వృషభరాశిలో శుక్ర సంచారం ( 29 జూన్ 2025)
విలాసాలు మరియు సుఖాలకు అధిపతి అయిన శుక్రుడు జూన్ 29, 2025న మధ్యాహ్నం 2:56 గంటలకు వృషభరాశిలో శుక్ర సంచారం చెయ్యబోతున్నాడు. వృషభరాశి శుక్రుడు సొంతరాశి ఈ సంచారం చాలా ముఖ్యమైనది. శుక్రుడు జూలై 26, 2025 వరకు వృషభరాశిలో ఉంటాడు, ఈ సమయంలో దాని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. శుక్రుడు తన సొంతరాశిలో ఉన్నందున ఈ గ్రహానికి అనుకూలంగా ఉన్న జాతకాలు ఉన్న వ్యక్తులు పెరిగిన శ్రేయస్సు మరియు సానుకూల ఫలితాలను అనుభవించవచ్చు. శుక్రుడు ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉన్నవారికి, దాని ప్రభావాలు మరింత సవాలుగా మారవచ్చు. ఈ సమయంలో శని యొక్క మూడవ కోణం శుక్రుడి పైన ఉంటుంది, వివిధ రాశిచక్ర గుర్తులకు దాని ప్రభావాన్ని వివిధ మార్గాల్లో మరింతగా రూపొందిస్తుంది.
కాల్‌లో ఉత్తమ జ్యోతిష్కు ల నుండి మీ జీవితంపై కుజుడు సంచారం ప్రభావాన్ని తెలుసుకోండి!
జోతిష్య ప్రియులకు తెలిసినట్లుగా శుక్రుడు సంపద, సౌకర్యం, ఆనందం, అందం, ప్రేమ మరియు వివాహానికి కారకుడు. వృషభరాశిలోకి దాని కదలిక జీవితంలోని ఈ అంశాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఈ శుక్ర సంచారం మీ పైన ఎలా ప్రభావం చూపుతుంది? వివిధ రాశిచక్ర గుర్తుల పైన దాని ప్రభావాలను అన్వేషిద్దాం.
हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: शुक्र का वृषभ राशि में गोचर (29 जून 2025)
వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: రాశిఫలాలు 2025
మేషరాశి
మీ రెండవ మరియు ఏడవ ఇంటికి శుక్రుడు అధిపతి మరియు వృషభరాశిలోకి బుధుడు సంచారం మీ రెండవ ఇంట్లో జరుగుతుంది. రెండవ ఇంట్లో శుక్రుడి సంచారం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది మరియు శుక్రుడు తన సొంతరాశిలో ఉన్నందున, అది మీకు అనుకూలమైన ఫలితాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. మీ రెండవ ఇంటిపై శని యొక్క మూడవ కోణం కొంచెం సవాలుతో కూడిన పరిస్థితిని సృష్టిస్తుంది, ఇది కొన్ని ప్రతికూల ఫలితాలకు దారితీయవచ్చు. అయినప్పటికీ ఈ ప్రతికూలతను తగ్గించడానికి శుక్రుడు కృషి చేస్తాడు.
ఈ వృషభరాశిలో శుక్ర సంచారం సమయంలో వృషభరాశిలో మీరు కొత్త బట్టలు మరియు ఆభరణాలను పొందవచ్చు. సంగీతం మరియు కళల పైన మీ ఆసక్తి పెరుగుతుంది మరియు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా మీరు మంచి లాభాలను పొందవచ్చు మరియు ప్రభుత్వం లేదంటే పరిపాలనకు సంబంధించిన విషయాలు కూడా మీకు అనుకూలంగా మారవచ్చు.
పరిహారం: దుర్గామాత ఆలయంలో ఆవు నెయ్యిని దానం చెయ్యండి.
వృషభరాశి
శుక్రుడు మీ లగ్న గ్రహం మరియు మీ ఆరవ ఇంటి అధిపతి. వృషభరాశిలో శుక్రుడు సంచార సమయంలో మీ మొదటి ఇంట్లో శుక్రుడు ఉంటాడు, అంటే అతను తన సొంత రాశిలోనే ఉంటాడు. మొదటి ఇంట్లో శుక్రుని సంచారాన్ని అనుకూలంగా భావిస్తారు మరియు అతను తన సొంతరాశిలో ఉన్నందున, మీరు సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. శుక్రుడు శని యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో కూడా సహాయం చేస్తాడు.
