శుభ యోగాలతో రక్షా బంధన్ 2022 : Raksha Bandhan Special Yogas in Telugu

Author: C. V. Viswanath | Updated Wed, 31 Aug 2022 05:41 PM IST

రక్షాబంధన్ 2022 అతి తొందరలోనే రాబోతుంది.రక్షాబంధన్ అనేది ప్రేమ మరియు ఆప్యాయతకు మరొక అర్ధం.మనం ఈ పండగ రోజు ఎలాంటి తప్పులు చెయ్యాలని అనుకోము.కాబట్టి మనం శుబప్రదమైన సమయాన్ని చూసుకుని ఈ పండగని జరుపుకోవాలి.ఈ బ్లాగ్ ద్వారా మీరు ఎంతగానో వేచి చూస్తున్న సందేహాలు అన్నింటికీ సమాదానం లబిస్తుంది.


హిందువులు జరుపుకునే పండగలలో రక్షాబంధన్ అనేది చాలా పవిత్రమైన పండగ.ఈ పండగ అన్నా చెల్లెల్ల మధ్య పవిత్రమైన బంధానికి గుర్తు.ఈ పండగని శ్రావణ మాసంలో జరుపుకుంటారు.అన్నాదమ్ములు అక్కచెల్లెళ్ళు ఈ అద్బుతమైన పండుగని జరుపుకోడానికి సంవస్త్రం అంతా ఎదురు చూస్తారు.ఈ సంవస్త్రం రాఖి పండగ 11 ఆగష్టు 2022 న వస్తుంది.కాబట్టి అందరు పండగ గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తితో ఉంటారు, అలాగే శుభప్రదమైన సమయం, ముహూర్తం,ప్రాముక్యత,మరియు పూజా విదానం గురించి కూడా.మీరు ఈ పండగని సంతోషంగా జరుపుకోవడానికి astrosge మీకు అన్ని విషయాల గురించి వివరంగా వర్ణిస్తుంది.కాబట్టి ఈ వ్యాసాన్ని, చివరి వరకు చదివి 2022 రక్షాబంధన్ గురించి తెలుసుకోండి.

మీరు మీ భవిష్యతు గురించి ఆందోళన చెందుతున్నారా,ఉత్తమ జ్యోతిషుడి కాల్ లో

రక్షాబంధన్ 2022: తేది &సమయం

తేది: 11 ఆగష్టు 2022

రోజు: గురువారం

హిందూ మాసం:శ్రావణ మాసం

పూర్ణిమ సమయము:20:52:15 - 21:13:18

రక్షాబంధన్ కి అనుబందించబడిన పూరాణాలు

ఒకప్పుడు ప్రముక హిందూ రాజు పంజాబ్ కు చెందిన పురుషోత్తం అలెగ్జాండర ని ఓడించాడు.అప్పుడు అలెగ్జాండర భార్య పురుషోత్తముని చెయ్యికి రాఖి కట్టి తన సోదరిగా తన భర్తని చంపొద్దు అని కోరుకుంది.మరొక పురాణం ప్రకారం బహదూర్ షా చిత్తూర్ రాజ్యంపై దండెత్తడానికి ప్రయత్నించినప్పుడు, చితూర్ రాణి కర్నవతి బహదూర్ షా నుండి తన రాజ్యాని రక్షించమని సహాయని కోరుతూ చక్రవర్తి హుమాయూన్ కు పవిత్రమైన రాఖిని పంపిస్తుంది.హుమాయూన్ ఇతర మతానికి చెందినప్పటికి తన సోదరికి సహయం చెయ్యడానికి వస్తాడు.

