Rasi Phalalu 2015 - రాశి ఫలాలు 2015 – జ్యోతిషం 2015
Rasi Phalalu 2015 tells you everything about year 2015 in detail to achieve and utilize your maximum potential. You will get to know, according to Telugu Astrology 2015, what is coming your way - good or bad - and what you should do to shun negative things and pep up positives in your life. Our 2015 Rasi Phalalu is based on subtle calculations of Vedic Astrology that gives you insight into your future and helps you carve it beautifully. By giving it a read, you can find out what the stars have in store for you in 2015.
If you see some other area posing any problems then, you can take care of that as well. This Telugu Horoscope for 2015 also contains remedies for you to ward off all the negativities and help you tread the path of success and prosperity. Let’s see what Rasi Phalalu in 2015 predicts for you:
మీ నూతన సంవత్సరాన్ని ప్రారంభించడానికి మరియు ముందుగానే ప్రణాళిక చేసుకోవడానికి మీకు సహాయపడేందుకు రాశిఫలాలు 2015 ఇక్కడ పొందుపరచబడ్డాయి. 2015 కొరకు రాశిఫలాల జ్యోస్యాలను మా నిపుణులైన జ్యోతిష్యుడు తయారుచేసారు. అది మీ జీవితంలోని అన్ని ముఖ్యవిభాగాలను తెలుపుతుంది. ఈ రాశిఫలాలు 2015 లో అన్నిరాశుల జ్యోస్యాలు పరిపూర్ణంగా చెప్పబడ్డాయి. ఈ సాంవత్సరిక రాశిఫలాలు మీ జన్మరాశుల కొరకు ఒక సంక్షిప్త జ్యోస్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ 2015 జ్యోతిష జ్యోస్యాలు ఉద్యోగం, ఆర్థికస్థితి, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం మరియు చదువు లాంటి ముఖ్యమైన విభాగాలను కలిగిఉంటుంది.
గమనిక:ఈ జ్యోస్యాలు మీ జన్మరాశిపై ఆధారంగా చెప్పబడ్డాయి. మీకు మీ జన్మరాశి గురించి తెలియకపోతే, దయచేసి ఈ పేజీని సందర్శించండి - AstroSage జన్మరాశి లెక్కింపు.
మేష రాశి ఫలాలు 2015
Mesha Rasi Phalalu 2015
మేషరాశివారు, మీపై బృహస్పతి ఆశీర్వాదాలు కురిపిస్తున్నాడు. తొమ్మిదవగది
అధిపతి (భాగ్యేషుడు) మీ నాలుగవ మరియు ఐదవ గదులలో ఉన్నాడు. కావున, 2015 యొక్క మొదటి
సగ భాగంలో మీ కౌటుంబిక జీవితమ్ అందంగా ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే,
అందుకు అనుకూలమైన సమయం. కొత్త కారు లేదా ఇల్లు స్వంతం చేసుకోవాలనుకుంటున్నారా? బాగా
ప్రయత్నాలు కొనసాగించండి మీ కోరిక తీరుతుంది. 2015 యొక్క రెండవ సగ భాగంలో ప్రేమ మరియు
పెళ్ళికి అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కావాలనుకునే వివాహమైన జంటలకు ఆ కోరిక తీరుతుంది.
వ్యాపారస్థులు వారి వ్యాపారాని విస్తరిస్తారు. మీరు ఏదైనా క్రొత్త పనిని, సరికొత్త
ప్రణాళికతో చేపడతారు. మేషరాశి ఫలాలు 2015 ప్రకారం, మీకు పెద్దవారి సహకారం అందుతుంది.
ధనాన్ని బాగా సంపాదించే అందమైన అవకాశాలు ఉంటాయి. అయితే, ఎనిమిదవగదిలో శని మరియు ఆరవగదిలో
రాహువు ఉండడం వలన మీరు మీ కుటుంబం మరియు ఆరోగ్య విషయాలలో అలసత్వం వహించలేకపోతారు. మీరు
సమయానుసారంగా ఈ విషయాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. పన్నెండవగదిలోని కేతువు, కష్టాలుకొనితెచ్చుకోవడం
మరియు మూఢభక్తిలో పడడం కంటే సలహాలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నాడు. విద్యార్థులు
వారి కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు.
