కన్యా రాశి ఫలాలు 2020 - Kanya Rasi Phalalu 2020: Yearly Horoscope

Kanya Rasi Phalalu 2020కన్యా రాశి ఫలాలు 2020 ప్రకారము, ఈసంవత్సరములో మీయొక్క జీవితములో అనేకమార్పులను చూస్తారు. దీనికి కారణము ముఖ్యగ్రహాలుయొక్క ప్రభావము.జనవరి24న శని మీయొక్క 5వఇంట ప్రవేశిస్తాడు.గురుడు మర్చి 30వతారీఖున అదే ఇంటిలోకి ప్రవేశిస్తాడుతరువాత, జూన్ 30న తిరిగి 4వఇంట ప్రవేశిస్తాడు.నవంబర్ 20వరకు అదేఇంట సంచరిస్తాడు.5వఇంట ప్రవేశించినప్పుడు, రాహువు సెప్టెంబర్ మధ్యవరకు 10వఇంట తరువాత 9వఇంట సంచరిస్తారు.

ఈసంవత్సరము విదేశీప్రయాణములు చేసేఅవకాశము ఎక్కువగా ఉన్నది.చదువు మరియు ఉద్యోగానికి మీరు ప్రయత్నిస్తున్నట్టుఅయితే, మీకు ఈసంవత్సరము విదేశాలు వెళ్ళడానికి అవకాశములు పుష్కలముగా ఉన్నవి.మీరు ఉగ్యోగములో బదిలీకోసము ఎదురుచూస్తుంటే ఈసమయము అనుకూలముగా ఉంటుంది. ఒకేవేళ ఇంటికి దూరముగా పనిచేస్తున్నట్లయితే మీ ఇంటికిదగ్గరలోకి మారతారు.వ్యాపారరంగములో ఉన్నవారు మీయొక్క వ్యాపారాభివృద్ధికి అనేక ప్రదేశములు తిరగవలసి ఉంటుంది.ఎవరైతే సృజనాత్మకతవైపు పనిచేస్తున్నారో వారికి ఈసంవత్సరము గ్రహాలు అనుకూలిస్తాయి.

జీవితములో చిన్నచిన్న సమస్యలు సాధారణము.ఈసంవత్సరముకూడా మీరు కొన్నిపరిక్షలను ఎదురుకొనవలసి ఉంటుంది.కన్యా రాశి ఫలాలు 2020ప్రకారము, మీరు మంచి శక్తిమంతులు, దృఢమైనవారు మరియు ధైర్యము కలవారు.కానీ అతిగా వ్యవహరించకండి.సహనము చాలా అవసరము.మీయొక్క పనులను మీరు తేలికగా పూర్తిచేస్తారు, మీజీవితభాగస్వామి దానికి అవసరమైన సలహాలు అందిస్తారు.ఈసంవత్సరం చాలా పనులను పూర్తిచేస్తారు.మీయొక్క రుణాలను కట్టివేస్తారు.తద్వారా మనశాంతిని పొందుతారు.మీ తోబుట్టువులతో మీయొక్క సంభందాలు బాగుంటాయి.వారు మీయొక్క నిర్ణయాలను మరియు మిమ్ములను నమ్ముతారు.మీయొక్క సంబంధాల్లో దెబ్బతినే ఎటువంటి వివాదాల్లోనూ తలదూర్చకండి.మీస్నేహితులు మీచుట్టూ ఒకసహృదయకర వాతావరణాన్ని ఏర్పరుస్తారు.మీరు సరైనమార్గమువైపు నడిచేటట్టు మిమ్ములను ప్రోత్సహాహిస్తారు.

ఈఫలితాలు చంద్రునియొక్క సంచారము ఆధారముగా గణించబడినది.మీకు ఒకవేళ చంద్రరాశి గణన తెలియనట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి. చంద్రరాశి కాలిక్యులేటర్

కన్యా రాశి ఫలాలు 2020 వృత్తి :

కన్యా రాశి ఫలాలు 2020 ప్రకారము,వృద్ధి, విజయము,అవకాశములు మనము తెలివితేటలద్వారా మరియు కష్టంద్వారా సంపాదించుకోవాలి.2020లోమీయొక్క వృత్తిపరమైన జీవితములో ఎదుగుదలను చూస్తారు.మీరు మీయొక్క స్థానాన్నిలేదా పనిచేసే చోటుని మార్చుకునే అవకాశములు ఉన్నవి.ఉద్యోగాల్లో స్థానచలనము లేదా వ్యాపారాల్లో ప్రయాణాలు తప్పానిసరిగా ఉంటాయి.ప్రారంభసమయము మీకు అనుకూలముగా ఉంటుంది. మీయొక్క ఉన్నతాధికారులు మీయొక్క పనితీరును మెచ్చుకుంటారు.నూటికి నూరుశాతము మీయొక్క పనికి మీరు న్యాయము చేస్తారు.మీరు ఒకవేళ బహుళజాతి సంస్థల్లో పనిచేస్తున్నవారుఅయితే మీయొక్క పనిని గుర్తిస్తారు.మీయొక్క ఎదుగుదల గణనీయముగా ఉంటుంది.