ఈ శుక్ర సంచార ఫలితంగా వృషభరాశిలో మీరు సంపద మరియు శ్రేయస్సును కూడబెట్టుకోవచ్చు. ఆర్థికంగా ఈ సమయం లాభాలను తెస్తుంది. విద్యార్థులు ముఖ్యంగా కళలు మరియు సాహిత్యం చదువుతున్నవారు మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంది. వివాహానికి సంబంధించిన విషయాలను ముందుకు తీసుకెళ్లడానికి కూడా ఈ సంచారం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడవచ్చు మరియు శుక్రుడి ప్రభావం ఆనందం, వినోదం మరియు వ్యాపార ప్రయత్నాలలో విజయాన్ని తెస్తుంది.
పరిహారం: నల్ల ఆవు కి దానం చెయ్యడం మంచిది.
మిథునరాశి
మీ ఐదవ మరియు పన్నెండవ ఇళ్లకు శుక్రుడు అధిపతి మరియు వృషభరాశిలో శుక్రుడు సంచార సమయంలో, అది మీ పన్నెండవ ఇంట్లో ఉంటుంది. పన్నెండవ ఇంట్లో శుక్ర సంచారం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఐదవ ఇంటి అధిపతి పన్నెండవ ఇంట్లోకి వెళ్తూన్నందున, ఇది పూర్తిగా అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు మీ ప్రియమైనవారికి దూరంగా ఉండవలసి రావచ్చు.
దీని అర్థం మీరు కోరుకోకపోయినా సుదూర ప్రాంతాలకు ప్రయాణించడం లేదా చాలా దూరం వెళ్లవలసి రావడం. వ్యాపార సంబంధిత ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు సానుకూల వార్తలను అందుకోవచ్చు. వృషభరాశిలో ఈ శుక్ర సంచారము విలాసం మరియు ఆనందానికి కూడా అనుకూలంగా ఉంటుంది, ముఖ్యంగా వినోద విషయాలలో. మీరు చదువులపై లేదా తీవ్రమైన విషయాలపై దృష్టి పెట్టడం కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ, ఈ సమయం వినోదం మరియు ఆనందానికి అవకాశాలను తెస్తుంది.
పరిహారం: మీ భార్య, కోడలు లేదంటే యువతికి గౌరవంగా మేకప్ లేకపోతే సౌందర్య సాధనాలను బహుమతిగా ఇచ్చి వారి ఆశీర్వాదాలు పొందడం శుభప్రదం.
కాగ్నిఆస్ట్రో ప్రొఫెషనల్ రిపోర్ట్‌తో ఉత్తమ కెరీర్ కౌన్సెలింగ్ పొందండి!
కర్కాటకరాశి
మీ నాల్గవ మరియు పదకొండవ ఇంటికి శుక్రుడు అధిపతి మరియు ఈ సమయంలో అది మీ పదకొండవ లాభాల ఇంట్లో ఉంటుంది. ఈ ఇంట్లో శుక్రుని సంచారాన్ని చాలా అనుకూలంగా భావిస్తారు. శుక్రుడు తన సొంతరాశిలో ఉండటం వలన, దాని సానుకూల ప్రభావాలు మరింత మెరుగుపడతాయి. దీని అర్థం శుక్రుడు జీవితంలోని వివిధ అంశాలలో మీకు ప్రయోజనాలను తీసుకురావడానికి కృషి చేస్తాడు.
ఆస్తి, స్థిరాస్తి మరియు వాహనాలకు సంబంధించిన లాభాలు మరియు ఆనందాన్ని మీరు అనుభవించవచ్చు. ప్రయాణ అవకాశాలు తలెత్తవచ్చు అలాగే మీరు వాటిని ఆస్వాదించే అవకాశం ఉంది. వృషభరాశిలో శుక్ర సంచారం సంపద మరియు శ్రేయస్సు పెరుగుదలకు దారితీస్తుంది, మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. పని రంగాలలో మీ విజయ అవకాశాలు బలంగా ఉంటాయి. అదనంగా, మీరు తోబుట్టువులు మరియు స్నేహితుల నుండి మంచి మద్దతు పొందవచ్చు. మీ తల్లికి సంబంధించిన విషయాల గురించి మీరు ఆందోళన చెందుతుంటే, ఆ ఆందోళనలు ఇప్పుడు పరిష్కరించబడతాయి.
