మిథునరాశిలో శుక్ర సంచారం ( జూన్ 12 2024)

Author: K Sowmya | Updated Wed, 29 May, 2024 11:52 AM

శుక్రుడు స్త్రీలింగ గ్రహం మరియు శుక్రుడు అందానికి సూచన. మిథునరాశిలో శుక్ర సంచారం జూన్ 12, 2024 న 18:15 గంటలకు జరుగుతుంది. ఈ వ్యాసం రాశిచక్ర గుర్తు మిథునరాశిలో జరుగుతుంది. శుక్రుడు ప్రేమ మరియు వివాహానికి ఒక సూచన.


శుక్ర సంచారం గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి !

ఈ కథనం ద్వారా మిథునరాశిలో శుక్రుడి సంచారం దాని సానుకూల ఇంకా ప్రతికూల ఫలితాలతో పన్నెండు రాశుల పై తన ప్రభావాన్ని ఎలా సృష్టిస్తుందో చూద్దాం.

జ్యోతిష్యశాస్త్రంలో శుక్ర గ్రహం

శుక్రుడు జీవితంలో అవసరమైన అన్ని సంతృప్తిని, మంచి ఆరోగ్యాన్ని మరియు దృడమైన మనస్సును అందిస్తుంది. బలమైన శుక్రుడు స్థానికులకు ఆనందం మరియు అందాన్ని అందించడంలో అధిక విజయంతో అన్ని సానుకూల ఫలితాలను అందించగలడు. వారి జాతకంలో బలమైన శుక్రుడు ఉన్న స్థానికులు తమను తాము సుఖంగా మరియు సంతోషంగా జీవిస్తారు. స్థానికులు డబ్బు సంపాదించడంలో మరియు వారి సౌకర్యాలకు పెంచుకోవడంలో చాలా అభివృద్ది చెందుతూ ఉండవొచ్చు.

మరోవైపు రాహు ఇంకా కేతువు మరియు కుజుడు వంటి గ్రహాల చెడు సంఘమతో కలిసి ఉంటే, స్థానికులు ఎదురుకునే పోరాటాలు మరియు అడ్డంకాలు ఉండవొచ్చు. శుక్రుడు కుజుడి తో కలిసి ఉంటే స్థానికులు ఉద్రేకం మరియు దూకుడు కలిగి ఉంటారు ఇంకా గ్రహ కదలిక సమయంలో శుక్రుడు రాహు ఇంకా కేతువు వంటి దుష్ప్రవర్తనతో కలిస్తే, స్థానికులు చర్మ సంబంధిత సమస్యలు, మంచి నిద్ర లేకపోవడం ఇంకా విపరీతమైన వాపు సమస్యలు వంటివి ఎదురుకుంటారు.

ఈ ఆర్టికల్‌లోని అంచనాలు చంద్రుని సంకేతాలపై ఆధారపడి ఉంటాయి. వృషభ రాశిలో బృహస్పతి ఉదయించడం వల్ల మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఫోన్‌లో ఉత్తమ జ్యోతిష్కులకు కాల్ చేసి వివరంగా తెలుసుకోండి.

మీనరాశిలో శుక్రుడి సంచారం: అంచనాలు

మేషరాశి

మేషరాశి వారికి శుక్రుడు రెండవ మరియు ఏడవ ఇంటికి అధిపతి ఇంకా మూడవ ఇంటిలో సంచరిస్తాడు. దీని కారణంగా డబ్బును కోల్పోవచ్చు. మీరు మీ స్నేహితుల మద్ధతును కూడా కోల్పోవచ్చు. కెరీర్ పరంగా ఈ మిథునరాశిలో శుక్ర సంచారం సమయంలో మీరు సంతృప్తిని ఇచ్చే మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగాలను మార్చుకోవచ్చు. వ్యాపార పరంగా మీరు వ్యాపారం చేస్తునట్టు అయితే మీ వ్యాపార విజయం కోసం మీరు కొన్ని మంచి మార్పులు చేయాల్సి రావచ్చు. ఆర్థికంగా మీరు ప్రయాణ సమయంలో డబ్బును కోల్పోవచ్చు మరియు మీరు జాగ్రత్తగా ఉండాలి. సంబంధాల విషయానికి వస్తే మీరు మీ జీవిత భాగస్వామితో అహం సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈ సంచారం సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు.

