కుంభరాశిలో సూర్య సంచారం - రాశి ఫలాలు
విశ్వములోని సమస్త జీవరాశికి ప్రాణదాత మరియు ఆరోగ్యప్రదాత సూర్యభగవానుడు. సూర్యుడు 13 ఫిబ్రవరి 2020న మధ్యాహనము 02:53ని కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు.కుంభరాశి సూర్యుయిని ఆధీనములో ఉండే రెండొవ రాశి, మొదటిది మకరరాశి. కుంభరాశి సాధారణముగా అగ్ని స్వభావమును కలిగిఉంటుంది. అటువంటి రాశియొక్క లగ్నములోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు.ఈ సంచార ఫలితముగా 12రాశులవారికి వివిధ ఫలితములను అందిస్తుంది. మీరాశులకు ఎలాఉన్నది తెలుసుకోండి.
Read in English : The Sun Transit in Aquarius
మేషరాశి ఫలాలు:
మేషరాశిలో, సూర్యుడు దానియొక్క సంచార సమయములో11వఇంట సంచరిస్తాడు. ఇది మీయొక్క5వ ఇంటికి అధిపతి. ఈ సంచార ప్రభావంవలన, మీయొక్క ఆర్ధికరాబడి విపరీతముగా పెరుగుతుంది. అనేక మార్గములలో లాభాలను పొందుతారు. కార్యాలయాలలో మీయొక్క ఉన్నతదధికారుల మన్నన్నలు పొందుతారు. వారు మీయొక్క పనిపట్ల సంతృప్తిని వ్యక్తపరుస్తారు. ఇదిమీకు అనేక సౌకర్యాలను కలిగిస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలను ఆర్జించే అవకాశముంది. మీయొక్క ప్రత్యర్థులకన్నా మీరు బలాన్ని పుంజుకుంటారు.విద్యార్థులకు ఈసమయము అత్యంత అనుకూలముగా ఉంటుందని చెప్పవచ్చును. మీకు వివాహము అయినట్లుగా ఐతే, మీయొక్క సంతానము మంచి పురోగతివైపు పయనిస్తారు. ప్రేమకు సంబంధించిన వ్యవహారములు మీకు అనుకూలముగా ఉన్నవి. కావున ఈయొక్క సూర్య సంచార ప్రభావంవలన మీకు ఈసమయము అనుకూలముగా ఉంటుంది.
పరిహారము: సూర్యభగవానుని అనుగ్రహము పొందుటకు ప్రతిరోజు ఆదిత్యహృదయమును పఠించండి.
వృషభరాశి ఫలాలు :
వృషభరాశిలో సూర్యభగవానుడు 4వఇంటి అధిపతి. ఈసంచార సమయములో సూర్యుడు 10వఇంట సంచరిస్తాడు.ఈసమయములో, ఇదిమీకు మంచిబలాన్ని అందిస్తుంది.ఫలితముగా మీరు అన్నిరకాలుగా విజయాలను అందుకుంటారు.వృత్తిపరంగా మీరు ఉన్నత స్థానమునకు చేరుకుంటారు. మీయొక్క పేరుప్రఖ్యాతలు వుద్దిచెందుతాయి.ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఇంక్రెమెంట్లు మరియు ప్రమోషన్లు సంభవించే అవకాసమున్నది.గవర్నమెంట్ ఉద్యోగమూలకొరకు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారు విజయాలను అందుకునే అవకాశమున్నది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రభుత్వనివాసమును మరియు వాహనమును పొందే అవకాశముంది.తల్లితండ్రుల ఆశీస్సులు పొందేఅవకాశముంది. మీతండ్రిగారు సహాయసహకారములు అందిస్తారు.వ్యాపారస్తులకు అనుకూలముగా ఉంటుంది. మంచి లాభాలు ఆర్జిస్తారు.
పరిహారము: బంగారముతో చేయబడిన సూర్యునియొక్క లాకెట్ కొనుక్కుని, ఆదివారము రోజున మీరు మీయొక్క మేడలో ధరించండి.
మిథునరాశి ఫలాలు:
మిథునరాశివారి 3వఇంటికి సూర్యుడు అధిపతి. ఈసంచార సమయములో, మీయొక్క 9వఇంట సంచరిస్తాడు. ఫలితముగా మీరు సమాజములో గుర్తింపబడతారు.వివిధ రంగములలో విజయములను అందుకొనుటద్వారా మీరు అనేక ఆర్ధికలాభాలను పొందుతారు. ప్రభుత్వంలనుండి ఆకస్మిక ధనలాభములను అందుకుంటారు. అనగా ఎవరిజాతకములో వివిధ అనుకూల యోగములు ఉన్నవో వారికి ఈసమయము అనుకూలముగా ఉంటుంది. తండ్రిగారి ఆరోగ్యము కొంత క్షీణిస్తుంది. ఆయన కొన్ని సమస్యలను ఎదురుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. మీ తిబుట్టువుల విజయములపట్ల మీరు కొంత విచారము వ్యక్తం చేసే అవకాశమున్నది. విదేశీ ప్రయాణములు అనుకూలముగా ఉన్నవి.
పరిహారము : రాగి చెంబుతో నీటిని తీసుకుని సూర్యభగవానుడికి ప్రతిరోజు నీటిని అర్పించండి.
కర్కాటకరాశి ఫలాలు:
కర్కాటకరాశివారి యొక్క 2వఇంటికి సూర్యుడు అధిపతి.ఈ సమయములో మీయొక్క 8వఇంట సంచరిస్తాడు. ఫలితముగా మీయక్క జీవితములో అనుకోని కార్యక్రమములు చేయవలసి ఉంటుంది. సూర్యుడు ఈస్థానములో సంచరించుటవల మీకు మిశ్రమఫలితాలు గోచరిస్తాయి.ఒకవైపు మీయొక్కపూర్వీకులఆస్తిని మీరు పొందే అవకాశముంది. ఇంకోవైపు మీతండ్రి ఆరోగ్యము దెబ్బతినే అవకాశముంది.కావున మీరు వారిని జాగ్రతగా చుసునుట చెప్పదగిన సూచన. మీరు ఏదైనా చట్టవ్యతిరేక పనులలో పాలుపంచుకున్నట్లయితే మీరు తగిన మూల్యము చెల్లించక తప్పదు. మీసన్నిహితులనుండి మీయొక్క పాతరహస్యములు బయటపడే అవకాశముంది. ఇది మీయొక్క ప్రతిష్టను దెబ్బతీస్తుంది. మీయొక్క అత్తింటివారినుండి మీరు ఆర్ధిక ప్రయిజనములు పొందే అవకాశముంది. మీ అత్తింటివారితో కలిసి మీరు కొత్తవ్యాపారములు చేపట్టే అవకాశమున్నది. మీ జీవితభాగస్వామి ఆరోగ్యము దెబ్బతింటుంది. వారి ఆరోగ్యముతో పాటుగా మీరు మీయొక్క ఆరోగ్యమును జాగ్రతగా చేసుకొనుట మంచిది. వ్యాపారములో పెట్టుబడులకు ఇది అనువైన సమయము కాదు. కావున అటువంటి ఆలోచనలను విరమించుకొనుట మంచిది.
పరిహారము : ఆదివారము మీరు గోమాతకు బెల్లము మరియు గోధుమపిండిని ఆహారముగా నివేదించండి.
సింహరాశి ఫలాలు:
సూర్యడు మీ రాశిచక్రం యొక్క పాలక ప్రభువు కాబట్టి, దాని సంచారము మీ కోసం ప్రత్యేక ప్రభావాలను కలిగి ఉంటుంది. కాబట్టి, కుంభం లో ఉన్న సమయంలో, రాజ గ్రహం మీ ఏడవ ఇంటి గుండా కదులుతుంది. ఈ సంచారము ప్రధానంగా మీ ఆరోగ్యం, వ్యక్తిత్వం, మీ సంయోగ జీవితం మరియు మీ జీవితంలోని కొన్ని ఇతర సంఘటనలను ప్రభావితం చేస్తుంది. మీ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది మరియు మునుపటితో పోలిస్తే, మీరు శారీరకంగా చాలా స్థిరంగా ఉంటారు. మీరు ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుంటే, ఈ వ్యవధిలో అది ముగిసిపోతుంది. మరోవైపు, కొన్ని సమస్యలు మీ సంయోగ జీవితాన్ని అనుగ్రహించగలవు. మీరు మీ జీవిత భాగస్వామి పట్ల చాలా ప్రత్యేకమైన ప్రవర్తనను అందిస్తారు. కానీ, కొన్ని అహం మరియు నిగ్రహ సమస్యలు మీ జీవిత భాగస్వామికి సంభవించవచ్చు, ఇది మీ వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంతలో, వ్యాపారంలో ఉన్నవారు కొన్ని అనుకూలమైన ఫలితాలను ఎదుర్కొంటారు. ఈ సంచారము కారణంగానే వాణిజ్య సంస్థలలో వాంఛనీయ లాభాలు లభిస్తాయి. మీ సామాజిక స్థితికి వస్తే, అది కూడా కఠినంగా పెరుగుతుంది.
పరిహారం: మీరు ఆదివారం మీ ఉంగరపు వేలుపై రాగి ఉంగరంలో ఉత్తమ నాణ్యత గల కెంపు రత్నాన్ని ధరించాలి.
కన్యారాశి ఫలాలు:
రాశిచక్రం కన్య కోసం, సూర్య దేవ్ లేదా సూర్యుడు మీ పన్నెండవ ఇంటి పాలక ప్రభువు. మరియు దాని గ్రహ కదలిక సమయంలో, ఇది మీ ఆరవ ఇంట్లోకి కదులుతుంది. సాధారణంగా, ఆరవ ఇంట్లో సూర్యుని సంచారము సానుకూల ఫలితాలను పొందుతుంది. మీ రాశిచక్రంపై ఈ సంచారము ప్రభావం గురించి మేము వివరంగా మాట్లాడితే, మీరు వివిధ చట్టపరమైన విషయాలలో విజయం సాధిస్తారని మరియు మీ ప్రత్యర్థులను విజయవంతంగా అధిగమిస్తారని చెప్పవచ్చు. మీ ఖర్చులలో సరైన మొత్తంలో బ్యాలెన్స్ ఉంటుంది, ఎందుకంటే మీరు చాలా అవసరమైన వస్తువులపై మాత్రమే డబ్బు ఖర్చు చేయడం కనిపిస్తుంది. పర్యవసానంగా, మీ ఆర్థిక పరిస్థితి స్థిరమైన స్థితిలో ఉంటుంది. మీరు ప్రమాదకరమైన పరిణామాలను ఎదుర్కోవలసి రావచ్చు కాబట్టి కోర్టు నిషేధించిన ఏ చర్యలోనూ పాల్గొనకూడదని గుర్తుంచుకోండి. మీ ఆరోగ్యం విషయానికి వస్తే, మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కాలానుగుణ జ్వరం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీలో కొంతమందికి విదేశీ జర్నీలు చేపట్టే అవకాశాలు కూడా లభిస్తాయి. పోటీ పరీక్షలకు సన్నాహాలు చేస్తున్న వారు సంపన్న ఫలితాల స్వీకరణ ముగింపులోనే ఉంటారు. మంచి పనిని కొనసాగించండి మరియు సమృద్ధిగా విజయం సాధించడానికి మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వండి.
పరిహారం: మీరు చండిదేవిని పూజించి ఆమెకు ఎర్రటి పువ్వులు అర్పించాలి.
తులారాశి ఫలాలు :
తులారాశి యొక్క 11వ స్థానమునకు సూర్యుడు అధిపతి. ఇదిమీకు అనుకూల ఫలితాలను అందిస్తుంది. ఈ సంచార సమయములో సూర్యుడు 5వఇంట సంచరిస్తాడు.ఫలితముగా మీయొక్క రాబడి మరియు ఆర్ధికస్థితి మెరుగుపడుతుంది.తద్వారా మీకు వివిధ మార్గములలో మీకు అనుకూల ఫలితములు లభిస్తాయి. మీయొక్క కార్యాలయములనుండి అనేక ప్రయోజనములను పొందుతారు. గవర్నమెంటు ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈసమయము చాలా శుభప్రదంగా ఉంటుందని చెప్పవచ్చును.అయినప్పటికీ , మీరు ఆకస్మికముగా ట్రాన్స్ఫర్ ఆర్డర్ పొందే అవకాశమున్నది. కానీ ఇదిమీకు అనుకూలతను కలిగిస్తుంది. ప్రేమకు సంబంధించిన వ్యవహారములలో మాత్రము మీకు అంత అనుకూలముగా లేదుఅనే చెప్పాలి. మీకు మరియు మీభాగస్వామికి మధ్య కొన్ని విషయాల్లో వివాదాలు చెలరేగే అవకాశమున్నది.ఈ సమయములో మీయొక్క ఉన్నతికొరుకు మీరుకొన్ని బలమైన నిర్ణయాలను తీసుకుంటారు.ఇవి మీకు మంచి శుభప్రదమైనవిగా ఉంటాయి.
పరిహారము: మీతండ్రిగారికి ఆదివారమున మీరు బహుమతులను అందించండి.
వృశ్చికరాశి ఫలాలు:
వృశ్చికరాశి యొక్క 10వఇంటికి సూర్యుడు అధిపతి. ఈ సంచార సమయములో సూర్యుడు, వృశ్చికరాశిలో 4వ ఇంట సంచరిస్తాడు. ఈ సమయములో మీకు కొన్ని కుటుంబసమస్యలు తలెత్తుతాయి. మీస్వభావంలో అహంకారము చోటుచేసుకుంటుంది, తద్వారా మీరుఎల్లపుడు ఇతరకంటే మిరే మంచివారు అనేవిషయాన్ని రుజువు చేయాలి అనుకుంటారు. ఫలితముగా, కుటుంబములోని వాతావరణము దెబ్బతింటుంది. మీయొక్క కుటుంబసభ్యులతో మీరు గొడవపడే అవకాశముంది. మీఅమ్మగారితోకూడా వివాదాలు చెలరేగే అవకాశమున్నది. కావున మీరు జాగ్రత్తగా వ్యవహరించుట చెప్పదగిన సూచన.మీ ప్రవర్తనపై జాగురూపకథతో వ్యవహరించండి.మీసహుద్యోగులముందు మీయొక్క పలుకుబడి పెరుగుతుంది.ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ నివాసములు మరియు ప్రభుత్వ వాహనములు పొందే అవకాశముంది. మీ జాతకములో ఏవైనా ఆనుకూలయోగములు ఉంటెఈ సమయములో మరిన్ని మంచి ఫలితాలు అందిస్తాయి.
పరిహారము: ఆదివారము ఉదయము బంగారముతో చేయాడిన సూర్యుని లాకెట్ లేదా పెండెంట్ బంగారు గొలుసులోకాని లేదా ఎర్రటి తాడుతోకాని ధరించాలి.
ధనుస్సురాశి ఫలాలు:
ధనుస్సు రాశి వారికి అధిపతి శనియొక్క మిత్రుడు గురుడు. అందువలన ఈరాశివారికి సూర్యుడు ఒక ప్రత్యేకమైన ప్రభావములను మరియు ఫలితములను అందిస్తాడు. సూర్యుడు మీయొక్క 3వఇంట ప్రవేశిస్తాడు. సాధారణముగా సూర్యుడు 3వఇంట శుభప్రదమైన ఫలితములను అందిస్తాడు.మీరు సంఘంలోని మంచి ప్రతిభావంతమైన వ్యక్తులను కలుసుకుంటారు. మీకుఅదృష్టము కలిసిరావటము వలన ప్రయోజనాలు చేకూరతాయి అంతేకాకుండా మీయొక్క పరపతికూడా పెరుగుతుంది.ఈ సంచార సమయములో, మీరు మతపరమైన ప్రయాణములు కూడా చేయవచ్చును.తద్వారా మీరు మరింత సంతోషముగా మరియు శాంతముగా ఉంటారు. మీయొక్క అన్ని పనులను ఒంటిచేత్తో చక్కబెడతారు.ప్రభుత్వపరముగా లాభాలను పొందుతారు. ఈ సంచార సమయము అత్యంత అనుకూలముగా ఉంటుంది.
పరిహారము: మీరు మంచి జాతిరత్నము అయినటువంటి కెంపుని ధరించండి లేదా సూర్యయంత్రమును ఇంటిలో స్థాపించి ప్రతిరోజు పూజ చేయండి.
మకరరాశి ఫలాలు:
మకరాశివారికి సూర్యుడు 2వఇంటిలో సంచరిస్తాడు. సూర్యుడు మకరరాశి యొక్క 8వఇంటికి అధిపతి. సూర్యునియొక్క ఈసంచార ప్రభావమువలన మీకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి, ముఖ్యముగా మీరు జ్వరముతో బాధపడుతుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి మరియు మీకృ ఆకస్మిక ధనలాభములను పొందుతారు. ఈయొక్క లాభాలు నిలకడగా ఉంటాయి.మీయొక్క అత్తమావయ్యల సహాయసహకారములు అందుతాయి మరియు వారినుండి ఆర్ధిక ప్రయోజనములు పొందుతారు. ప్రభుత్వము నుండి అందవలసిన ధనము మీచేతికి అందుతుంది. ఇదే సమయములో మీయొక్క ఆర్ధికస్థితి దృఢపడుతుంది. కుటుమ్బములో కొన్ని వివాదాలు చెలరేగవచ్చును. కావున జాగ్రతగా వ్యవహరించుట చెప్పదగిన సూచన. మీయొక్క స్వభావము మరియు మాటతీరుపట్ల జాగ్రత్త అవసరము.
పరిహారము: ప్రతిరోజు గణపతిని పూజించండి మరియు కుదిరితే గణపతి అధర్వశీర్షమ్ పఠించండి.
కుంభరాశి ఫలాలు:
కుంభరాశి వారికి సూర్యుడు 7వఇంటి అధిపతి. ఈ సంచార సమయములో కుంభరాశిలోని లగ్నస్థానములో చంద్రుడు ప్రవేశిస్తాడు.ఇది మీయొక్క గ్రహస్థానములపై ప్రభావాన్ని చూపెడుతుంది. ఫలితముగా మీయొక్క ప్రవర్తనలో అనేక మార్పులు సంభవిస్తాయి. మీయొక్క పనులను అందరికంటే ముందే పూర్తిచేస్తారు.మీయొక్క నమ్మకము వృద్ధి చెందుతుంది. మీయొక్క వైవాహికజీవితములో ప్రతికూల పరిస్థితి ఎదరుఅవుతుంది. మీయొక్క అహం కారణముగా మీకు మరియు మీభగస్వామికి మధ్య తగాదాలు ఏర్పడుతాయి.అందువలన మీరు ఆచితూచి వ్యవహరించుట మరియు మాట్లాడుట చెప్పదగిన సూచన.వ్యాపారస్తులకు అనుకూలముగా ఉంటుంది. మీవ్యాపార భాగస్వాములు మీయొక్క సలహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫలితముగా మీరు ట్రేడ్రంగాల్లో అధికముగా లాభాలను పొందుతారు. మీయొక్క ఆరోగ్యము దెబ్బతినే అవకాశమున్నది.కావున మీరు జాగ్రతగా వ్యవహరించుట మంచిది.
పరిహారము: మీరు గోధుమపిండి మరియు బెల్లమును ఆదివారము దానము చేయండి.
మీనరాశి ఫలాలు:
మీనరాశికి గురుడు అధిపతి, మరియు సూర్యునికి మిత్రుడు. ఈసంచార సమయములో సూర్యుడు 12వఇంట సంచరిస్తాడు.ఈస్థానము ఖర్చులు మరియు నష్టాలను తెలియచేస్తుంది.కావున సూర్యుడు మీయొక్క12వఇంట సంచారమువల్ల మీయొక్క ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణములు చేయవలసిన అవకాశమున్నది. వృత్తిపరముగా మీయొక్క పనులు విజయాలను అందుకుంటాయి. ఎవరతే వ్యాపారము చేస్తున్నారో వారు ఇతర రాష్ట్రాలలో మరియు దేశాలలో మీయొక్క వ్యాపారాన్ని విస్తరించుకొనుటకు ప్రణాళికలు చేస్తారు. కోర్టుసంబంధిత వ్యవహారాల్లో మీరు అధికముగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది.మీయొక్క ప్రత్యర్థులపట్ల జాగ్రత్తగా వ్యవహరించండి.ఇదివరకు ప్రారంభించిన పనులను అనేక ప్రయత్నముల తరువాత మీరు విజయవంతముగా పూర్తి చేస్తారు.
పరిహారము : ప్రతిరోజు సింధూరం ధరించి సూర్యడిని పూరించండి.
జ్యోతిష్య శాస్త్ర అన్ని పరిష్కారములకు, రుద్రాక్షలు మరియు జాతిరత్నములకొరకు, మాయొక్క ఆస్ట్రోసేజ్ని సందర్శించండి.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Rashifal 2025
- Horoscope 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025