పరిహారం: శనివారం రోజున ఆవాలు లేదంటే నువ్వులను దానం చెయ్యడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.
సింహరాశి
మీ మూడవ మరియు ఐదవ ఇళ్లకు శుక్రుడు అధిపతి, మరియు వృషభరాశిలో దాని యొక్క సంచార సమయంలో, అది మీ వృత్తి మరియు కర్మ యొక్క పదవ ఇంట్లో ఉంటుంది. పదవ ఇంట్లో శుక్రుని సంచారాన్ని అంతా అనుకూలంగా పరిగణించరు. శాస్త్రీయ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పదవ ఇంట్లో శుక్రుడు మానసిక ఒత్తిడి, విభేదాలు మరియు ఉద్యోగాలు లేదంటే వ్యాపారాలలో అడ్డంకులను తెస్తాడు. పని వైఫ్యల్యాలకు మరియు ప్రభుత్వ మరియు పరిపాలన సమస్యలకు కూడా దారితీయవచ్చు.
మీ విషయంలో శుక్రుడు తన స్వంతరాశిలో ఉన్నందున ఈ ప్రతికూల ప్రభావాలు అంతా తీవ్రంగా ఉండాపోవచ్చు. దీని అర్థం శుక్రుడు సంబందిత రంగాలను బలోపేతం చేస్తాడు, అయినప్పటికీ అప్పుడప్పుడు ఇబ్బందులు తలెట్టవచ్చు. మీకు అర్ధం అయ్యేలా చెప్పాలి అంటే, సమస్యలు తలెట్త్తవచ్చు, పరిష్కారాలు కూడా వస్తాయి. వివాదాలు తలెత్తవొచ్చు, కానీ అవి పరిష్కరించబడే అవకాశం ఉంది. మీరు ఉద్యోగ సంబంధిత ఇబ్బందులను ఎదురుకునట్టు అయితే, వాటిని అధిగమించడానికి మీరు త్వరలో ఒక మార్గాన్ని కనుగొనవచ్చు. వ్యాపారంలో ప్రారంభ అడ్డంకులు చివరికి లాభాలకు దారితీయవచ్చు. పనివ విజయం సాధించే అవకాశం ఉంది మరియు అధికారులతో ఏవైనా సమస్యలు క్రమంగా మెరుగుపడవచ్చు. వృషభరాశిలో ఈ శుక్ర సంచారము సమస్యలు సంభవించవచ్చు, కానీ పరిష్కారాలు కూడా సకాలంలో వస్తాయని సూచిస్తుంది.
పరిహారం: మాంసం, మద్యం మరియు గుడ్లను నివారించడం ద్వారా స్వచ్ఛమైన మరియు సాత్విక జీవనశైలిని నిర్వహించడం అనుకూలమైన ఫలితాలను తెస్తుంది.
కన్యరాశి
మీ రెండవ మరియు తొమ్మిదవ ఇళ్లకు శుక్రుడు అధిపతి మరియు వృషభరాశిలో శుక్ర సంచారం సమయంలో, అది మీ తొమ్మిదవ ఇంట్లో అదృష్టం మరియు విధిలో ఉంటుంది. ఈ ఇంట్లో శుక్రుని సంచారాన్ని చాలా అనుకూలంగా భావిస్తారు. అదృష్టానికి అధిపతి అయిన శుక్రుడు తన సొంత ఇంట్లో సంచారము చెయ్యడం వలన, ఇది సహజంగానే మీ అదృష్టాన్ని బలపరుస్తుంది.
దీని అర్థం మీ కృషి ఫలితాలను ఇస్తుండగా, మీరు విధి నుండి కూడా గణనీయమైన సహాయాన్ని పొందుతారు, దీని వలన విజయం మరియు విజయాలు సాధించడం సులభం అవుతుంది. ప్రభుత్వం మరియు పరిపాలనకు సంబంధించిన విషయాలు కూడా సజావుగా సాగవచ్చు. మతపరమైన ప్రయాణాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అదనంగా కుటుంబంలో లేదంటే బంధువుల మధ్య శుభ సంఘటనలు జరగవచ్చు. మొత్తంమీద, వృషభరాశిలో ఈ శుక్ర సంచారము అనుకూలమైన ఫలితాలను తెస్తుందని భావిస్తున్నారు, ముఖ్యంగా ఆర్థిక మరియు కుటుంబ సంబంధిత విషయాలలో.
