చంద్రగ్రహణం 2025

Author: K Sowmya | Updated Tue, 12 Nov 2024 10:28 AM IST

ఈ ఆస్ట్రోసేజ్ ఆర్టికల్ లో మేము మీకు 2025 లో జరగబోయే అన్ని చంద్రగ్రహణాల గురించి పూర్తి సమాచారాన్ని చంద్రగ్రహణం 2025 లోఅందిస్తాము. ఈ సంవత్సరంలో ఎన్ని చంద్ర గ్రహణాలు జరుగుతాయి, అవి సంపూర్ణంగా, పాక్షికంగా లేదా పెనుమబరాలగా ఉంటాయా. అదనంగా మేము ప్రతి చంద్రగ్రహణం కోసం నిర్దిష్ట తేదీలు, రోజులు మరియు సమయాలను మీకు తెలియజేస్తాము. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఈ గ్రహణాలు కనిపిస్తాయో, అవి భారతదేశంలో చూడవచ్చో లేదో దానికి సంబంధించిన మాట విశ్వాసాలు, చంద్రగ్రహణానికి సంబంధించిన సుతక ( అనుకూల కాలం) మరియు గర్భవతి స్త్రీలకు అవసరమైన జాగ్రతలు మీరు తెలుసుకుంటారు. గ్రహణం సమయంలో ఏ కార్యకలాపాలు నిర్వహించాలి మరియు ఏవి నివారించాలి అనేవి, ఇతర సంబంధిత సమాచారంతో పాటు మేము వివారిస్తాము


వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: రాశిఫలాలు 2025

2025 సంవత్సరం ప్రత్యేకత ఏమిటి ?

2025 చంద్రగ్రహణం అనేది మనమందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖగోళ సంఘటన. ఆకాశంలో చంద్రగ్రహణం ఏర్పడే దృగ్విషయాన్ని మనం గమనించినప్పుడు అది ఒక ఉత్కంఠభరితమైన దృశ్యం. దాని అందం చాలా లోతైనది సాధారణమైన పదాలలో వర్ణించడం కష్టం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా చంద్రగ్రహణాన్ని చూసేందుకు ఆనందిస్తారు మరియు ఎక్కువ కాలం చడగలిగే ప్రదేశాల కోసం వెతుకుతారు.

సూర్యగ్రహణం దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నట్లే, చంద్రగ్రహణం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ప్రాముఖ్యత ఉంది, అలాగే ఖగోళ, ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు మతపరమైన ప్రాముఖ్యత ఉంది. జ్యోతిషశాస్త్ర దృక్కోణం నుండి సూర్య గ్రహణాల లాగే చంద్ర గ్రహణాలు చాలా ముఖ్యమైనవి.

ఏది ఏమైనప్పటికీ "చంద్రగ్రహణం" అనే పదం తరచుగా మన మనస్సులలో వివిధ భయాలను మరియు ప్రతికూల ఆలోచనలను తెస్తుంది, ఏదైనా గ్రహణం ప్రతికూలతను మాత్రమే తెస్తుందని నమ్మేలా చేస్తుంది. కానీ ఇది ఎప్పుడు నిజం కాదు; కొన్నిసార్లు అవి అనుకూలమైన ఫలితాలను కూడా అందిస్తాయి.

వేద జ్యోతిషశాస్త్రంలో చంద్రునికి అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వబడినందున చంద్రగ్రహణం గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. చంద్రుడు మన శరీరాలు మరియు మన మనస్సులలోని నీటి మూలకాన్ని నియంత్రిస్తాడు. చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు బాధపడితే ఇది వ్యక్తులలో మానసిక అస్థిరత, ఉద్రేకం, అశాంతి, ఒత్తిడి మరియు నిరాశకు దారితీస్తుంది.

మన జాతకంలో చంద్రుడు ప్రతికూల స్థితిలో ఉన్నట్లయితే లేదా బాధకు గురైనట్లయితే చంద్ర గ్రహణాన్ని చూడకుండా ఉండటం మరియు దాని ప్రభావాలను తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం మంచిది. జాతకంలో చంద్రగ్రహణ దోషం ఉంటే ఈ జాగ్రత్తలు కూడా పాటించాలి. వారి చార్టులో బలహీన చంద్రుడు ఉన్న వ్యక్తులు చంద్రగ్రహణం సమయంలో మానసిక ఒత్తిడిని అనుభవించవచ్చు. గ్రహణం వారి స్వంత రాశిలో సంభవిస్తే వారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రహణాన్ని చూడకుండా ఉండాలి.