మేష రాశి వారికి 2015లో పరిహారాలు : చతురస్రాకార వెండి ముక్కను మీతో పాటుగా
ఉంచుకోండి.
వృషభ రాశి ఫలాలు 2015
Vrushaba Rasi Phalalu 2015 in Telugu
వృషభరాశివారు, 2015 లో, బృహస్పతి మీకు చాలా అనుకూలంగా ఉన్నట్టుగా ఉంది. బృహస్పతి ఆశీర్వాదాల వలన మీరు సరియైన దిశలో, విజయాలను వరిస్తారు. మీరు మీ పనులను సాధించడమే కాకుండా, ప్రశంసలతో పాటుగా గౌరవమర్యాదలను కూడా అందుకుంటారు. ఇదెంతమంచిదో కదా? అయితే, వృషభరాశి 2015 రాశిఫలాల ప్రకారం, ఏడవగదిలోని శని, మీ ఆదాయానికి అడ్డంకులు కలుగజేస్తాడు. కానీ, బాధపడకండి; సుఖానికి ముందు కష్టం ఉంటుంది, అవి మీ ఆనందం విలువను తెలుసుకోవడంకోసమే వస్తాయి. దీనికి అదనంగా, మీ వ్యక్తిగత జీవితంలో మీరు అనుకూలత లోపాన్ని ఎదుర్కొంటారు. కానీ, కొద్దిపాటి ప్రయత్నాలతోనే అన్ని అడ్డంకులను అధిగమించి విజేతలుగా నిలుస్తారు. మీ ప్రేమ జీవితం విషయంలో, ఐదవగదిలోని రాహువు, ప్రేమలో నిజాయతి మరియు విధేయతలు అతి ముఖ్యమైనవని సూచిస్తోంది. కావున, మీరు మీ భాగస్వామికి విధేయంగా ఉండడాన్ని నిర్ధారించుకోండి. మీ ఆరోగ్యం విషయంలో, ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. గృహోపకరణాలయిన వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ మొ.నవాటికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల విషయంలో వృషభరాశి ఫలాలు 2015 ప్రకారం, వారు కూడా ఊహించని ఫలితాలను పొందుతారు.
వృషభ రాశి వారికి 2015 లో పరిహారాలు: ఒక నల్ల ఆవుకు సేవ చేయండి.
మిథున రాశి ఫలాలు 2015
Mithuna Rasi Phalalu 2015 in Telugu
మిథునరాశివారు, 2015 మీకు ఒక ఆశీర్వాదాల మేజిక్ బాక్స్ ను తెస్తోంది. ఒక అద్భుతమైన సమయంలాగా కనిపిస్తోంది. మీరు ప్రేమించేవారి కొరకు ఏమైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటే, మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. దీనిని అనూకూలమైన పద్ధతిలో మనం ’చెర్రీ ఆన్ ద టాప్’ అని పిలుస్తాము. 2015 లో, మీరు కోరుకున్న పేరు ప్రతిష్టలు, సంపద మరియు ప్రతి ఒక్కటీ మీకు దొరికేందుకు బలమైన అవకాశాలున్నాయి. మరిక ఏమి కోరుకుంటారు? మిథునరాశి ఫలాలు 2015 ప్రకారం, ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు ముసలితనం వలన బాధపడుతూ ఉంటే కూడా, కొంత మెరుగుపడడం గమనిస్తారు. సంపూర్ణంగా, ఇది ఒక జాక్ పాట్ కొట్టే సమయం! ప్రేమ వ్యవహారాలకు దాదాపుగా ఈ సంవత్సరమంతా అద్భుతంగా ఉంటుంది. మీరు మార్పు కొరకు స్థిరంగా మరియు ప్రణాళిక వేస్తుంటే, మెరుగవడానికి అందమైన అవకాశాలుంటాయి. కాబట్టి, ఏదైనా కొత్త అవకాశాన్ని వదులుకోకండి, గట్టిగా పట్టుకోండి! మరొకవైపు, వ్యాపారస్థులు కొంత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది, కానీ కష్టపడడానికి ఫలితం ఎప్పుడూ ఉంటుందని మాత్రం గుర్తుంచుకోండి. కావున, మిథునరాశి ఫలాలు 2015 ఇలా చెబుతున్నాయి – కష్టపడి పనిచేయడానికి భయపడకండి. విద్యార్థుల విషయంలో, వారు అనుకూల ఫలితాలు పొందడం కొనసాగిస్తారు.