రక్షాబంధన్ కి ముడిపడి మహాభారతంలో మరొక పురాణం ఉంది.ఒకరోజు శ్రీకృష్ణుడు తన వేలుని కోసుకున్నప్పుడు తనకి అపారమైన రక్తం పోతుంది.ఆ రక్తాని చూసి, ద్రౌపది వెంటనే తన చీరని చింపి శ్రీకృష్ణుడి వేళ్ళుకి కడుతుంది.ఆ వస్త్రానే రాఖిగా భావించారు అని చెబ్తారు.ఆరోజు శ్రీకృష్ణుడు తన సోదరి ద్రౌపదికి తనని అన్ని ప్రమాదాల నుండి కాపాడుతాను అని మాట ఇస్తాడు.తరువాత కౌరవులు, ద్రౌపదిని ఆస్థానంలోకి లాగి, తన వస్త్రాలను విప్పి పరువుని తియ్యాలని ప్రయత్నించినప్పుడు, కృష్ణుడు తనకి వస్త్రాలను అందించి తన పరువుని కాపాడుతాడు.

కాబట్టి ఈ పూరాణాల ప్రకారం, సోదరుడు మరియు సోదరి మధ్య బందం ఎంత పవిత్రమైనదో ఎంత గౌరవించబడుతుందో మనకు తెలుస్తుంది.

రక్షాబంధన్ & ఇంద్ర దేవుడు

రక్షాబంధన్ తో ముడిపడి ఉన్న అనేక పురాణ కథలను మనము చదివాము కాని మనకు తెలియని ఆసక్తికరమైన కథ ఇంద్ర దేవుడి గురించి.ఈ పురాణం ప్రకారం దేవతలకు మరియు రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు, రాక్షస రాజు బలి, ఇంద్రుడిని అనుమానిస్తాడు.వర్షం ఇంకా ఆకాశం యొక్క ప్రభువు కోసం, ఇది ముక్యమైన పతనంగా మారింది.ఈ సమయంలో ఇంద్ర దేవుడి భార్య శచి, విష్ణు దేవుడిని సంప్రదిస్తుంది.అప్పుడు మహావిష్ణువు శచి కి ఒక దారపు కంకణాన్ని ఇచ్చి అది చాలా పవిత్రమైనది అని చెప్తాడు.శచి ఆ దారాన్ని తెచ్చి ఇంద్ర దేవుడికి కట్టి తనని ఆశిర్వదిస్తుంది.దాని వల్ల ఇంద్రదేవుడికి అపారమైన శక్తి కలుగుతుంది దానితో రాక్షసులను ఓడించి,కోల్పోయిన ప్రతిదాన్ని తిరిగి పొందుతాడు.పవిత్రమైన దారానికి రక్షణ శక్తులు ఉన్నాయని నిరూపించే గ్రంథాలలో ఇది అతి ముక్యమైనది.ఈ కథ వల్ల మనకు పురాణాలలో యుద్దాలకు వెళ్ళే పురుషులు ఈ దారాన్ని ఎంత పవిత్రంగా భావించేవారో తెలుస్తుంది.మరియు రాఖి కేవలం సోదరి సోదరులకు మత్రమే అంకితం కాదు అన్న విషయం తెలుస్తుంది.

దేశ వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు

రక్షాబంధన్ నాడు సోదరులకు రాఖి కట్టడం మరియు వారి సోదరిమనులకు కూడా రాఖిని కట్టడం ఒక సంప్రదాయం.దాన్ని పైన మనము ఒక పవిత్రమైన ఎర్ర దారాన్ని కూడా ఉంచుతాము.అలాగే సోదరిమణులు తరచుగా వారి కోడళ్ళకు కంకణాలను ఇస్తారు.చాలా ప్రదేశాలలో ప్రజలు దేవతలను పూజిస్తారు మరియు పితృ పూజలు చేస్తారు.అలాగే కొందరు యాగం మరియు అనుష్టానం వంటి వివిధ కర్మలను కూడా నిర్వహిస్తారు.