2020 జాతకముప్రకారము వృత్తిపరమైన జీవితములో మీరు ఈసంవత్సరము నెమ్మదిగా మరియు నిలకడగా ఎదుగుతారు.ఈసంవత్సరము మీకు చాలా అద్భుతముగా ఉంటుంది.మీరు ఒకవేళ ఉద్యోగము మారాలి అనుకుంటే, మీకుఅనుకూలముగా ఫలితాలు ఉంటాయి.సంవత్సరంమధ్యలో మీకుఏమున్నదో దానికి సంతృప్తి చెందుతారు.ఆర్ధికలాభాలు అనేవి 2020లో మీకు సాధారణవిషయముగా ఉంటుంది.మీయొక్క ఆశయాలన్నిటిని మీరు నెరవేరుస్తారు.

కన్యా రాశి ఫలాలు 2020 ఆర్ధికము:

కన్యా రాశి ఫలాలు 2020ప్రకారము, మీయొక్క రాబడి నిలకడగా ఉంటుంది.తద్వారా, మీయొక్క ఆర్ధికస్థితి ఈ సంవత్సరము దృఢముగా ఉంటుంది.మీధనము ఎందులోనైనా ఇరుక్కుపోతే,అది బయటకు వస్తుంది.మీరు కొత్త ఇంటిని లేదా వాహనమును కొనుగోలుచేస్తారు.వ్యాపారములో పెట్టుబడులు పెట్టడము కలసివస్తాయి. వీటితోపాటుగా మీకుఊహించనిదారుల్లో రాబడిని పొందుతారు.ఏప్రిల్ నుండి జులైవరకు షేర్మార్కెట్ ,గ్యాంబ్లింగ్ , లాటరి ద్వారా లాభాన్నిఆర్జిస్తారు.ఇవి ఆమోదయోగ్యమైనవి కావు.ఆర్హికపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకుకలసి వస్తాయి.విజయావకాశములను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టండి.మీయొక్క కార్యాలయప్రతినిధులనుండి మీరు మన్ననలు పొందుతారు.దేవునిదయ వల్ల మీరుఆర్ధికంగా దృఢముగా ఉంటారు.మీయొక్క రాబడిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు.ఖర్చులపై నియంత్రణ అవసరము మరియు పరిస్థితులను పూర్తిగా అర్ధంచేసుకున్నాకే లావాదేవీలు జరపండి.

కన్యా రాశి ఫలాలు 2020 విద్య:

కన్యా రాశి ఫలాలు 2020 ప్రకారము, ఈరాశి విద్యార్థులు అన్నింటా విజయాలను అందుకుంటారు. స్వతంత్రముగా ఎదుగుతారు.ఎవరైతే చదువులను పూర్తిచేస్తారో వారికి ఉద్యోగఅవకాశము లభిస్తుంది. సెప్టెంబర్ నెలలో, ఉన్నత చదువులకోసము విదేశాలకు వెళ్లే అవకాశము లభిస్తుంది.మీయొక్క పనితీరు అద్భుతముగా ఉంటుంది.మీరు కష్టపడి పనిచేయుటవల్ల మీయొక్క సమస్యలనుండి సులభముగా బయటపడతారు.ఏప్రిల్ నుండి జులైవరకు కొంతమంది మీయొక్క భవిష్యత్తుకొరకు సహకరిస్తారు. నేర్చుకోవటంలో ఎల్లపుడు మీరు ఆసక్తిని కనపరుస్తారు.మీరు మీయొక్క ఆశయాలను నెరవేర్చుకుంటారు. ఎవరైతే పోటీపరీక్షలకి చదువుతున్నారో వారు విజయాలను అందుకునే అవకాశము ఉన్నది.మీయొక్క కఠోరశ్రమ మరియు అంకితభావము మీయొక్క విజయానికి ముఖ్యకారణము అవుతాయి.