మిథున రాశి వారికి 2015 లో పరిహారాలు: ఆడపిల్లలు మీ సేవను అందించండి.
కర్కటక రాశి ఫలాలు 2015
Karkataka Rasi Phalalu 2015 in Telugu
కర్కటక రాశి వారు, 2015 మీకు కొన్ని విషయాలలో అద్భుతంగా ఉంటుంది. మీరు వివాహవయస్సు చేరుకుని ఉంటే, పెళ్ళివాయిద్యాలు మోగనున్నాయి. కాబట్టి, సిద్ధంగా ఉండండి! మీరు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా వివాహం జరగవచ్చు, మీ చుట్టూ పెళ్ళి వాయిద్యాలు మోగడం మాత్రం ఖాయం. కర్కటక రాశిఫలాలు 2015 ప్రకారం, ప్రేమ వ్యవహారాలలో, దేనికైనా ఒత్తిడి చేయడం అంత మంచి ఆలోచన కాదు. కాబట్టి, కొంత సహనం వహించి జాగ్రత్తగా వ్యవహరించండి. పనికి సంబంధించిన విషయాలలో కూడా, 2015 అద్భుతంగా ఉంటుంది. ప్రమోషన్ వచ్చు అవకాశాలు ఉన్నాయి. మీ సమయం అత్యద్బుతంగా ఉందనిపిస్తోంది. మీరు మీ పని కారణంగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అయినా, వాటిలో చాలామటుకు వ్యర్థం కావచ్చు. కానీ, కర్కటక రాశి ఫలాలు 2015, మీరు సంతోషంగా ఉంటారని చెబుతున్నాయి. ఈ సంవత్సరంలో మీ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ, గుడ్డిగా మదుపు చేయడం మంచి ఆలోచన కాదు. చివరగా, ఒక విషయంపై మీరు గమనం ఉంచాలి. ఆరోగ్య స్థితిలో ఒడిదుడుకులు కలుగవచ్చు. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కూడా, 2015 శుభప్రదమైనది. సంవత్సరంలో 90% కర్కటక రాశివారికి అనుకూలంగా ఉంటాయి.
కర్కటక రాశి వారికి 2015 లో పరిహారాలు: దేవాలయంలో బాదాంపప్పును దానం చేయండి.
సింహ రాశి ఫలాలు 2015
Simha Rasi Phalalu 2015 in Telugu
సింహరాశి ఫలాలు 2015 ప్రకారం, ఈ సంవత్సరంలో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆందోళన చెందకండి, కొన్ని చాలా బాగా మరియు కొన్ని సాహసోపేతంగా ఉంటాయి. 2015 మొదటి సగభాగంలో, బృహత్పతి మీ పన్నెండవ గదిలొ మరియు శని మీ నాలుగవ గదిలో ఉంటారు. కావున, మీరు కొన్ని కష్టాలను ఎదుర్కొనవచ్చు. భయపడకండి, ఇది మీ సామర్థ్యాలను పరీక్షించుటకు ఉత్తమ సమయం. మీ ప్రియతములలో కొంతమంది ప్రవర్తన మీకు బాధ కలిగించవచ్చు, కానీ సంవత్సరంలో రెండవ సగ భాగం ఉన్నంతలో మెరుగ్గా ఉంటుంది; మరియు మీ కష్టాలు నెమ్మదిగా మాయమవుతాయి. అయితే, ఈ సమయంలో ఎవరైనా చెప్పిన మాటలను పట్టించుకోకూడదని నా సలహా. సింహరాశి ఫలాలు 2015 ప్రకారం, ప్రశాంతంగా ఉండడానికి మరియు శాంతియుత జీవనానికి ఇది ఉత్తమ మార్గము. ఇంకా, మీ తెలివైన ప్రణాళిక ప్రకారం మీ కష్టకాలాలపై పట్టును సాధిస్తారు. మీరు చాలా తెలివైనవారు. మీరు ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యక్రమాలలో నిమగ్నమైతే మీకు ఉపశమనం కలుగుతుంది. కాబట్టి, ఈ సంవత్సరంలో, విషయాలు ఆసక్తికరంగా జరుగబోతున్నాయి. 2015 లో ఉత్తమ విషయాలను వినియోగించుకోండి మరియు మీలో దాగిఉన్న సామర్థ్యాలను మీరు కనుగొనవచ్చు. ఇది మిమ్మల్ని కొంతవరకూ మానవాతీతులుగా మారుస్తుంది.
