రయత్నిస్తారు మరియు అయితే తరువాత చక్కటి ఫలితాలన పొందుతారు, మీరు వాటిని ఆపాల్సి ఉంటుంది. అక్టోబర్ తరువాత, మీరు మీ జీవితంలో మరింత సానుకూల మార్పులను చూడవచ్చు. మొత్తం మీద, ఈ ఏడాది మీరు మీ ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి మరియు జీవితంలో సంతులనం చేసుకోవాలి.

ఇదే, 2018 సంవత్సారానికి సంబంధించిన ఫలితాలు. ఈ రాశిఫలాలను అత్యుత్తమంగా ఉపయోగించుకొని మీ జీవితాన్ని మరింత ఫలప్రదం చేసుకోండి.

Read Other Zodiac Sign Horoscope 2018

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

AstroSage TVSubscribe

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com

Reports

Live Astrologers