కాల్‌లో ఉత్తమ జ్యోతిష్కు ల నుండి మీ జీవితంపై కుజుడు సంచారం ప్రభావాన్ని తెలుసుకోండి!

అలా చేయడంలో విఫలమైతే చంద్రగ్రహణం ప్రభావితం అయ్యే అవకాశం పెరుగుతుంది అలాగే వారి జాతకంలో చంద్రుని బలహీనత కారణంగా వారు వివిధ సమస్యలను ఎదురుకుంటారు. అందువల్ల ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వారు అవసరమైన పరిహారాలను వెతకాలి.

సరళంగా చెప్పాలంటే భారతీయ వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం 2025 భూమి పైన ఉన్న అన్ని జీవులకు ముఖ్యమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ సంఘటన సమయంలో చంద్రగ్రహణం వేద జ్యోతిష్కులు ఈ దృగ్విషయాన్ని జాతకంలో చాలా లోతుగా అర్థం చేసుకుంటారు, దాని ప్రతికూల ప్రభావాలను హైలైట్ చేస్తారు. అదనంగా గ్రహణం సమయంలో మతపరంగా మరియు ఆధ్యాత్మికంగా ఏదైనా మంచి పనులలో పాల్గొనడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. చంద్రగ్రహణం అంటే ఏమిటి మరియు అది ఎలా సంభవిస్తుందో లోతుగా పరిశీలిద్దాం.

చంద్ర గ్రహణాన్ని సరళంగా నిర్వచించాలంటే భూమి తన అక్షం పైన తిరుగుతున్నప్పుడు సూర్యుని చుట్టూ తిరుగుతుందని మరియు భూమి యొక్క ఉపగ్రహంగా చంద్రుడు దాని చుట్టూ తిరుగుతుందని మనకు తెలుసు. అప్పుడప్పుడు భూమి, సూర్యుడు మరియు చంద్రుడు ఒక సరళ రేఖను ఏర్పరుచుకునే విధంగా సమలేఖనం చేస్తారు. ఈ దృష్టాంతంలో చంద్రుడు మరియు సూర్యుడి మధ్య భూమి తనను తాను ఉంచుకున్నప్పుడు, చంద్రుడు కొంతకాలం భూమి యొక్క నీడతో పూర్తిగా కప్పబడి ఉంటాడు. సూర్యరశ్మి భూమిని చేరుకున్నప్పటికీ, ఈ సమయంలో చంద్రుడిని నేరుగా ప్రకాశింపజేయదు ఫలితంగా చంద్రుడు చీకటిగా కనిపిస్తాడు. ఈ దృగ్విషయాన్ని చంద్ర గ్రహణం అంటారు.

हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: चंद्र ग्रहण 2025

చంద్రగ్రహణాలు రకాలు

సూర్య గ్రహణాల మాదిరిగానే చంద్ర గ్రహణాలను వివిధ రూపాల్లో గమనించవచ్చు. చంద్రగ్రహణం అంటే ఏమిటో మేము ఇప్పటికే వివరించాము, ఇది పరిస్థితులను బట్టి వివిధ మార్గాల్లో వ్యక్తమవుతుంది. వివిధ రకాల చంద్ర గ్రహణాలను అన్వేషిద్దాం:

సంపూర్ణ చంద్రగ్రహణం

భూమి యొక్క నీడ చంద్రుడిని పూర్తిగా కప్పి, సూర్యరశ్మిని చేరుకోకుండా నిరోధించినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంఘటన సమయంలో చంద్రుడు తరచుగా ఎరుపు లేదా గులాబీ రంగులో కనిపిస్తాడు మరియు దాని ఉపరితల లక్షణాలు భూమి నుండి స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దృగ్విషయాన్ని సాధారణంగా సంపూర్ణ చంద్రగ్రహణం లేదా సూపర్ బ్లడ్ మూన్ అని పిలుస్తారు.

పాక్షిక చంద్రగ్రహణం

పాక్షిక చంద్రగ్రహణం భూమి చంద్రుని నుండి చాలా దూరంలో ఉన్నప్పుడు పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది, ఇది చంద్రుని పైన నీడను పడడానికి ముందు సూర్యరశ్మి భూమిని చేరుకోవడానికి అనుమతిస్తుంది. ఈ సందర్భంలో చంద్రుని యొక్క ఒక భాగం మాత్రమే భూమి యొక్క నీడ ద్వారా అస్పష్టంగా ఉంటుంది, ఇది పాక్షికంగా ప్రభావితమైన రూపాన్ని ఇస్తుంది. ఈ సంఘటనను పాక్షిక చంద్ర గ్రహణం అంటారు, దీనిని పెనుంబ్రల్ చంద్ర గ్రహణం అని కూడా అంటారు.

