‘‘సత్యమేవ జయతే’’ అనే ఫిలాసఫీని మీరు విశ్వసిస్తారు. సత్యం కొరకు, మీరు మీ జీవితాన్ని సైతం పణంగా పెడతారు.
జీవితంలో కొన్ని స్థిరమైన సూత్రాలుంటాయి, వీటి వల్ల, మీరు ఇతర వ్యక్తులతో తగాదాలకు వెళతారు. మీ స్వీయ ఆసక్తితో
పనులు చేయరు. మీ హృదయం ఎంతో ఉదారంగా ఉంటుంది మరియు మీరు మతపరంగా ఉంటారు. మీకు దైర్యసాహసాలుంటాయి. మీ ఉద్దేశ్యాలు
చాలా బలంగా ఉంటాయి మరియు మీరు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నట్లయితే, దానిని పూర్తి చేసే వరకు మీరు విడిచిపెట్టరు.
మీకు మీ బాధ్యతలు తెలుసు మరియు వాటిని సరిగ్గా పూర్తి చేయడానికి మీరు ప్రయత్నిస్తారు. మీ ఆలోచనలు రాజకీయాల
నుంచి ప్రేరణ పొందుతుంది మరియు రాజకీయ చతురతలో మీరు నిపుణుడుజ ఎక్కువగా శారీరక శ్రమ చేయడాన్ని మీరు విశ్వసించరు,
దానికి బదులుగా మీరు మీ మెదడును ఉపయోగిస్తారు. స్వంతంగా వ్యవహరించే వ్యక్తిత్వం ఉండటం వల్ల, మీరు భాగస్వామికంటే
స్వేచ్ఛగా విడిగా పనిచేయడానికి ఇష్టపడతారు. మీ ప్రవర్తన కాస్తంత సోమరిగా ఉంటుంది, అలానే మీరు కాస్తంత వినోదాత్మకంగానుూ
ఉవంటారు. మీరు జీవితాన్ని పూర్తి ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. మీరు యంత్రంలా పనిచేయరు మరియు జీవితాన్ని
స్వేచ్ఛగా గడపడానికి మీరు ఇష్టపడతారు. మీరు ఏ సమస్యకు కూడా భయపడరు, దానికి బదులుగా మీరు ప్రతి పరిస్థితిని
కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. మీకుండే నమ్మకం మరియు శక్తి, మీకు బలాన్ని ఇస్తాయి, ఎలాంటి సంక్లిష్టమైన పరిస్థితిలోనైనా
విజయం సాధించడానికి దోహదపడుతుంది. మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది, ఎవరైనా మిమ్మల్ని వ్యతిరేకించడానికి
ప్రయత్నిస్తే, మీరు వారిని ఓడిస్తారు. మీకు సులభంగా కోపం రాకపోయినప్పటికీ, ఒకవేళ మీకు కోపం వచ్చినట్లయితే,
దానిని నియంత్రించుకోవడం చాలా కష్టం. మీరు సుమనస్కులు మరియు తెలివైనవారు, క్షణాల్లో మీ కోపం మాయమవుతుంది.
ఏదైనా చేయాలని ఒక్కసారి నిర్ణయించుకున్న తరువాత, మీరు ఇక వెనక్కి తిరిగి చూడరు. మీకు నైపుణ్యం ఉండటం వల్ల
జీవితంలోని అన్ని రంగాల్లో కూడా మీరు విజయం సాధిస్తారు. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ఎదుటి వ్యక్తిని
మీరు ఎగతాళి పట్టిస్తారు. అయితే, మీరు ఆడంబరాలను ప్రదర్శించడానికి ఇష్టపడరాదు, మరియు సాధ్యమైనంత వరకు వాటిని
మీరు పరిహరించాలి. విషయాలను గుర్తుంచుకునే మీ శక్తి అద్భుతంగా ఉంటుంది మరియు మీరు దేనినైనా ఒక్కసారి చదివినట్లయితే,
దానినీ మీరు చాలాకాలం గుర్తుంచుకుంటారు. మీలో సాహిత్యపరమైన నైపుణ్యం ఉంటుంది, దీనివల్ల మీరు అనతికాలంలోనే
పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. మీ మంచి స్వభావం వల్ల, మీరు చాలా పేరుప్రఖ్యాతులు సంపాదిస్తారు.
విద్య మరియు ఆదాయం
మీరు అత్యున్నత అర్హతలను సాధించే అవకాశం ఉంది. సైకాలజీ లేదా టచ్ థెరపీ వంటి రంగాల్లో, మీరు నిపుణులు కావొచ్చు.
జ్యోతిష్యశాస్త్రంలో మీకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఈ రంగంలో మీరు మంచి మరియు బాగా పేర్కొందిన నిపుణుడుగా
అవతరిస్తారు. అదేవిధంగా, వైద్యపరంలో పేరుప్రఖ్యాతులు సంపాదించే సామర్థ్యం మీకు ఉంది. మీకు అనుకూలమైన వృత్తులలో
ఎలక్ట్రీషియన్; కీమోథెరపిస్టు; వ్యోమగామి లేదా జ్యోతిష్కుడు; పైలట్; సైనిక శిక్షణ; చిత్రాలు లేదా టెలివిజన్
సంబంధిత రచనలు; సినిమా నటుడు లేదా కళాకారుడు; మోడల్; ఫోటోగ్రాఫర్; గురువు లేదా సైన్స్ రచయిత; అణు భౌతిక
సంబంధిత పనులు; ఔషధ పనులు; వైద్యుడు లేదా సర్జన్; మద్యం తయారు చేయడం లేదా మత్తుపదార్ధాలు సంబంధించిన పనులు;
ప్లాస్టిక్ లేదా ప్లాస్టిక్ ఉత్పత్తికి సంబంధిత పనులు; పెట్రోలియం సంబంధిత పనులు; యోగ శిక్షణ; ఆవిష్కర్త;
మొదలైనవి
కుటుంబ జీవితం
మీరు ప్రేమించినవారితో మీరు చాలా సమస్యలు ఎదుర్కొనే సంభావ్యత ఉంది. మీ యొక్క ఉదారత్వం వల్ల, మీరు ఎల్లప్పుడూ
ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు, అయితే, మీరు అనేక మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. మరిముఖ్యంగా,
సోదరులతో విడిపోయే సంభావ్యత ఉంది. మీ తల్లిదండ్రుల నుంచి మీరు సంపూర్ణ ప్రేమను పొందుతారు. మీ జీవిత భాగస్వామిని
మీరు బేషరతుగా ప్రేమిస్తారు కనుక, మీ వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. దాతృత్వం యొక్క సారాంశంగా పరిగణించవచ్చు.
అతడు/ఆమె కుటుంబం పట్ల చక్కటి జాగ్రత్త వహిస్తారు మరియు అదేవిధంగా పెద్దలకు సైతం గౌరవిస్తారు. మీ జీవితభాగస్వామి
‘‘మంచిని చేయి మరియు దానిని మర్చిపోయే’’ అనే విధంగా ప్రవర్తిస్తారు.