కన్యా రాశి ఫలాలు 2020 కుటుంబజీవితము:

కన్యా రాశి ఫలాలు 2020 ప్రకారము,మీయొక్క కుటుంబ జీవితము అనుకూలముగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీయొక్క సంబంధాలు దృఢముగా ఉంటాయి మరియు వారినుండి గౌరవమర్యాదలను అందుకుంటారు.2020 ప్రారంభములో ఆనందముగా గడపటానికి అడుగులువేస్తారు.మీరు మీయొక్క ప్రతిబాధ్యతను చిరునవ్వుతో స్వీకరిస్తారు.ప్రశాంత మరియు ఆనందకర వాతావరణము చోటుచేసుకుంటుంది. చాలాకాలము నుండి మిమ్ములను ఇబ్బంది పెడుతున్న సమస్య ఈసంవత్సరములో తీరిపోతుంది.జులై నుండి నవంబర్ మధ్యవరకు కుటుంబబాధ్యతలను నిర్వహించటంవల్ల మీయొక్క ఖ్యాతి పెరుగుతుంది.

కుటుంబసభ్యులకు తగిన సమయము కేటాయించుటద్వారా వారికి ప్రాముఖ్యతను ఇవ్వండి.వారిని అర్ధంచేసుకోండి మరియు వారియొక్క పరిస్థితులను తెలుసుకోండి.వారు మీకు నూతన దృక్ఫథాన్ని ఇవ్వతామే కాకుండా మీపై నమ్మకముకూడా పెరుగుతుంది.మీరు మీకుటుంబానికి కాపలాదారునిగా మరియు సలహాదారునిగా వ్యవహరిస్తారు.మీరుకనుక ఒత్తిడికి లోనవుతే కుటుంబములోని అందరూకూడా ఒత్తిడికి లోనవుతారు.వారితో తెలివిగా వ్యవహరించండి.కుటుంబజీవితములో మరియు వ్యక్తిగతజీవితములో ఇతరుల జోక్యం లేకుండా చూసుకోండి.

కన్యారాశిఫలాలు 2020 వివాహము మరియు సంతానము:

కన్యా రాశి ఫలాలు 2020 ప్రకారము, ఈ సంవత్సరం వైవాహికజీవితమువారు సుఖముగా మరియు ఆనందముగా జీవిస్తారు.మీయొక్క భాగస్వామి సంపాదిస్తున్నవారు అయితే,వారు అనుకున్నది సాధించి,తద్వారా ఆర్ధికలాభాలను అందుకుంటారు.మేనుండి సెప్టెంబర్లో స్దానచలనానికి అవకాశము ఉన్నది.ఫలితముగా కొంతకాలము విడిగా ఉండవలసి ఉంటుంది.కొన్నిసార్లు దూరముగా ఉండటం బంధాలను మరింత దృఢపరుస్థాయి.మీవిషయములోకూడా అదినిజమవుతుంది. మే15నుండి సెప్టెంబర్15వరకు ఇద్దరికీ కొన్ని ఆందోళనలు తలెత్తుతాయి.ఒకరినొకరు సహకరించుకొని ఇద్దరిమధ్యఉన్న మనస్పర్థలను తొలగించుకోండి. తరువాత డిసెంబర్ 15వరకు పరిస్థితులు మీయొక్క నియంత్రణలోనే ఉంటాయి.2020లోని చివరి 15రోజులు కొన్నిమార్పులను తీసుకువస్తుంది.కానీ, మీయొక్క వైవాహికజీవితము మాత్రము అందముగా ఉంటుంది.

2020ప్రారంభములో మీయొక్క సంతానము అతిసాధారణముగా వ్యవహరిస్తారు.తరువాత, రోజులు గడుస్తున్నకొద్దీ, అంటే ఏప్రిల్ నుండి వారియొక్క చదువుల్లో పనితీరు మెరుగుపడుతుంది మరియు వీరియొక్క స్వభావము కూడా మారుతుంది.మీసంతానము యొక్క ఆరోగ్యవిషయములో మే నుండి సెప్టెంబర్ వరకు జాగ్రత్త వహించండి.చాలాకాలము నుండి పిల్లలకొరకు ప్రయత్నిస్తుంటే ఈసంవత్సరము మీయొక్క కోరిక నెరవేరే సూచనలు ఉన్నవి.వివాహముకానీవారికి వివాహము అయ్యే సూచనలు ఉన్నవి.