పెనుమబ్రల్ చంద్రగ్రహణం

మేము సంపూర్ణ మరియు పాక్షిక చంద్రగ్రహణాల నిర్వచనాలను అన్వేషించాము. ఈ రెండు రకాలతో పాటు అప్పుడప్పుడు సంభవించే చంద్రగ్రహణం యొక్క మరొక రూపం కూడా ఉంది. ఇది ఖగోళ దృక్పథం నుండి గ్రహణంగా వర్గీకరించబడినప్పటికీ, దీనికి మతపరమైన ప్రాముఖ్యత లేదు.

భూమి యొక్క బయటి నీడ మాత్రమే చంద్రుని పైన మందమైన నీడను కలిగి ఉన్నప్పుడు, చంద్రుని యొక్క ఏ భాగం పూర్తిగా అస్పష్టంగా ఉన్నప్పుడు దాని ఉపరితలం కొద్దిగా మబ్బుగా కనిపిస్తుంది. ఈ దృగ్విషయాన్ని పెనుంబ్రల్ చంద్రగ్రహణం అంటారు. ఇది సాంప్రదాయ గ్రహణంగా గుర్తించబడలేదు మరియు మతపరమైన లేదా ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉండదు, దానితో అనుబంధించబడిన సూతక కాలం కూడా లేదు. అయినప్పటికీ ఇది ఇప్పటికీ ఖగోళ దృక్కోణం నుండి ఒక రకమైన చంద్రగ్రహణంగా గుర్తించబడింది.

భవిష్యత్తులోకి సంబంధించిన అన్ని విలువైన అంతర్దృష్టుల కోసం ఆస్ట్రోసేజ్ బృహత్ జాతకం !

2025 చంద్రగ్రహణం యొక్క సుతాక కాలం

సుతక కాలం సూర్య గ్రహణాలకు గుర్తించబడిన సుతక కాలం ఉన్నట్లే చంద్ర గ్రహణాలకు కూడా సుతక కాలం గుర్తిచబడింది. ఈ కాలం చంద్రగ్రహణం ప్రారంభమయ్యే ముందు సుమారు మూడు ప్రహార్ (సుమారు 9 గంటలు) ప్రారంభమవుతుంది మరియు గ్రహణం ముగిసే వరకు ఉంటుంది. ఇది అశుభ సమయంగా పరిగణించబడుతుంది.

సుతక కాలంలో శుభకార్యాలు ఏవి చేపట్టకూడదు, ఈ సమయంలో విజయం సాధించే అవకాశం అనిశ్చితంగా భవించబడుతుంది. విగ్రహారాధన, విగ్రహాలను తాకడం, దేవాలయాలను సందర్శించడం మరియు వివాహాలు, ముండా ( జుట్టు, కతీరించే వేడుక), మరియు దారపు వేడుకలు ( జానేవు) వంటి ఏదైనా శుభకార్యాలు నిర్వహించడం వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. చంద్రగ్రహణం 2025 సంబంధం ఉన్న సుతక కాలం గురించి ఇప్పుడు మనకు స్పష్టమైన అవగాహన వచ్చేసింది, 2025 సంవత్సరంలో ఎన్ని చంద్ర గ్రహణాలు సంభాయిస్తాయో తెలుసుకుందాం

మీ చంద్రరాశిని తెలుసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి: మూన్ సైన్ కాలిక్యులేటర్ !

చంద్ర గ్రహణాలు ఎప్పుడు సంభవిస్తాయి?

కొత్త సంవత్సరం సమీపిస్తున్న కొద్ది మనలో చాలా మందికి రాబోయే చంద్రగ్రహణాల గురించి అసస్తిగా ఉంటుంది. ఈ సంఘటనలు 2025లో ఎప్పుడు జరుగుతాయో నిశితంగా పరిశీలిద్దాం

మొత్తంగా 2025 లో రెండు గ్రహణాలు వస్తాయి. వీటిలో ఒకటి భారతదేశం లో కనిపించదు, మరొకటి దేశంలోనే గమయించవచ్చు. ఈ చంద్ర గ్రహణాల వివరాలను పరిశీలిద్దాం

మొదటి 2025 చంద్రగ్రహణం: సంపూర్ణ చంద్రగ్రహణం

తిథి తేదీ మరియు రోజు చంద్రగ్రహణం ప్రారంభ సమయం (IST) చంద్రగ్రహణం ముగింపు సమయం కనిపించే ప్రాంతాలు
ఫాల్గుణ మాసం పౌర్ణమి శుక్రవారం, మార్చ్ 14,2025 10:41 AM 2:18 PM ఆస్ట్రేలియాలో ఎక్కువ భాగం, ఐరోపా, ఉత్తర మరియు దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రం, తూర్పు ఆసియా మరియు అంటార్కిటికా (భారతదేశంలో కనిపించదు)

గమనిక: 2025లో చంద్ర గ్రహణాలకు సంబంధించి, పై పట్టికలో ఇవ్వబడిన సమయాలు భారతీయ ప్రామాణిక సమయం (IST) ఆధారంగా ఉంటాయి.

2025లో మొదటి చంద్రగ్రహణం అవుతుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించదు తతపలితంగా, ఇది భారతదేశంలో ఎటువంటి మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండదు ఇంకా అనుబంధిత సుతక కాలం ఉండదు.

ఈ సంపూర్ణ చంద్రగ్రహణం 2025 ఫాల్గుణ మాసం (శుక్ల పక్షం) పౌర్ణమి నాడు, మార్చి 14, 2025 శుక్రవారం నాడు 10:41 am కి ప్రారంభమై మధ్యాహ్నం 2:18 pm IST కి ముగుస్తుంది. ఇది ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాలు. యూరప్ మరియు ఆఫ్రికా లో ఎక్కువ భాగం ఉత్తర మరియు దక్షిణ ఆమెరిక, పసిఫిక్, అట్లాంటిక్ మరియు అరక్తిక మరియు మహాసముద్రాలు, తూర్పా ఆసియా మరియు అంటారకటికలో ప్రముఖంగా కనిపిస్తుంది

ఈ చంద్ర గ్రహణం సింహరాశి మరియు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో సంభవిస్తుంది, ఇది సింహారాశి మరియు ఉత్తర ఫాల్గుణిలో జనించిన వారికి ప్రత్యేకించి ప్రభావం చూపుతుంది. గ్రహణం రోజున సూర్యుడు మరియు శని చంద్రుని నుండి ఏడవ ఇంటిలో ఉంచుతారు, నేరుగా వాఋ పూర్తి కోణాన్ని దాని పైన ఉంచుతారు, తద్వారా దాని ప్రభావం తీవ్రమవుతుంది. ఈ రోజు, కేతువు చంద్రుని నుండి రెండవ ఇంట్లో ఉంటాడు, సూర్యుడు మరియు శని ఏడవ ఇంటిని ఆక్రమిస్తారు ఎనిమిదవ ఆక్రమిస్తారు. ఎనిమిదవ ఇంట్లో రాహువు, బుధుడు, శుక్రుడు, దాశమిలో గురుగరహం పదకొండవ ఇంట్లో కుజుడు ఉంటారు

Click Here to Read in English: Lunar Eclipse 2025

రెండవ చంద్ర గ్రహణం 2025 : సంపూర్ణ చంద్రగ్రహణం

తిథి తేదీ మరియు రోజు చంద్రగ్రహణం ప్రారంభ సమయం (IST) చంద్రగ్రహణం ముగింపు సమయం కనిపించే ప్రాంతాలు
భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి ఆదివారం/సోమవారం సెప్టెంబర్ 7/8, 2025 21:57 (9:57 PM) 25:26 (1:26 AM సెప్టెంబర్ 8న) భారతదేశం, ఆస్ట్రేలియా, ఐరోపా, న్యూజిలాండ్, పశ్చిమ మరియు ఉత్తర అమెరికా, ఆఫ్రికా, తూర్పు దక్షిణ అమెరికాతో సహా ఆసియా మొత్తం

గమనిక: 2025లో చంద్ర గ్రహణాలకు సంబంధించి, పై పట్టికలో ఇవ్వబడిన సమయాలు భారతీయ ప్రామాణిక సమయం (IST) ఆధారంగా ఉంటాయి.

ఇది 2025 సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం అవుతుంది మరియు ఇది భారతదేశంలో పాటు ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలలో కనిపిస్తుంది. భారతదేశంతో సహ అన్నీ కనిపించే ప్రాంతాలలో సుతక కాలం చెల్లుబాటు అవుతుంది. ఈ గ్రహణం యొక్క సుతక కాలం సెప్టెంబర్ 7, 2025 న మధ్యాహ్నం 12:57 గంటలకు ప్రారంభమవుతుంది మరియు గ్రహణం ముగిసే వరకు కొనసాగుతుంది

ఈ చంద్ర గ్రహణం 2025 భాద్రపద మాసం, సెప్టెంబర్ 7, 2025 ఆదివారం, 21:57 (9:57)కి ప్రారంభమై 25:26 సెప్టెంబర్ 8, 2025 న 1:26 am వరకు కొనసాగుతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది. ఈ గ్రహణం భారతదేశం అంతటా, అలాగే ఆసియా, ఆస్ట్రేలియా,యూరప్, న్యూజిలాండ్, పశ్చిమ మరియు ఉత్తర అమెరికా, ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికాలోని తూర్పు ప్రాంతాలలో ప్రముఖంగా కనిపిస్తుంది. కుంభరాశి మరియు పూర్వభాద్రపద నక్షత్రంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. రాహువు చంద్రునితో ఉంటాడు, సూర్యుడు, కేతువు మరియు బుధుడు చంద్రుని నుండి ఏడవ ఇంటిలో ఉంటారు. కుజుడు ఎనిమిదవ ఇంట్లో, శుక్రుడు ఆరవ ఇంటిలో, బృహస్పతి ఐదవ ఇంట్లో, మరియు చంద్రుడు నుండి రెండవ ఇంట్లో శని ఉంటుంది.

ఈ చంద్రగ్రహణం 2025 ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అయితే చంద్రుని పైన బృహస్పతి చూపు ఉండటం వల్ల దాని ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. కుంభరాశి మరియు పూర్వభాద్రపద నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఈ గ్రహణం వారికి అననుకుమంగా ఉంటుంది.

మొత్తంమీద 2025లో ప్రపంచ వేదిక పైన రెండు చంద్ర గ్రహణాలు ఉంటాయి. రెండు సంపూర్ణ గ్రహణాలు మొదటి చంద్ర గ్రహణం మార్చి 14, సంభవిస్తుంది మరియు భారతదేశంలో కనిపించదు, రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7, 2025న జరుగుతుంది ఇది భారతదేశంలో కనిపిస్తుంది. గ్రహణానికి సంబంధించిన సూతక సమయం మరియు దాని ప్రభావాల గురించి మనం ఇంతకు ముందు చర్చించము. 2025 చంద్రగ్రహణం సమయంలో గుర్తుంయించుకోవాలసిన ముఖ్యాంశాలను అన్వేషిద్దం.

2025 చంద్రగ్రహణం: దృష్టి పెట్టాల్సిన విషయాలు

చంద్రగ్రహణం సమయంలో పటించాల్సిన మంత్రాలు

భావం: సూర్యచంద్రులని సేవించే శక్తివంతమైన ఓ రాహువు, బంగారు నక్షత్రం సమర్పణ ద్వారా నాకు శాంతిని ప్రసాదించు.

భావం: ఒక జత నాగపాము విగ్రహాలని విరాళంగా సమర్పించే సమయంలో సాంప్రదాయకంగా ఈ మంత్రాన్ని జపిస్తారు.

ఈ వ్యాసంలో చంద్రగ్రహణం 2025 గురించి సమగ్ర వివరాలను మీకు అందించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేశాము. ఈ వ్యాస సమాచారం మీకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది అని మిమల్ని సంతృప్తి పరుస్తుంది అని మేము ఆశిస్తున్నాము. ఈ పరిజ్ఞానం తో మీరు మీ జీవితంలో అవసరమైన చార్యలని ఆతవిశ్వాసం తో మరియు స్పషటత తో తీసుకోగలుగుతారు.

జ్యోతిష్య నివారణలు సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !

మా బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోసేజ్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!

తరచుగా అడిగిన ప్రశ్నలు

1. ఎన్ని రకాల గ్రహణాలు ఉన్నయి?

వైదిక జ్యోతిష్యశాస్త్రంలో రెండు రకాల గ్రహణాలు వివరించబడ్డాయి: సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం.

2. చంద్రగ్రహణం యొక్క సూతక కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

చంద్రగ్రహణం యొక్క సూతక కాలం గ్రహనానికి 9 గంటల ముందు ప్రారంభం అవుతుంది.

3. ఏ గ్రహాలు గ్రహణాలు కారణం అవుతాయి?

నీడ గ్రహాలు, రాహువు, కేతువుల వల్ల గ్రహణాలు సంభవిస్తాయి.

Talk to Astrologer Chat with Astrologer