పరిహారం: ప్రతిరోజూ “ ఓం శుక్రయా నమః” అని జపించండి.

మేషరాశి రాబోయే వార ఫలాలు

వృషభరాశి

వృషభరాశి వారికి శుక్రుడు మొదటి మరియు ఆరవ ఇంటి అధిపతి మరియు రెండవ ఇంటిని ఆక్రమించాడు. పైన పేర్కొన్న కారణంగా మీరు ఎక్కువ ఖర్చులను ఎదుర్కోవచ్చు మరియు కుటుంబ విలువలను కోల్పోవచ్చు. కెరీర్ పరంగా మీరు మీ కెరీర్ లో విజయాన్ని పొందవచ్చు. వ్యాపార పరంగా మీరు మిథునరాశిలో శుక్ర సంచారం సమయంలో రెండు కంటే ఎక్కువ వ్యాపారాలను ప్రారంభించవచ్చు మరియు వాటి నుండి లాభం పొందవచ్చు. మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు, కూడబెట్టుకోవచ్చు మరియు తద్వారా ఆదా చేయవచ్చు. సంబంధం విషయానికి వస్తే మీరు మీ జీవిత భాగస్వామితో మంచి వ్యవహారాలను కలిగి ఉండగలరు మరియు ఇది మీకు ఉన్న ప్రేమ వల్ల కావచ్చు. ఆరోగ్యం విషయంలో రోగనిరోధక శక్తి యొక్క మంచి స్థాయి కారణంగా మీరు మంచి ఆరోగ్యానికి కట్టుబడి ఉండవచ్చు.

పరిహరం: ప్రతిరోజూ 33 సార్లు “ఓం భార్గవాయ నమః” అని జపించండి.

వృషభరాశి రాబోయే వార ఫలాలు

మిథునరాశి

మిథునరాశి స్థానికులకు శుక్రుడు చంద్ర రాశికి సంబంధించి ఐదవ మరియు మొదటి ఇంటిని ఆక్రమించాడు. దీని కారణంగా మీరు మీ ప్రయత్నాలను కొనసాగించవచ్చు మరియు మరిన్ని సౌకర్యాలను పొందవచ్చు. మీరు ఎక్కువగా ప్రయాణించడానికి ఆసక్తి కలిగి ఉండవచ్చు. కెరీర్ పరంగా మీరు మీ పనికి సంబంధించి మంచి ప్రాముఖ్యతను పొందవచ్చు మరియు దాని నుండి ప్రయోజనం పొందవచ్చు. వ్యాపార రంగంలో మీరు అధిక లాభాలను పొందవచ్చు మరియు మంచి వ్యాపార సంస్థగా మిమ్మల్ని మీరు స్థాపించుకోవచ్చు. డబ్బు విషయంలో ఈ నెలలో మీరు మంచి లాభాలను పొందడంలో విజయవంతం కావచ్చు. సంబంధాల పరంగా మీరు మీ భాగస్వామితో సంబంధంలో సామరస్యాన్ని కొనసాగించవచ్చు. ఆరోగ్యం విషయంలో మీరు ఈ సమయంలో మరింత ఫిట్ గా మరియు ఉత్సాహంగా ఉండవచ్చు.

పరిహరం: ప్రతిరోజూ విష్ణుసహస్రనామం జపించండి.

మిథునరాశి రాబోయే వార ఫలాలు

కర్కాటకరాశి

కర్కాటకరాశి వారికి చంద్రుని రాశికి సంబంధించి శుక్రుడు నాల్గవ మరియు పదకొండవ గృహాల అధిపతి మరియు పన్నెండవ ఇంటిని ఆక్రమించాడు. పై వాస్తవాల కారణంగా మీరు మిథునరాశిలో శుక్రుడు సంచారం సమయంలో ఆందోళన కలిగించే కుటుంబ సమస్యలు మరియు లాభాల కొరతను ఎదుర్కోవచ్చు. కెరీర్ పరంగా మీరు మీ ఉన్నతాధికారులతో కీర్తిని కొల్పవచ్చు, ఇది చింతలకు కారణం కావచ్చు. వ్యాపార రంగంలో మీరు ఈ సమయంలో లాభాలను కోల్పోయే అవకాశం ఉన్నందున మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా మీరు డబ్బుము కోల్పోవచ్చు మరియు ఖర్చులతో కూడి ఉండవచ్చు. సంబంధాల విషయంలో మీరు మీ భాగస్వామితో మంచి మానవ విలువలను కొనసాగించలేకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో మీరు మీ భుజాలు, చీలమండలు మరియు కాళ్ళలో నొప్పికి గురయ్యే అవకాశం ఉంది.