కన్యా రాశి ఫలాలు 2020 ప్రేమ:

కన్యారాశిఫలాలు 2020 ప్రకారము, ఈ సంవత్సరము మీయొక్క ప్రేమజీవితములో అనేక అనుకూలమార్పులు సంభవిస్తాయి.శని 5వఇంట జనవరి 24నుండి సంచరించుటవల్ల మీయొక్క ప్రేమసంబంధాల్లో మరింత లోతుగా పెరుగుతాయి.మీరు ప్రేమయొక్క అర్ధాన్ని గ్రహిస్తారు మరియు మీయొక్క ప్రియమైనవారిపై తగినంత సమయాన్ని కేటయిస్తారు.ఈ విధముగా మీరు మీయొక్క జీవితానికి భిన్నముగా ఉంటారు.అయినప్పటికీ, మే11 నుండి సెప్టెంబర్29వరకు,కొన్ని ఎత్తుపల్లాలను చూస్తారు.నిజాయితీగా మరియు గౌరవప్రదముగా ఉండండి.

ఫిబ్రవరి నెలలో మీయొక్క జీవితము ఆనందముగా ఉంటుంది.మీరు మీయొక్క సమయాన్ని మిప్రియమైనవారితో కలిసి ఆనందముగా గడుపుతారు.మీయొక్క ప్రియమైనవారు మీకుసహకరిస్తారు.మీయొక్క బంధము అనుకూలముగా ఉన్నది అనిభావిస్తారు.ఒంటరిగా ఉన్నవారు ఈ 2020లో జంటగా అయ్యే అవకాశముఉన్నది.ఈ సంవత్సరము మీయొక్క సంబంధాలు దృఢముగా ఉంటాయి.ఇది నమ్మకాన్ని, సమతుల్యతను,ఆనందాన్ని తెలియచేస్తుంది.కాబట్టి బంధం దృఢముగా ఉంటుంది.

కన్యా రాశి ఫలాలు 2020 ఆరోగ్యము :

కన్యా రాశి ఫలాలు 2020 ప్రకారము,ఆరోగ్యమే మహాభాగ్యము అనేది ఎంతనిజమో తెలుస్తుంది.ఆరోగ్యముగా ఉంటేనే మీరు మీయొక్క జీవితాన్ని ఆనందముగా గడపగలరు.కన్యారాశివారికి ఆరోగ్యపరముగా ఈ2020వ సంవత్సరము అత్యంత అనుకూలముగా ఉంటుంది.మీరు చురుకైనవారీగా వ్యవహరిస్తారు.మీరు ఏపనిచేసిన మీకొరకు చేసుకుంటారు.ఫలితముగా మీయొక్క వ్యక్తిగతజీవితము మరియు వృత్తిపరమైన జీవితము ఆనందముగా ప్రకాశిస్తుంది.మీయొక్క జీవనవిధానము అన్నివిధాల బాగుంటుంది.ఇది మీయొక్క జీవితంలో ఇతర విషయాలపై ప్రభావాన్నిచూపెడుతుంది.అతిగా పనిచేయవద్దు.తరచుగా విశ్రాంతి తీసుకుంటూ ఉండండి.

గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి , ఎటువంటి పెద్దఅనారోగ్యాలకు ఈ 2020లో కన్యారాశివారు గురిఅవ్వరు.కానీ , ఎప్పటికి అనారోగ్య సూచనలను నిర్లక్ష్యము చేయకండి.ఇది మిమ్ములను వ్యాధులకు గురిచేసే అవకాశములు ఉన్నవి.నిర్లక్ష్యము మంచిదికాదు.ముఖ్యముగా ఆరోగ్యవిషయములో అసలు మంచిదికాదు.మీయొక్క నాడీమండల వ్యవస్థ లేదా జీర్ణాశయవ్యవస్థ కొన్ని సమస్యలను ఎదురుకుంటారు.కావున, జాగ్రత్త అవసరము.వ్యాయామము చేసుకుని ఎల్లపుడు దృఢముగా ఉండండి.

కన్యా రాశి ఫలాలు 2020 రెమిడీలు :

కన్యా రాశి ఫలాలు 2020 ప్రకారము,రెమిడీలను అనుసరించటంవల్ల, మీరు ఈ సంవత్సరము మీజీవితాములో ఎదురయ్యే సమస్యలనుండి కొంత ఉపసమానమును పొందవచ్చును .

  • మీరు నీలసహిత శని స్తోత్రమును ప్రీతినిత్యము పఠించాలి.
  • విష్ణుసహస్రనామాన్ని కూడా పఠించవలసి ఉంటుంది.ఆవుకు ఆకుకూరలను ఆహారముగా ఇవ్వండి మరియు ఆవు వెనుకభాగములో 3సార్లు నీమరండి.
  • వీటితోపాటుగా మీరు విదారమూల్ ను ధరించండి. ఇది బుధుడియొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది, మరియు అజీర్తి,రక్తపోటు, కడుపులోపుండ్లు,మొదలగునవి తగ్గీస్తుంది మరియు శరీరదృఢత్వాన్ని పెంచుతుంది.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer