మూల నక్షత్రం ఫలాలు
మీరు చక్కటి స్వభావం కలిగిన మరియు శాంతి ప్రేమికుడు. న్యాయం పట్ల మీకు అపారమైన విశ్వాసం ఉంటుంది. ప్రజలతో మీ సంబంధాలు బాగుంటాయి మరియు మీ స్వభావం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఆరోగ్యం విషయానికి వచ్చినట్లయితే, మీరుచాలా అదృష్టవంతులు ఎందుకంటే మీరు సాధారణంగా చక్కగా మరియు దృఢంగా ఉంటారు. మీరు బలమైన మరియు దృఢమైన ఆలోచనలు ఉంటాయి. సామాజికమైన పనులకు విషయానికి వచ్చే సరికి, వీటిలో మీరు ఎంతో చురుకుగా పాల్పంచుకుంటారు. పనుల్లో మీ యొక్క లక్షణాల వల్ల, మీరు పేరుప్రఖ్యాతులను సంపాదించుకుంటారు. మీ జీవితం కొన్ని స్థిరమైన నిబంధనల ఆధారంగా సాగుతుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కొనగల సామర్థ్యం మీకు ఉంటుంది మరియు అన్నిరకాల అడ్డంకుల్ని చేధించి మీరు మీ గమ్యస్థానానికి చేరుకుంటారు. దేనినైనా చేయాలని మీరు నిర్ణయించుకున్న తరువాత, మీరు ఆ పనిని సాధిస్తారు. మీరు భవిష్యత్తు గురించి టెన్షన్ పడరు, అదేవిధంగా మీ జీవితంలో సమస్యల గురించి ఆందోళన పడరు. దేవునిపై మీకు అపరిమితమైన విశ్వాసం ఉంటుంది. అందువల్లనే మీరు ప్రతిదీ కూడా ఎవరో ఒకరిపై విడిచిపెడతారు. మీరు ఇతరులకు చక్కటి సలహాలు ఇస్తారు, అయితే, మీ స్వంత విషయాలకు వచ్చేసరికి ఇది సరిగ్గా పనిచేయదు. మీ పనిలో, మీరు చాలా నిజాయితీగా ఉంటారు. అదనంగా, మీ మనస్సు సాధారణంగా ప్రశాంతంగా ఉండకపోవచ్చు. మీకు చాలా విషయాలు తెలుసు మరియు రాత, కళలు అదేవిధంగా సామాజిక రంగంలో మీరు ప్రత్యేకమైన విజయాన్ని సాధిస్తారు. స్నేహితులకు ఎక్కువగా దాన దర్మాలు చేయడం వల్ల మీరు సమస్యలను ఎదుర్కొనవచ్చు. మీ ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు పెట్టే స్వభావం ఉంటుంది. మీ పుట్టిన స్థలం నుంచి మీరు దూరంగా ఉన్నప్పుడు మీకు మరింత ఎక్కువ ప్రతిభ మరియు అదృష్టం తోడవుతాయి. విదేశాలకు వెళ్లేందుకు మీకు ఏదైనా అవకాశం లభించినట్లయితే, అది మీకు చాలా లాభాన్ని కలిగిస్తుంది. మీ కుటుంబం ద్వారా మద్దతు లభించినా లేదా లభించకపోయినా మీరు మీ స్వంత విధిని లిఖించుకుంటారు. మీరు ఎంతో నమ్మకంా ఉంటారు కనుక, మీకు అనేకమంది స్నేహితుంటారు. చదువు విషయానికి వస్తే, మీరు బాగా చదువుతారు మరియు ఫిలాసఫీలో మీకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. మీరు ఆదర్శవాది మరియు మీ ఆలోచలను కలిగి ఉంటారు. సంపద మరియు గౌరవాల్లో ఒకదానికి ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, మీరు మర్యాదను ఎంచుకుంటారు.మీరు ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటిలోనూ రాణిస్తారు, అయితే మీరు ఉద్యోగం చేయడానికి ఇష్టపడతారు. మీరు ఎక్కడకు వెళ్లినా కూడా, మీ రంగంలో ఉన్నతస్థానానికి చేరుకుంటారు. శారీరకంగా కష్టపడి పనిచేయడానికి బదులుగా, ఇతరుల ద్వారా ఆ పనిని ఎలా పొందాలనే విషయం మీకు బాగా తెలుసు. ఆధ్యాత్మికత విషయాలపై ప్రత్యేక ఆసక్తి కలిగి ఉండటం వల్ల మీరు డబ్బకు ఆశపడరు. అవసరం ఉన్న వ్యక్తులకు సహాయపడటం కొరకు మీరు అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు, ఇది మీకు చాలా గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. స్నేహాల విషయానికి వస్తే, సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మీకు స్నేహితులుగా ఉంటారు. మీ ప్రాపంచిక జీవితం మొత్తం కూడా సంతోషం మరియు విలాసంతో నిండి ఉంటుంది మరియు వాటిని మీరు బాగా ఆస్వాదిస్తారు.
విద్య మరియు ఆదాయం
మీరు అనుకూలమైన వృత్తుల్లో, ఫార్మాస్యూటికల్స్; దంతవైద్యుడు; మంత్రి; లెక్చరర్; జ్యోతిష్కుడు; పోలీసు అధికారి; గూఢచారి; జడ్జి; సైనికుడు; పరిశోధకుడు; బాక్టీరియాపై పరిశోధకుడు; వ్యోమగామి; వ్యాపారవేత్త; రాజకీయాలు; గాయకుడు; కౌన్సిలర్; మందులు మరియు మూలికలు సంబంధించిన వ్యాపారం; అంగరక్షకుడు లేదా భద్రతా సిబ్బంది; కుస్తీ; గణిత శాస్త్రజ్ఞుడు లేదా కంప్యూటర్ నిపుణుడు; మనస్తత్వవేత్త; బొగ్గు పెట్రోలియం సంబంధిత పనులు మొదలైనవి.
కుటుంబ జీవితం
తన స్వయం కృషి ద్వారా పైకి వచ్చిన వ్యక్తి మీరు. మీ కుటుంబం మీకు మద్దతు ఇస్తుందా లేదా అని విషయాన్నిమీరు పట్టించుకోరు. మీ వైవాహిక జీవితం సాధారణంగా పోరాటాల మయంగా ఉంటుంది. జీవిత భాగస్వామిలో మంచి మద్దతుదారు లక్షణాలన్నీ ఉంటారు.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025