పరిహరం: శనివారం రాహు గ్రహానికి యాగ-హవనం చేయండి.

కర్కాటకరాశి రాబోయే వార ఫలాలు

భవిష్యత్తులో అన్ని విలువైన అంతర్దృష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం !

సింహారాశి

సింహరాశి వారికి చంద్ర రాశికి సంబంధించి శుక్రుడు మూడవ మరియు పదవ గృహాల అధిపతి మరియు పదకొండవ ఇంటిని ఆక్రమించాడు. మీరు చేస్తున్న ప్రయత్నాల కారణంగా మీ అభివృద్ధిలో మీరు విజయం సాధించవచ్చు. మిథునంలో ఈ శుక్ర సంచార సమయంలో మీరు మీ కెరీర్‌లో అధిక విజయాన్ని ఎదుర్కోవచ్చు మరియు గుర్తింపును కూడా పొందవచ్చు. వ్యాపార రంగంలో మీరు మంచి లాభాలను చూడవచ్చు మరియు మీరు పోటీ పడే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు. ఆర్థికంగా మీరు అధిక మొత్తంలో డబ్బుని పొందే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆదా చేయవచ్చు. సంబంధాల విషయానికి వస్తే మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించగలరు. ఆరోగ్యం విషయంలో మీరు ఉత్సాహం మరియు శక్తి కారణంగా చక్కటి ఆరోగ్యానికి కట్టుబడి ఉండవచ్చు.

పరిహారం: ఆదివారం నాడు సూర్యగ్రహం కోసం యాగ-హవనం చేయండి.

సింహరాశి రాబోయే వార ఫలాలు

భవిష్యత్తులోకి సంబంధించిన అన్ని విలువైన అంతర్దృష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం !

కన్యరాశి

కన్యరాశి వారికి శుక్రుడు రెండవ మరియు తొమ్మిదవ ఇంటికి అధిపతి ఇంకా పదవ ఇంటిని ఆక్రమిస్తాడు. దీని కారణంగా మీరు మరింత డబ్బు సంపాదిస్తారు ఇంకా అదృష్టాన్ని పొందవొచ్చు. కెరీర్ పరంగా మీరు పనిలో సూత్రాల వ్యక్తిగా ఉంటారు ఇంకా కొత్త అవకాశాలను పొందుతారు. వ్యాపార రంగంలో మీరు వ్యాపారం నుండి ఎక్కువ లాభాలను సంపాదించే అదృష్టవంతులు కావొచ్చు. ఆర్థిక పరంగా మీరు ప్రోత్సాహకాల ద్వారా కొంత డబ్బు ని పొందవొచ్చు. ఆరోగ్య విషయంలో మిథునరాశిలో శుక్ర సంచారం సమయంలో మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు.

పరిహారం: మంగళవారం నాడు కేతు గ్రహానికి యాగ - హవనం చేయండి.

కన్యరాశి రాబోయే వార ఫలాలు

తులారాశి

తులారాశి వారికి శుక్రుడు మొదటి ఇంకా ఎనిమిదవ ఇంటి అధిపతి ఇంకా తొమ్మిదవ ఇంటిని ఆక్రమించాడు. దీని కారణంగా మీరు ఆధ్యాత్మిక విషయాలలో మరియు డానికి సంబంధించిన ప్రయాణాలలో నిమగ్నమై ఉండవొచ్చు. కెరీర్ పరంగా ఈ సంచారం సమయంలో మీరు మంచి ఉద్యోగాలను మార్చవొచ్చు. మీరు కొత్త ఆన్ సైట్ అవకాశాలను పొందవొచ్చు. డబ్బు పరంగా మీరు డబ్బు సంపాదంచడంలో మితమైన అదృష్టం కలిగి ఉండవొచ్చు. మీరు పొదుపు చేసే అవకాశం కంటే ఎక్కువ ఖర్చులు ఉండవొచ్చు. సంబంధాల విషయానికి వస్తే మీరు క్షణాలను గడపడంలో జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండవొచ్చు. ఆరోగ్యం విషయంలో మీరు సంకల్పం తో మంచి విశ్వాసాన్ని కలిగి ఉంటారు.

పరిహారం: మంగళవారం రాహు గ్రహానికి యాగ - హవనం చేయండి.

తులారాశి రాబోయే వార ఫలాలు

వృశ్చికరాశి

వృశ్చికరాశి వారికి శుక్రుడు ఏడవ మరియు పన్నెండవ గృహాల అధిపతి ఇంకా చంద్రునికి సంబంధించి ఎనిమిదవ ఇంటిని ఆక్రమిస్తాడు. దీని కారణంగా మీరు స్నేహితులతో వివాదాలను ఎదురుకొవొచ్చు. మిథునరాశిలో శుక్రుడి సంచారం సమయంలో అవాంఛిత ప్రయాణాలు ఉండవొచ్చు. కెరీర్ పరంగా మీరు ఒత్తిడి కారణంగా ఎక్కువ పని ఒత్తిడిని ఎదురుకోవొచ్చు తద్వారా గుర్తింపు కూడా లేకపోవొచ్చు. వ్యాపార పరంగా నిర్లక్ష్యం ఇంకా తప్పు విధానం కారణంగా మీరు నష్టాన్ని ఎదురుకోవొచ్చు. ఆర్థికంగా మీరు ప్రయాణ సమయంలో డబ్బు ని కోలిపోవొచ్చు కాబట్టి మీరు జాగ్రత్త గా ఉండాలి. సంబంధాల విషయానికి వస్తే మీరు మీ జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా మరిన్ని వివాదాలను ఎదురుకోవొచ్చు. ఆరోగ్య పరంగా మీరు కంటి నొప్పి ఇంకా ఇన్ఫెక్షన్ లు ఎదురుకోవొచ్చు.

పరిహారం: ప్రతిరోజు 41 సార్లు “ఓం మండాయ నమః” అని జపించండి.

వృశ్చికరాశి రాబోయే వారఫలాలు

కాగ్నిఆస్ట్రో ప్రొఫెషనల్ రిపోర్ట్‌తో ఉత్తమ కెరీర్ కౌన్సెలింగ్ పొందండి!

ధనస్సురాశి

ధనస్సురాశి వారికి శుక్రుడు ఆరవ మరియు పదకొండవ గృహాల అధిపతి మరియు చంద్ర రాశికి సంబంధించి ఏడవ ఇంటిని ఆక్రమించాడు. ఈ వాస్తవాల కారణంగా మీరు మీ భాగస్వామి మరియు స్నేహితులతో సంబంధాలలో అశాంతిని ఎదుర్కోవచ్చు. కెరీర్ పరంగా మీరు పని చేస్తున్నప్పుడు మరింత పని ఒత్తిడి మరియు గందరగోళాన్ని ఎదుర్కోవచ్చు. వ్యాపార పరంగా మీరు మీ భాగస్వాములతో సమస్యలు మరియు నష్టాన్ని ఎదుర్కోవచ్చు. ఆర్థిక పరంగా మీరు ఎక్కువ ఖర్చులను ఎదుర్కోవచ్చు మరియు డబ్బు ఆదా చేసే అవకాశం తక్కువగా ఉండవచ్చు. సంబంధాల విషయానికి వస్తే, మీరు తక్కువ బంధం కారణంగా జీవిత భాగస్వామితో సంతోషం లేకపోవొచ్చు. ఆరోగ్యం విషయంలో మీరు మీ భుజాలు మరియు కీళ్లలో నొప్పిని ఎదుర్కోవచ్చు.

పరిహరం: రోజూ 41 సార్లు “ఓం నమః శివాయ” జపించండి.

ధనుస్సురాశి రాబోయే వార ఫలాలు

మకరరాశి

మకరరాశి వారికి శుక్రుడు ఐదవ మరియు పదవ గృహాలకి అధిపతి ఇంకా చంద్రరాశికి సంబంధించి ఆరవ ఇంటిని ఆక్రమించాడు. మిథునరాశిలో శుక్ర సంచారం సమయంలో మీరు భవిష్యత్తు గురించి మరింత ఆందోళన చెందుతారు. మీరు ఏకాగ్రత కోల్పోవచ్చు. కెరీర్ పరంగా మీరు సంతృప్తి లేకపోవడం మరియు అశాంతి కారణంగా మీరు ఉద్యోగం వంటివి మార్చడానికి ప్లాన్ చేయవచ్చు. వ్యాపారంలో మీరు నిర్లక్ష్యం మరియు పోటీదారుల నుండి మరింత ముప్పు కారణంగా నష్టాన్ని ఎదుర్కోవచ్చు. డబ్బు విషయంలో మీ పిల్లల కోసం ఎక్కువ ఖర్చు చేయడం వల్ల మీరు మరింత నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. సంబంధం విషయానికి వస్తే విశ్వాసం లేకపోవడం వల్ల మీరు జీవిత భాగస్వామితో ఎక్కువ వాదనాళం ఎదుర్కోవచ్చు. ఆరోగ్యం విషయంలో మీరు ఒత్తిడి కారణంగా నరాల సంబంధిత నొప్పిని ఎదుర్కొంటారు.

పరిహరం: శనివారం నాడు కాలభైరవ భాగవానునికి యాగ-హవనం చేయండి.

మకరరాశి రాబోయే వార ఫలాలు

కుంభరాశి

కుంభరాశి వారికి శుక్రుడు తొమ్మిదవ గృహాల అధిపతి మరియు చంద్ర రాశికి సంబంధించి ఐదవ ఇంటిని ఆక్రమించాడు. అందుకుగాను మీరు మీ తెలివితేటలను ఉపయోగించడం ద్వారా అభివృద్ధి చెందవచ్చు. కెరీర్ పరంగా మీరు మీ శక్తితో బాగా పని చేయవచ్చు మరియు మరింత పురోగతితో ఫలితాలను చూపవచ్చు. వాపారం పరంగా మీరు మీ సరైన ప్రణాళికతో ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఆర్థిక పరంగా మీరు ప్రోత్సాహకల రూపంలో మరింత పొందవచ్చు. సంబంధాల విషయానికి వస్తే మీరు మీ భాగస్వామితో మరింత ఉత్సాహంగా మరియు ప్రేమగా ఉండవచ్చు. ఇది మీకు ఆనందాన్ని ఇవ్వవచ్చు. ఆరోగ్యం విషయంలో మీరు శక్తితో మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండవచ్చు.

పరిహరం: “ఓం భాస్కరాయ నామహ” అని ప్రతిరోజూ 19 సార్లు జపించండి.

కుంభరాశి రాబోయే వార ఫలాలు

మీన రాశి

మీనరాశి వారికి శుక్రుడు మూడవ మరియు అనిమీదవ ఇంటి అధిపతి మరియు చంద్రునికి సంబంధించి నాల్గవ ఇంటిని ఆక్రమించాడు, మీరు కుటుంబంలో సౌకర్యాల కొరత మరియు సమస్యలను ఎదుర్కొంటారు. మిథునరాశిలో శుక్ర సంచారం సమయంలో మీరు జీవితంలో మార్పులను చూపవచ్చు. కెరీర్ పరంగా మీరు మీ ప్రస్తుత ఉద్యోగాన్ని మానేసి కొత్త ఉదోగానికి మార్చవచ్చు. వ్యాపార రంగంలో మీరు లాభాలు మరియు నష్టాలు రెండిటినీ ఎదుర్కోవచ్చు. మీరు బెదిరింపులను ఎదుర్కోవచ్చు. ఆర్థిక పరంగా మీరు మీ కుటుంబం కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. సంబంధాల విషయానికి వస్తే మీరు సర్దుబాటు లేకపోవడం వల్ల జీవిత భాగస్వామితో సంతృప్తిని పొందలేకపోవచ్చు. ఆరోగ్యం పరంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నందున, ఖర్చులు కూడా పెరుగుతాయి మరియు మీ పొదుపు ఆలోచన సులభంగా సాధ్యం కాకపోవచ్చు.

పరిహరం: గురువారం గురు గ్రహానికి 6 నెలల పూజ చేయండి.

మీనరాశి రాబోయే వార ఫలాలు

రత్నాలు, యంత్రం మొదలైన వాటితో సహా జ్యోతిష్య నివారణల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !

మీరు మా కథనాన్ని ఇష్టపడ్డారని మేము ఆశిస్తున్నాము. ఆస్ట్రోసేజ్ లో ముఖ్యమైన భాగంగా ఉన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం చూస్తూనే ఉండండి.

Talk to Astrologer Chat with Astrologer