సింహ రాశి వారికి 2015 లో పరిహారాలు: ఒక ఆవుకు బియ్యం మరియు పాల మిశ్రమాన్ని అందించండి.
కన్యా రాశి ఫలాలు 2015
Kanya Rasi Phalalu 2015 in Telugu
కన్యారాశివారు, 2015 లో మొదటి సగ భాగంలో, పదకొండవ గదిలీని రాహువు, మీరు అనేకరకాలయిన ప్రయోజనాలను పొందుతారని సూచిస్తున్నాడు. మీకొరకు ఎన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు వేచిఉన్నాయో మీకు ఎప్పుడూ తెలీదు. కన్యారాశి రాశిఫలాలు 2015 ప్రకారం, కుటుంబసభ్యులు కూడా ఆనందకర క్షణాలను అనుభవిస్తారు, కానీ ఐదవగదిలో రాహువు ఉన్నందున ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని చూసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉండండి మరియు ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై ధ్యాస ఉంచండి. వీటన్నిటికీ అదనంగా, మొదటి సగ భాగం, ప్రేమ, పెళ్ళి లేదా పిల్లల కొరకు అద్భుతంగా ఉంటుంది. దీనితో పాటుగా, ఈ సమయం పనికి, వ్యాపారానికి మరియు విద్యకు కూడా అనుకూలమైనది. కన్యారాశి ఫలాలు 2015 ప్రకారం, 2015 లో వేడుక జరుపుకోవడానికి అనేకానేక అవకాశాలు వస్తాయి. అయినా, సంవత్సరం యొక్క రెండవ సగభాగంలో ప్రతి ఒక్కదాని గురించి జాగ్రత్తగా ఉండాలి. మీరు కొంత అప్రమత్తంగా ఉండాలంతే; భయపడాల్సిన అవసరం లేదు, చాలా తీవ్రమైన సమస్య ఏదీ కలగదు. ఖర్చులు పెరగవచ్చు మరియు మీ ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు. ఆందోళన చెందకండి; ఎలాంటి పెద్ద సంఘటనలు జరుగవు. కాబట్టి సహనంతో మరియు తెలివితో పనిచేయడం ముఖ్యం.
కన్యా రాశి వారికి 2015 లో పరిహారాలు: రావి చెట్టుకు క్రమంతప్పకుండా నీటిని అందించాలి.
తులా రాశి ఫలాలు 2015
Tula Rasi Phalalu 2015 in Telugu
తులారాశివారు, 2015 మీకు బాగుంటుంది. మీ కుటుంబవిషయంలో, తులా రాశిఫలాలు 2015 ప్రకారం, కొన్ని చిన్నచిన్న అపార్థాలు కలుగవచ్చు. అయితే, గృహంలో సామరస్యానికి ఆటకం కలుగదు. ఆరోగ్యవిషయంలో కూడా, 2015 బాగుంటుంది. మీరు ఒక కారు లేదా ఇల్లు కొనాలనుకుంటూ ఉంటే, సందిగ్ధావస్థకు లోనవుతారు. ఇది తప్పనిసరిగా నిర్ణయంతీసుకోవాల్సిన పరిస్థితి. 2015 యొక్క రెండవ సగ భాగం మీ ప్రేమకు మరియు వ్యక్తిగత జీవితానికి రోజాపూల సుగంధాలు మరియు చాక్లెట్ల తీపిదనం ఉంటుంది. కాబట్టి, ప్రేమవాహనాన్ని నడపడానికి సిద్ధంకండి. తులారాశి ఫలాలు 2015 ప్రకారం, ఈ సంవత్సరంలో మీ పనిలో ప్రత్యేకంగా జరుగుతుంది. మీకు కొత్త శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ప్రమోషన్ అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ప్రజా సహకారంతో పాటు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయోజనాల అవకాశాలు కూడా బలోపేతం అవుతాయి. అయినా, రెండవగదిలో శని ఉండడం వలన ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. మీరు కొంత పిసినారిగా ఉండాలి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి.
తులా రాశి వారికి 2015 లో పరిహారాలు: సింధూర తిలకం ధరించండి (నుదిటిపై)
వృశ్చిక రాశి ఫలాలు 2015
Vruschika Rasi Phalalu 2015 in Telugu
2015 లో, చాలమటుకు గ్రహాలు మీ వైపే ఉన్నాయి. మీరు సురక్షితమైన స్థితిలో ఉన్నట్టుగా కనబడుతోంది. కాబట్టి, 2015 నీజ్య్ అద్భుతంగా ఉంటుంది. వృశ్చికరాశి ఫలాలు 2015 ప్రకారం, శని స్థితి మాత్రమే కొంత సాహసం కలిగిస్తుంది, మిగిలిన ప్రతి ఒక్క విషయం అద్భుతంగా ఉంటుంది. కోచ్ మాత్రమే ప్రపంచంలో వింతయైనది కాదు, ఆనందకర ప్రయాణం కూడా కొన్నిసార్లు ముఖ్యం. కుటుంబంలో సామరస్యం ఉంటుంది. ప్రేమ విషయాలకు 2015 అనుకూలమైనది. పరవశంగా ఉంది కదూ? అయినా, మొదటి గదిలో శని ఉండడం వలన వివాహజీవితంలో కొంత ఆటకం కలుగుతుంది. కొన్నిసార్లు కొంతసమయం పాటు ప్రేమకొరకు పాకులాడడం సబబే. అదనంగా, ఇది మీకు కొన్ని ఆరోగ్యసంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. బాదపడకండి. గంభీరమైన సమస్యలు ఏవీ లేవు. పనికి కూడా మంచి సమయం. కాబట్టి, బాగా పనిమంతులారా, ఇది మీకు మంచి సమయం. వృశ్చికరాశి ఫలాలు 2015 ప్రకారం, ఆర్థికస్థితి మీకు మెరుగ్గా ఉంటుంది. మీరు షాప్ చేయాల్సిన అన్ని వస్తువులను లిస్ట్ చేయడం ప్రారంభించండి. మరొకవైపు, విద్యార్థులు కష్టపడి చదివిన తరువాత అనుకూల ఫలితాలను పొందగలరు. వ్యాపార విధ్య చదువు విద్యార్థులు సంవత్సరం యొక్క రెండవ సగభాగంలో ఎక్కువగా ఆనందిస్తారు.
వృశ్చిక రాశి వారికి 2015 లో పరిహారాలు: కోతులకు సేవలను అందించండి మరియు మాంసాహారాన్ని మరియు మద్యపానాన్ని వినియోగించడాన్ని నివారించండి.
ధనూ రాశి ఫలాలు 2015
Dhannus Rasi Phalalu 2015 in Telugu
ధనూరాశి వారు, 2015 ప్రారంభంలో, మీ ఎనిమిదవ గదిలో బృహస్పతి ఉన్నందున, అంత అనుకూలంగా ఉండదు. అది ప్రతికూలం కూడా కాదు. పన్నెండవగదిలో శని ఉండడంతో, ఆర్థికవ్యవహారాలు జాగ్రత్తగా నిర్వహించాలి. కానీ వీటన్నింటినీ నిర్వహించడానికి ఆందోళన చెందనవసరం లేదు. ఆర్థిక విషయాలలో కొద్దిపాటి ఆటంకాలు కూడా ఎలాంటి సమస్యలను కొనితెస్తాయో మీకు తెలుసు, అందుకే ఎలాంటి సమస్య పరిష్కరించుకోవడానికైనా కష్టపడి పనిచేయండి. ధనూరాశి ఫలాలు 2015 ప్రకారం, ప్రశాంతమైన మరియు శాంతియుతమైన మనసు గల వారు మాత్రమే దీనిని చేయగలరు. 2015 ప్రకారం, మీరు మీ కుటుంబసభ్యులలో మార్పును గమనిస్తారు. ఈ మార్పు వలన మీరు బాధపడవచ్చు. ఈ సంవత్సరమంతా జీవితం యొక్క అన్ని కోణాల నుండి మిమ్మల్ని శక్తివంతులుగా తయారుచేస్తుంది. అభద్రతాభావం మీలో కలుగవచ్చు, ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. ధనూరాశి ఫలాలు 2015 ప్రకారం, ప్రేమవ్యవహారాలు కూడా అసంతృప్తిగా ఉంటాయి. కానీ, గుర్తుంచుకోండి – “ ప్రతి ఒక్కటీ జరిగేది మన మంచికే” మరొకవైపు, 2015 రెండవ సగభాగంలో, మీ కోరికలన్నీ నిజమవుతాయి. మీ జీవితంలో సంపూర్ణ వెలుగు తిరిగి ప్రకాశిస్తుంది. ఆదాయం పెరుగుతుంది మరియు విద్యార్థులు కూడా మంచి ఫలితాలను పొందుతారు. వావ్! మీ కొరకు సాహసోపేత ప్రయాణం ముందుంది.
ధనూ రాశి వారికి 2015 లో పరిహారాలు: దేవాలయంలో నెయ్యి మరియు ఆలుగడ్డ దానం చేయండి.
మకర రాశి ఫలాలు 2015
Makara Rasi Phalalu 2015 in Telugu
మకర రాశివారు, 2015 లోని మొదటి సగభాగం మీకు అద్భుతంగా ఉంటుంది. మకర రాశి ఫలాలు 2015 ప్రకారం, మీ అద్భుతమైన ప్రణాళిక వలన మీకు విజయం చేకూరుతుంది. మీరు తెలివైనవారు. ప్రతి ఒక్కటీ మీకు అనుకూలంగా జరుగుతుంది. మీరు ఆనందించాల్సిన సమయమిది. ఆర్థిక స్థితి కూడా సంతృప్తికరంగా ఉంటుంది. మీకు ఎన్నో అనుకూలతలు కలుగుతున్నాయనే విషయం కూడా మీకు తెలియదు. మీరు వివాహ వయస్సు చేరుకుంటే, 2015 యొక్క మొదటి సగభాగం, మీకు ఈ విషయంలో సహాయపడుంది. విద్యార్థులు ఆనందంగా ఉంటారు, వారిని ప్రతి ఒక్క విషయంలోనూ విజయం వరిస్తుంది. అయినా, 2015 రెండవ సగభాగంలో, కొన్ని కష్టాలు కలుగవచ్చు, విషయాలు సుదూరంలో ఉండిపోతాయి. అపుడు బృహస్పతి ఎనిమిదవ గదిలో ఉంటాడు. కావున, మీరు ఏపని చేసినా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆందోళన చెందకండి, ఇది మీ సామర్థ్యాలను నిర్ణయించుకోవడానికి, కష్టాలలో స్థిరంగా తట్టుకోవడానికి ఇది ఒక పరీక్ష. దీనితో పాటుగా, మకరరాశి ఫలాలు 2015, మీరు ఎక్కడైనా మదుపుచేసేసమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని చెబుతుంది.
మకర రాశి వారికి 2015 లో పరిహారాలు: 6 పూర్ణ టెంకాయలను ప్రతి నాలుగునెలలకొకసారి నీటిలో వేయాలి.
కుంభ రాశి ఫలాలు 2015
Kumba Rasi Phalalu 2015 in Telugu
కుంభరాశివారు, 2015 మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి ఫలాలు 2015 ప్రకారం, మీరు ప్రేమించువారితో మీ సంభంధాలలో కొన్ని భిన్నాభిప్రాయాలు కలుగుతాయి. కానీ, దు:ఖపడాల్సిన పనిలేదు; ప్రతి ఒక్కటీ మనమంచికే జరుగుతుంది. దీనికి మీ కఠినమైన భాష కూడా ఒక కారణం. కాబట్టి వీలయినంత సౌమ్యంగా మాట్లాడండి. మీ కుటుంబ సభ్యుని ఆరోగ్యం వలన మీరు ఒత్తిడికి గురి కావలసి వస్తుంది. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమయం త్వరగా గడిచిపోతుంది. మరొకవైపు, కుంభరాశి ఫలాలు 2015 ప్రకారం, మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు కోర్టువ్యవహారాలతో తీరికలేకుండా ఉంటారు. కానీ ఆందోళన చెందకండి; మీరు అన్నింటా విజయం సాధిస్తారు. సంవత్సరంలో రెండవ సగభాగం మీ ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. వివాహజీవితం ఆనందకరంగా ఉంటుంది. మన్మథుడు మీపై ప్రభావం చూపుతాడు. మీరు తల్లి/తండ్రి కాబోతారు. పనిలో మంచి ఎదుగుదల ఉంటుంది. ఇది ఆనందించాల్సిన సమయం. ఆదాయం మరియు విద్య కూడా పెరుగుతుంది. ఈ సారి మీరు వేగంగా పురోగమిస్తారని తెలుస్తోంది.
కుంభ రాశి వారికి 2015 లో పరిహారాలు: పూజారికి పసుపుబట్టలను దానం చేయండి.
మీన రాశి ఫలాలు 2015
Meena Rasi Phalalu 2015 in Telugu
మీనరాశివారికి, 2015 మీకు చాలా అందంగా ఉండబోతోంది. మీనరాశిఫలాలు 2015 ప్రకారం, మీ ఇంట్లో ఒక శుభకార్యం జరుగవచ్చు. మీ ఇంట్లో ఆనందకర క్షణాలుంటాయి. అయితే, కొంతమంది కుటుంబసభ్యుల అసభ్య ప్రవర్తన మీకు బాధ కలిగిస్తుంది. కానీ, మీరు దానిని పట్టించుకోవలసిన పనిలేదని నేను సూచిస్తున్నాను. అధిరోహణ రాశిపై కేతువు ప్రాబల్యం ఉండడంతో మీరు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇలాంటి పరిస్థితిలో, మీ ఆహారపు అలవాట్లపై దృష్టి ఉంచడం ముఖ్యం. మీనరాశిఫలాలు 2015 ఇలా చెబుతుంది – వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ప్రేమ వ్యవహారాలకు మంచి సమయం, కానీ ఏడవగదిలో రాహువు ఉండడం మంచిది కాదు. కావున, ప్రేమ మరియు విశ్వాసం అనేవి అతిపెద్ద విషయాలు, అవి ఎల్లప్పుడూ ఉండాల్సినవే. మీరు మెరుగైన ఉద్యోగం పొందుతారు. మీరు గింగిరాలు తిరగవచ్చు. అయినా, కష్టపడడం మరియు బాధ్యతలు పెరగవచ్చు. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఇంకా, ప్రయోజనాలలో పెరుగుదలకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇది రెండురెట్ల వేడుక సమయం, అనేక మంచి విషయాలు మీ మార్గంలో వస్తున్నాయి. విద్యకు అనుకూలమైన సమయం. కానీ 2015 యొక్క రెండవ సగభాగంలో కొన్ని సమస్యలు రావచ్చు.
మీన రాశి వారికి 2015 లో పరిహారాలు: బియ్యం, బెల్లం మరియు అలసందలు దానం చేయాలి.
పండిత్ హనుమాన్ మిశ్రాద్వారా
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Rashifal 2025
- Horoscope 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025