అరుణాచల్ ప్రదేశం లో రక్షాబంధన్ వేడుకని శ్రావణి అని అంటారు.ఈరోజున భక్తులు ఋషులకు యాగం చేస్తారు.బ్రాహ్మణ పండితులు వాళ్ళ గురువులకు రాఖి ని కడతారు, అలాగే వాళ్ళ గురువులు తిరిగి దక్షిణం ఇస్తారు.

మహారాష్ట్రలో రాఖి పండగని నరాలి పూర్ణిమగా జరుపుకుంటారు.ప్రజలు సముద్రాన్ని లేదా వరుణ్ దేవుడిని దర్శించి కొబ్బరికాయని సమర్పిస్తారు.

ఒరిస్సా, కేరళ మరియు తమిళనాడు లో రక్షాబంధన్ ని అవని అవిట్టం అని అంటారు.మహారాష్ట్ర ప్రజల లాగానే, ఈ స్థానికులు కూడా నదులు లేదా సముద్రాలను సందర్శిస్తారు, స్నానాలు చేసి, పూజలు నిర్వహిస్తారు.అలాగే యాగం చేసే సమయంలో భక్తి గీతాలను పాడుతారు.దీన్ని వల్ల చెడు అంతా వెళ్ళిపోయి, ప్రకాశవంతమైన జీవితాన్ని పొందుతారు అని అక్కడి ప్రజలు భావిస్తారు.

రక్షాబంధన్ పూజ విదానము

* ఉదయానే స్నానం చేసి, కులదేవతకు దండం పెట్టాలి

* రాఖి, అక్షింతలు, కుంకుమ వీటనింటిని ఇతడి లేదా రాగి పాత్రలో ఉంచుకోవాలి.

* ఆ పాత్రలోని వస్తువులను తీసుకెళ్ళి, కులదేవతకి సమర్పించాలి.

* అన్న కాని తమ్ముడికి కాని రాఖి కట్టేటప్పుడు తను తూర్పు దిశకు ఎదురుగా ఉండేలా చూసుకోండి.

* అక్కా చెల్లెళ్ళు ముందుగా తమ అన్నదమ్ములకు నుదిటి పైన తిలకాన్ని పెట్టాలి.

* కుడి చేతికి మాత్రమే రాఖిని కట్టాలి.

*రాఖి కట్టిన తర్వాత సోదరిమణులు సోదరులు బహుమతులను ఇంకా స్వీట్లను పంచుకోవాలి.

* సోదరులు తమ సోదరిమనులకు అన్ని పరిస్థితుల లోను తోడు ఉంటాము అని మాట ఇవ్వాలి.

రక్షాబంధన్ 2022 నాడు 3 శుభ యోగాల ఏర్పాట్లు

ఈ సంవస్త్రం రాఖి పండగ రోజున మూడు శుభ యోగాలు ఏర్పడనున్నాయి.అవి ఏంటంటే ఆయుష్మాన్ యోగం, రవి యోగం, సౌభాగ్య యోగం.ఆయుష్మన యోగం 11 ఆగష్టు మధ్యానం 3:32 నిమిషాల వరకు కొనసాగుతుంది.దీన్ని తర్వాత సౌభాగ్య యోగం మొదలవుతుంది.శాస్త్రం ప్రకారం ఈ యోగాలలో చేసే ప్రతి పనులు విజయవంతం అవుతాయి అని జ్యోతిష్యులు చెప్తున్నారు.

రక్షాబంధన్ ని శుభప్రదంగా చేయడానికి ఈ రాశుల వారీగా రాఖీలు కట్టండి

మేషం: మీ సోదరిడుది మేషరాశి అయినట్టు అయితే, తనకి ఎరట్టి రాఖిని కట్టండి. అది తన జీవితంలో శక్తిని మరియు ఉత్సాహన్ని తీసుకురావడానికి సహాయపడుతుంది.అలాగే సోదరుని నుదిట పైన తిలకం పెట్టడం వల్ల అతనికి మంచి జరుగుతుంది.

