కుంభరాశిలో శని తిరోగమనం ( జూన్ 29 2024)

Author: K Sowmya | Updated Fri, 14 June, 2024 5:53 PM

ఈ ఆస్ట్రోసేజ్ కథనంలో మనం జూన్ 29 2024న 23:40 గంటలకు జరగబోయే కుంభరాశిలో శని తిరోగమనం గురించి వివరంగా తెలుసుకోబోతున్నాము. ఈ శని తిరోగమనం 12 రాశుల పై ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటారు. శని 2024 లో రాశిచక్రాలను మార్చినప్పటికి, అది చలనాన్ని మార్చి అన్ని రాశిచక్రాల స్థానికులను ప్రభావితం చేస్తుంది.


కుంభరాశిలో శని తిరోగమనం గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి !

2024లో శని కుంభరాశిలోనే ఉంటుంది ఇంకా ఈ సంవస్త్రంలో శని యొక్క ఇంకొక సంచారం లేదు. కానీ ఈ సంవస్త్రం శని ప్రత్యక్షం ఇంకా తిరోగమనం కదలికల ఆధారంగా శని మనకు ఫలితాలను అందిస్తుంది. 2024 సంవస్త్రంలో కుంభరాశిలో దహన కదలికలు ఇంకా ఉదయించడం ఉంటుంది. ఈ సమయాలలో సానుకూల ఇంకా ప్రతికూల ఫలితాలు లభిస్తాయి. ఈ అంచనాలు మీ చంద్రుని రాశి పైన ఆధారపడుతాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో శని యొక్క ఖచ్చితమైన స్థానం మరింత ఖచ్చితమైన అంచనాలను నిర్ణయించడంలో మీకు సహాయపడుతుంది. శని ఒక నిబద్దత గ్రహం. శని ఉపాద్యాయుడు, టాస్క్మాస్టర్ ఇంకా ఒక వ్యక్తిని జీవితంలో క్రమశిక్షణతో ఉండేలా చేస్తాడు. ఈ లక్షణాలాతో స్థానికులు జీవితంలో తమ లక్ష్యాలను అన్నింటినీ సాధిస్తారు. శని సంచారం అంటే శని ఒక వ్యక్తిని జీవితంలో మరింత సమయపాలన పాటించేలా చేస్తాడు ఇంకా న్యాయానికి కట్టుబడి ఉంటారు. శని మనకు శక్తిని బోధిస్తాడు.

హిందీ లో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి: కుంభంలో శని తిరోగమనం

కుంభరాశిలో శని తిరోగమనం - రాశి వారీగా అంచనాలు

మేషరాశి

మేషరాశి వారికి శని పదవ ఇంకా పదకొండవ గృహాలలో అలాగే పదకొండవ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు. కెరీర్ పరంగా మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ సంచారం మీకు మంచిదే. మీరు అడ్డంకులను ఎదుర్కొన్న తర్వాత ఉద్యోగ రంగంలో మంచి పురోగతిని చూడవచ్చు. వ్యాపార పరంగా మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే మీరు లాభాలను కనుగొనవచ్చు కానీ మీరు సంపాదించే లాభాలు భారీ మొత్తంలో ఉండకపోవచ్చు. ఆర్థిక పరంగా మీరు మంచి డబ్బు సంపాదించడంలో అడ్డంకులు మరియు అంతరాలను చూడవచ్చు. సంబంధాల విషయంలో చక్కటి అవగాహన ఉన్నప్పటికీ మీరు మీ భాగస్వామితో వాదనలకు దిగవచ్చు. ఆరోగ్యం పరంగా మీరు మెరుగైన ఆరోగ్యనని అనుభవిస్తారు,కానీ మీరు దగ్గుకు గురయ్యే అవకాశం ఉంది.

పరిహారం: ప్రతిరోజూ 21 సార్లు “ఓం నమో నారాయణ” అని జపించండి.

మేషరాశి రాబోయే వార ఫలాలు

వృషభరాశి

వృషభ రాశి వారికి తొమ్మిదవ ఇంకా పదవ గృహాల అధిపతిగా శని పదవ ఇంట్లో తిరోగమనం పొందుతాడు. దీని కారణంగా మీరు మీ కెరీర్ మరియు కుటుంబ అభివృద్ధిలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. కెరీర్ పరంగా మీరు కొంత ఉద్యోగ ఒత్తిడిని ఎదుర్కోవచ్చు, ఇది మీ సమయాన్ని మరియు శక్తిని తీసివేయవచ్చు. వ్యాపార రంగంలో మీరు వ్యాపారంలో కొంత పోటీని ఎదురుకుంటారు ఇంకా తద్వారా వ్యాపారంలో కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థికంగా మీరు ఇంకా బాగా సంపాదించవచ్చు, మీరు దానిని ఆదా చేయలేకపోవచ్చు. సంబంధాల విషయానికి వస్తే మీరు మీ జీవిత భాగస్వామితో మెరుగైన లావాదేవిలను కలిగి ఉండవచ్చు కానీ బంధం మంచిది కాకపోవచ్చు. ఆరోగ్యం వైపు మీరు కాంతి చికాకులు మరియు ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది.

పరిహరం: రోజూ లలితా సహస్రనామం జపించండి.

వృషభరాశి రాబోయే వార ఫలాలు

మిథునరాశి

మిథునరాశి స్థానికులకు శని ఎనిమిది ఇంకా తొమ్మిదవ గృహాల అధిపతిగా తొమ్మిదవ ఇంట్లో పొందుతాడు. మీరు అదృష్టాన్ని కొలిపోతారు ఇంకా విశ్వాసం లేకపోవడం మీ మనస్సులో నిలిచిపోతుంది. కెరీర్ పరంగా మీరు మీ ఉద్యోగంలో మంచి అవకాశాలను కోల్పోవచ్చు. ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు తగ్గవచ్చు. వ్యాపార రంగంలో మీరు ఆన్ సైట్ వ్యాపారంలో కోసం మంచి అవకాశాలను కోల్పోవచ్చు. అదే కారణంగా మీరు భారీ లాభాలను కోల్పోవచ్చు. డబ్బు విషయానికి వస్తే మీరు ప్రయాణంలో డబ్బును కోల్పోవచ్చు మరియు దీని కారణంగా ఎక్కువ డబ్బును కూడబెట్టుకునే మీ స్కోప్ సాధ్యం కాకపోవచ్చు. సంబంధం విషయానికి వస్తే మీరు కుటుంబ సమస్యలపై మీ జీవిత భాగస్వామితో కొంత వేడిగా చర్చించుకోవచ్చు. ఆరోగ్యం వైపు, మీరు మీ కాళ్ళలో కొంత తీవ్రమైన నొప్పికి గురయ్యే అవకాశం ఉంది.

పరిహరం: ప్రతిరోజూ విష్ణుసహస్రనామం జపించండి.

మిథునరాశి రాబోయే వార ఫలాలు

కర్కాటకరాశి

కర్కాటకరాశి వారికి ఏడవ ఇంకా అష్టమ గృహాల అధిపతిగా శని ఎనిమిదవ ఇంట్లో తిరోగమనం పొందుతాడు. మీరు జీవితంలో ఊహించని లాభాలు ఇంకా ఆకస్మిక అభివృద్ధిని పొందవచ్చు. కెరీర్ పరంగా మీరు మీ ఉద్యోగంలో మంచి అవకాశాలను కొలిపోతారు ఇంకా పనిలో అసహ్యకరమైన క్షణాల పరిస్థితులు ఉండవచ్చు. వ్యాపార రంగంలో మీరు మీ వ్యాపారంలో లాభాలను ఎదురుదెబ్బలను కోల్పోవచ్చు. డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ప్రయాణంలో నిర్లక్ష్యం కారణంగా మీరు డబ్బును కోల్పోవచ్చు. సంబంధాల విషయానికి వస్తే మీ జీవిత భాగస్వామితో అజాగ్రత్త లేదా సాధారణ చర్చలు సంఘర్షణకు కారణమవుతాయి మరియు శాంతికి భంగం కళించవచ్చు, ఇది ఒత్తిడితో కూడిన పరిస్థితికి దారి తీస్తుంది. ఆరోగ్యం పరంగా మీరు కాళ్ళలో తీవ్రమైన నొప్పికి గురవుతారు మరియు ఇది ఒత్తిడి కారణంగా తలెత్తవచ్చు.

పరిహారం: రోజూ దుర్గా చాలీసా జపించండి.

కర్కాటకరాశి రాబోయే వార ఫలాలు

భవిష్యత్తులో అన్ని విలువైన అంతర్దృష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం !

సింహారాశి

సింహారాశి వారికి శని ఆరవ ఇంకా ఏడవ ఇంటి అధిపతిగా ఏడవ ఇంట్లో తిరోగమనం పొందుతాడు. మీరు మంచి స్నేహం చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది కానీ మంచి విషయాల కోసం పరిస్థితి సాధ్యం కాకపోవచ్చు. కెరీర్ పరంగా మీరు అవాంఛిత ప్రయాణం చేయవలసి రావచ్చు ఇంకా కుంభరాశిలో శని తిరోగమనం సమయంలో మీరు నిజంగా ఇష్టపడకపవవచ్చు. వ్యాపార రంగంలో మీరు వ్యాపారంలో బెదిరింపుల రూపంలో కొన్ని ఎదురుదెబ్బలనను ఎదుర్కోవచ్చు. డబ్బు పరంగా మీరు స్నేహితులకు డబ్బు ఇవ్వవచ్చు మరియు వారి నుండి మీ డబ్బును తిరిగి తీసుకోలేకపోవచ్చు. సంబంధాల విషయానికి వస్తే మీరు మీ భాగస్వామితో అహం సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు, అది ఆహ్లాదకరంగా కనిపించదు. ఆరోగ్యం వైపు, మీరు మీ మోకాలి చిప్పలలో నొప్పికి గురయ్యే అవకాశం ఉంది.

పరిహరం: ప్రతిరోజూ 19 సార్లు “ఓం భాస్కరాయ నమః” అని జపించండి.

సింహరాశి రాబోయే వార ఫలాలు

భవిష్యత్తులోకి సంబంధించిన అన్ని విలువైన అంతర్దృష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం !

కన్యారాశి

కన్యరాశి వారికి ఐదవ మరియు ఆరవ గృహాల అధిపతిగా శని ఆరవ ఇంట్లో తిరోగమనం పొందుతాడు. దీనివల్ల ఖర్చులను పెంచుకోవడానికి మీకు మరింత డబ్బు అవసరం కావచ్చు మరియు దీని కారణంగా మీరు లోన్ లను పొందేందుకు వెళ్ళవచ్చు. కెరీర్ పరంగా మీరు పనిలో పెట్టే ప్రయత్నాలతో పట్టు కోల్పోవచ్చు. వ్యాపార రంగంలో మీ ప్రయత్నం లేకపోవడం వల్ల మీరు పోటీదారుల నుండి పోటీని ఎదుర్కొనేలా చేయవచ్చు. ఆర్థిక పరంగా మీరు ఆనందాన్ని కోల్పోయేలా చేసే అవాంఛిత పద్దతిలో డబ్బును పోగొట్టుకోవచ్చు. సంబంధాల విషయానికి వస్తే మీరు మీ భాగస్వామితో ఆకస్మిక వాదనలకు దిగవచ్చు, వీటిని మీరు నివారించాలి. ఆరోగ్యం వైపు, మీ ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచడానికి మీరు నివారణ మందులు తీసుకోవాలసి ఉంటుంది.

పరిహరం: ప్రతిరోజూ 41 సార్లు “ఓం నమో నారాయణ” అని జపించండి.

కన్యరాశి రాబోయే వార ఫలాలు

తులరాశి

తులరాశి వారికి శని నాల్గవ మరియు ఐదవ గృహాల అధిపతిగా ఇంకా ఐదవ ఇంట్లో తిరోగమనం పొందుతాడు. దీని కారణంగా మీ భవిష్యత్తు మరియు భద్రత గురించి మీకు మరింత ఆందోళనలు ఉంటాయి. కెరీర్ పరంగా మీ తెలివితేటలు లేదా ప్రయత్నాలు ప్రశంసించబడకపోవచ్చు ఇంకా ఇది చింతలకు కారణం కావచ్చు. వ్యాపార రంగంలో మీరు వ్యాపారంలో చిక్కుకుపోవచ్చు మరియు తెలివైన నిర్ణయాలు తీసుకలేకపోవచ్చు. కుంభరాశిలో శని తిరోగమనం సమయంలో ఆర్థిక పరంగా సరైన ప్రణాళికా లేకపోవడం వల్ల మీరు తీవ్రమైన డబ్బు కొరతను ఎదుర్కోవచ్చు. సంబంధాల విషయానికి వస్తే మీ భాగస్వామితో తగాదాలకు దారితీసే అహం సమస్యలు ఉండవచ్చు. ఆరోగ్యం పరంగా ఈ సమయంలో, మీరు పిల్లల ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది మరియు ఇది మీకు ఆందోళన కలిగిస్తుంది.

పరిహరం: ప్రతిరోజూ 41 సార్లు “ఓం నమో నారాయణ” అని జపించండి.

తులారాశి రాబోయే వార ఫలాలు

వృశ్చికరాశి

వృశ్చికరాశి వారికి శని మూడవ ఇంకా నాల్గవ గృహాల అధిపతిగా నాల్గవ ఇంట్లో తిరోగమనం పొందుతాడు. కాబట్టి మీరు మీ కుటుంబానికి మీ దృష్టిని ఎక్కువగా ఇవ్వవలసి ఉంటుంది. దీనివల్ల విధులు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మీరు సాధారణం కంటే తక్కువ సుఖంగా ఉండే అవకాశం కూడా ఉంది. కెరీర్ పరంగా అధిక పని ఒత్తిడి కారణంగా మీరు మీ ఉద్యోగంలో మంచి అవకాశాలను కోల్పోవచ్చు. వ్యాపార రంగంలో మీరు లాభాలను కొలిపోతారు ఇంకా నష్టాల జోన్ లో నివసించవచ్చు. మీ పోటీదారుల నుండి మరింత పోటి ఉండవచ్చు. డబ్బు వైపు ప్రయాణ సమయంలో ఏకాగ్రత లేకపోవడం మరియు నిర్లక్ష్యం కారణంగా మీరు డబ్బును కోల్పోవచ్చు. సంబంధాల విషయానికి వస్తే మీరు మీ జీవిత భాగస్వామితో అవాంఛిత వివాదాలలోకి ప్రవేశించవచ్చు మరియు ఇది అభిప్రాయ భేదం కారణంగా తలెత్తవచ్చు. మీ ఆరోగ్యానికి సంబంధించి మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పడిపోవచ్చు మరియు దీని కారణంగా మీ కాళ్లు వాచిపోవచ్చు.

పరిహారం: శని గ్రహం కోసం శనివారాలలో యాగ-హవనం చేయండి.

వృశ్చికరాశి రాబోయే వారఫలాలు

కాగ్నిఆస్ట్రో ప్రొఫెషనల్ రిపోర్ట్‌తో ఉత్తమ కెరీర్ కౌన్సెలింగ్ పొందండి!

ధనస్సురాశి

ధనస్సురాశి వారికి శని రెండవ మరియు మూడవ ఇంటి అధిపతిగా మూడవ ఇంట్లో తిరోగమనం పొందుతాడు. దీని కారణంగా మీరు స్వీయ అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ ప్రయాణాలు ఉండవచ్చు. కెరీర్ పరంగా మీరు పనిలో సగటు ప్రయోజనాలను పొందవచ్చు ఇంకా ఇది మీకు అధిక సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. వ్యాపార పరంగా మీరు ప్రయాణానికి వెళ్ళవలసి రావచ్చు మరియు అలాంటి ప్రయాణాలు మీకు అధిక లాభాలను పొందకపోయావచ్చు. ఆర్థిక పరంగా కుటుంబంలో ఎక్కువ బాధ్యతల కారణంగా మీరు ఎక్కువ ఖర్చులను చూస్తారు. సంబంధాల విషయానికి వస్తే మీరు మీ జీవిత భాగస్వామితో విశృంఖల చర్చలను కలిగి ఉండవచ్చు, ఇది సంబంధంలో ఆకర్షణను తగ్గిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల మీరు జలుబు మరియు దగ్గుకు గురయ్యే అవకాశం ఉంది.

పరిహారం: రోజూ 27 సార్లు “ఓం మంగళాయ నమః” అని జపించండి.

ధనుస్సురాశి రాబోయే వార ఫలాలు

మకరరాశి

మకరరాశి వారికి మొదటి మరియు రెండవ గృహాధిపతిగా శని రెండవ ఇంటిలో తిరోగమనం పొందుతాడు. మీరు ఈ సమయంలో కుటుంబం ఇంకా ఆర్థిక విషయాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావచ్చు. కుంభరాశిలో శని తిరోగమనం సమయంలో మీరు మీ మాటలతో జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ పరంగా ఈ సమయంలో మీరు ఊహించని ఉద్యోగ బాదిలీలను ఎదుర్కోవచ్చు, ఇది మీకు సంతృప్తిని కలిగించకపోవచ్చు. వ్యాపార రంగంలో మీరు మీ పోటీదారుల నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కోవచ్చు దానిని మీరు నిర్వహించలేరు. ఆర్థిక పరంగా మీరు మంచి డబ్బును ఆదా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండకపోవచ్చు మరియు ఇది చింతలకు కారణం కావచ్చు. సంబంధాల విషయానికి వస్తే ముందు మీరు కుటుంబ సభ్యులతో కూడిన కొన్ని అవాంఛిత గాసిప్ లను అనుభవించవచ్చు. ఆరోగ్యం పరంగా మీరు చీకాకుళ్లతో కాంతి సంబంధిత సమస్యలను కలిగి ఉండవచ్చు.

పరిహరం: రోజూ 11 సార్లు “ఓం నమో శివాయ” అని జపించండి.

మకరరాశి రాబోయే వార ఫలాలు

కుంభరాశి

కుంభరాశి వారికి శని మొదటి మరియు పన్నెండవ గృహాల అధిపతిగా మొదటి ఇతనిలో తిరోగమనం పొందుతాడు. మీరు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ద చూపవలసి ఉంటుంది. మీరు అనవసర ఖర్చులను ఎదుర్కోవచ్చు. మీరు అవాంఛిత ప్రయాణాలను ఎదుర్కోవచ్చు. కెరీర్ పరంగా మీరు అధిక స్కోప్ మరియు సంతృప్తి కోసం ఉద్యోగాలను మార్చే అంచున ఉండవచ్చు. అలాంటి మార్పు మంచి ప్రభావం చూపకపోవచ్చు. వ్యాపార రంగంలో మీరు వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణించాల్సి రావచ్చు, అది విలువైనది కాకపోవచ్చు. పెద్దగా పురోగతి ఉండకపోవచ్చు. ఆర్థిక పరంగా మీరు ఊహించని మూలాల నుండి డబ్బు సంపాదించవచ్చు ఇది మీకు ప్రయోజనాళాళ్ను ఇస్తుంది. సంబంధాల విషయానికి వస్తే మీరు మీ జీవిత భాగస్వామి నుండి సంతృప్తిని పొందలేరు ఎందుకంటే మంచి సర్దుబాటు ఉండకపోవచ్చు. ఆరోగ్యం పరంగా మీరు జీర్ణ సంబంధిత సమస్యలను కలిగి ఉండవచ్చు.

పరిహరం: ప్రతిరోజూ 27 సార్లు “ఓం శివ ఓం శివ ఓం” అని జపించండి.

కుంభరాశి రాబోయే వార ఫలాలు

మీనరాశి

మీనరాశి వారికి శని పదకొండవ మరియు పన్నెండవ గృహాల అధిపతిగా పన్నెండవ ఇంట్లో తిరోగమనం పొందుతాడు. దీని కారణంగా మీరు మరింత దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది ఇంకా ఎక్కువ ఆలోచనతో ఖర్చులను నిర్వహించవలసి ఉంటుంది. మీరు తక్కువ సంతృప్తి చెందుతారు. కెరీర్ లో మీరు మీ ప్రయత్నాలకు తక్కువగా ప్రశంసించబడవచ్చు మరియు మీ కెరీర్ లో పెరిగిన ఉద్యోగ ఒత్తిడిగాని అనుభవించవచ్చు. వ్యాపారంలో మీరు కఠినమైన పోటీని ఎదుర్కోవచ్చు ఎందుకంటే మీ వ్యూహాలు పాటబడి ఉండవచ్చు. ఆర్థికంగా కుంభరాశిలో శని తిరోగమనం సమయంలో మీరు ఆందోళనలను కలిగించే లాభాలు మరియు ఖర్చులు రెండింటిని చూడవచ్చు. హెచ్చుతగ్గుల కారణంగా ఇది తలెత్తవచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. సంబంధాల విషయానికి వస్తే మీరు మీ జీవిత భాగస్వామితో సంతృప్తి చెందకపోయావచ్చు ఇది బంధం మరియు సాన్నిహిత్యం లేకపోవడం వల్ల తలెత్తవచ్చు. ఆరోగ్యం పరంగా మీరు మీ కాళ్ళలో నొప్పికి మరియు మీ వెనుక భాగంలో దృఢత్వనికి గురయ్యే అవకాశం ఉంది.

పరిహారం: ప్రతిరోజూ 27 సార్లు “ఓం భూమి పుత్రాయ నమః” అని జపించండి.

మీనరాశి రాబోయే వార ఫలాలు

రత్నాలు, యంత్రం మొదలైన వాటితో సహా జ్యోతిష్య నివారణల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !

మా బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోసేజ్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!

Talk to Astrologer Chat with Astrologer