వృషభం: మీ సోదరుడిది వృషభ రాశి అయినట్టు అయితే , వెండి లేదా తెలుపు రంగు రాఖిని కట్టండి.అలాగే తన నుదిట పైన అక్షింతలను ఇంకా తిలకాని పెట్టాలి.

మిథునం: మీ సోదరుడిది మిథున రాశి అయినట్టు అయితే, శుభం జరగడానికి మీరు ఆకుపచ్చ లేదా చందనం రంగు రాఖిని కట్టాలి.అలాగే పసుపు తిలకాన్ని పెట్టాలి.

కర్కాటకము: మీ సోదరుడిది కర్కాటక రాశి అయినట్టు అయితే, తెల్ల రేశం దారం మరియు పూసల తో చేసిన రాఖిని కట్టాలి.అలాగే చందన తిలకం పెట్టాలి.

సింహం: మీ సోదరుడిది సింహరాశి అయినట్టు అయితే, తనకి గులాబీ లేదా పసుపు రంగు రాఖిని కట్టండి.అలాగే పసుపు తిలకాన్ని పెట్టాలి.

కన్య: మీ సోదరుడిది కన్య రాశి అయినట్టు అయితే, శుభఫలితాల కోసం మీరు తెల్ల రేషం దారాన్ని లేదా ఆకుపచ్చ రంగు రాఖిని అయినా కట్టవచ్చు.పసుపు మరియు చందన తిలకాన్ని పెట్టాలి.

తుల: మీ సోదరుడిది తుల రాశి అయినట్టు అయితే, తెలుపు లేదా గోధుమ రంగు రాఖిని కట్టండి.కేసర తిలకాన్ని పెట్టండి.

వృశ్చికం: వృశ్చిక రాశి వాళ్ళకి గులాబీ లేదా ఎరుపు రంగు రాఖిని కట్టాలి.రోలి తిలకాన్ని పెట్టాలి.

ధనుస్సు: ధనుస్సు రాశి వాళ్ళకి పసుపు రేశం రాఖిని కట్టి పసుపు కుంకుమతో తిలకాన్ని పెట్టాలి.

మకర: మకర రాశి వాళ్ళకి లేత లేదా ముదురు నీలం రంగుని రాఖిని కట్టాలి.కేసర తిలకాన్ని పెట్టాలి.

కుంభం: కుంభ రాశి వాళ్ళకి వీలైతే రుద్రాక్షలతో చేసిన రాఖిలను కట్టాలి.లేకపోతే పసుపు రంగు రాఖిని కూడా కట్టవచ్చు.పసుపు తో తిలకాన్ని పెట్టాలి.

మీనం: మీన రాశి వాళ్ళకి గాడమైన ఎరుపు రంగులో ఉన్న రాఖిని కట్టాలి.అలాగే పసుపు తో తిలకాన్ని పెట్టాలి.

చెడు నుండి దూరంగా ఉండడానికి రక్షాబంధన్ రోజున చెయ్యవలసిన పరిహారాలు: వాస్తు శాస్త్రం ప్రకారం మౌళిని గంగాజలంతో పవిత్రం చేసి, ఇంటి ముఖ్య ద్వారం దెగ్గర, మూడు ముడుపులతో కట్టి,గాయత్రి మంత్రాని చదువుకుంటే, ఇంటి బద్రత బలపడుతుంది మరియు దొంగతనం పేదరికం ఇతర దోషాల నుండి రక్షణ లబిస్తుంది.

మీరు ఆస్ట్రోసేజ్ ద్వారా ఈ బ్లాగ్ ని చదివినందుకు సంతోషపడ్డారు అని మేము ఆశిస్తున్నాము.

జ్యోతిష్య నివారణలు & సహాయం కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్లైన్ షాపింగ్ స్టోర్

ఆస్ట్రోసేజ్ తో కనెక్ట్ అయినందుకు ధన్యవాదాలు!

Talk to Astrologer Chat with Astrologer