పరిహారం: వేప చెట్ల వేర్ల పైన నీళ్లు పొయ్యడం మంచిది.
తులారాశి
మీ లగ్న మరియు ఎనిమిదవ ఇంటికి శుక్రుడు అధిపతి మరియు వృషభరాశిలో శుక్రుడి దాని సంచార సమయంలో అది మీ ఎనిమిదవ ఇంట్లో ఉంటుంది. ఎనిమిదవ ఇంట్లో గ్రహ సంచారాలు చాలా అనుకూలంగా పరిగణించబడవు, కానీ ఈ ఇంట్లో కూడా సానుకూల ఫలితాలను ఇవ్వగల కొన్ని గ్రహాలలో శుక్రుడు ఒకటి. శుక్రుడు తన సొంతరాశిలో ఉన్నందున, ఇది జీవితంలోని కొన్ని అంశాలలో ఉపశమనం కలిగించగలదు. మీరు ఇటీవలి రోజులలో ఇబ్బందులు లేదంటే సమస్యలను ఎదుర్కొంటుంటే, మీరు ఇప్పుడు పరిష్కారాలను కనుగొనవచ్చు.
ఆర్థికంగా వృషభరాశిలో ఈ శుక్ర సంచారం మీకు మంచి లాభాలను తెస్తుంది. లగ్న అధిపతి ఎనిమిదవ ఇంట్లో సంచారం చేస్తున్నందున, అన్ని విషయాలను నిర్వహించడంలో ఓపిక చాలా ముఖ్యం. విజయం సాధించడానికి మీరు మునుపటి కంటే మరింత ఓపికగా ఉండాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదంటే ప్రయాణించేటప్పుడు అదనపు జాగ్రత్తగా ఉండండి. మీరు సహనం మరియు జాగ్రత్తను పాటిస్తే, మీరు ప్రతికూలతను నివారించవచ్చు మరియు ఆర్థిక విషయాలలో బాగా రాణించవచ్చు. ఈ సంచారం శ్రేయస్సు మరియు అవకాశాలను కూడా బలపరుస్తుంది.
పరిహారం: దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.
వృశ్చికరాశి
శుక్రుడు మీ ఏడవ మరియు పదకొండవ ఇళ్లకు అధిపతి మరియు ఈ సంచారం సమయంలో శుక్రుడు ఏడవ ఇంట్లో ఉంటాడు. ఏడవ ఇంట్లో శుక్రుని సంచారము అంత అనుకూలంగా పరిగణించబడదు, ఎందుకంటే శాస్త్రీయ జోతిష్యశాస్త్ర గ్రంథాలు అటువంటి స్థానం పునరుత్పత్తి జననేంద్రియ సంబంధిత ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అయితే, శుక్రుడు దాని స్వంతరాశిలో ఉన్నందున, మీరు అలాంటి ఆరోగ్య సమస్యలను ఎదురుకునే అవకాశం లేదు. అయినప్పటికీ, జాగ్రత్త వహించడం మరియు నివారణ చర్యలు తీసుకోవడం తెలివైన పని. ఈ వృషభరాశిలో శుక్ర సంచారం ప్రయాణాలలో ఆటంకాలను తీసుకురావొచ్చు, కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ప్రయాణం చెయ్యాల్సిన పరిస్థితి వస్తే, అన్ని జాగ్రత్తలు తీసుకోండి. సంబంధాల విషయాలలో మీ భార్య లేదా మీ పార్టనర్ తో సామరస్యం మరియు అవగాహనను కొనసాగించడం వలన మంచి ఫలితాలు వస్తాయి. చిన్న చిన్న అడ్డంకులు తలెత్తవొచ్చు, కానీ ఓర్పు మరియు కృషితో, మీరు వాటిని అధిగమించి విజయం సాధించగలుగుతారు.
పరిహారం: ఎర్రటి ఆవుని సేవించడం మరియు దానిని సంరక్షించుకోవడం శుభ ఫలితాలను ఇస్తుంది.
మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకునేటప్పుడు మీకు కావలసిన విధంగా ఆన్‌లైన్ పూజను జ్ఞానమున్న పూజారి చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందండి!!!
ధనుస్సురాశి
శుక్రుడు ఈ రాశి వారికి ఆరవ మరియు పదకొండవ ఇళ్లకు అధిపతి, ఈ సంచారం సమయంలో మీ ఆరవ ఇంట్లో ఉంటాడు. ఆరవ ఇంట్లో శుక్ర సంచారం అనుకూలంగా పరిగణించబడదు, కానీ దాని స్వంతరాశిలో ఉండడం కారణంగా అది అంత పెద్దగా ప్రతికూలతను తీసుకురాలేదు. ఈ కాలంలో శుక్ర సంబంధిత విషయాలను జాగ్రత్తగా నిర్వహించడం చాలా అవసరం.
వృషభరాశిలో శుక్ర గ్రహ సంచారం వాదనలు మరియు శత్రువులను పెంచుతుంది, కాబట్టి మా సలహా ఏమిటంటే అనవసరమైన వాదనల నుండి దూరంగా ఉండండి. ముఖ్యంగా మీరు ఒక మహిళతో వాదనకు దిగే పరిస్థితి తలెత్తితే, మీ ప్రశాంతతను కాపాడుకోవడం తెలివైన చర్య. మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ద వహించండి, ఫిట్ గా ఉండటానికి సరైన ఆహారం మరియు జీవనశైలిని నిర్వహించడం అలాగే వాహనాలను జాగ్రత్తగా నడపండి. జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు ప్రతికూల పరిణామాలను నివారించవొచ్చు. దీనికి కారణం శుక్రుడు తన స్వంతరాశిలో ఉండటం, ఇది కొన్ని ప్రతికూల ప్రభావాలను ఎదురుకోగలదు. ఈ సంచారం మీకు అంతగా అనుకూలంగా ఉండకపోవొచ్చు, మీ ప్రయత్నాలతో మీరు దాని యొక్క ప్రతికూల ప్రభావాలని తగ్గించుకోవొచ్చు అలాగే మీరు మునుపటి కాలాల నుండి సానుకూలతను కొనసాగించవొచ్చు.
పరిహారం: కన్య పూజ చెయ్యండి అలాగే మంచి కోసం వాళ్ల ఆశీర్వాదలు తీసుకోండి.
మకరరాశి
మీ ఐదవ మరియు పదవ ఇళ్లకు శుక్రుడు అధిపతి మరియు ఈ సంచారం సమయంలో శుక్రుడు మీ ఐదవ ఇంట్లో ఉంటాడు. ఐదవ ఇంట్లో శుక్రుడి సంచారాన్ని అనుకూలంగా భావిస్తారు. శుక్రుడు తన స్వంతరాశిలో ఉండడం వల్ల, వృషభరాశిలోకి ప్రవేశించిన వెంటనే ఐదవ ఇంటికి సంబంధించిన ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి ఇది పని చేస్తుంది.
శని గ్రహం పరంగా మీ ఐదవ ఇంటిని నిరంతరం ప్రభావితం చేస్తుంది, ఇది కొన్ని ఇబ్బందులను సృష్టించి ఉండవొచ్చు. ఇప్పుఉద శుక్రుడు ఆ సమస్యలను తగ్గించడంలో సహాయం పడుతుంది. శని మీ మూడవ ఇంట్లో ఉన్నప్పటికీ, ఇది సాధారణంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది, దాని అంశం ఐదవ ఇంటికి సంబంధించిన ఆటంకాలు కలిగించి ఉండవొచ్చు. వీటిలో విద్యలో అడ్డంకులు లేదంటే ప్రేమ సంబంధాలలో ఉద్రిక్తతలు ఉండవొచ్చు, కానీ ఇప్పుడు ఈ ఇబ్బందులు తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు పిల్లలకు సంబంధించిన సానుకూల పరిణామాలను అనుభవించవొచ్చు, పరీక్షలలో విజయం సాధించవొచ్చు మరియు వినోద అవకాశాలను కనుగొనవొచ్చు. ప్రేమ సంబంధాలు మరింత సామరస్యపూర్వకంగా మారవొచ్చు అలాగే నిశ్చితార్థాలు లేదంటే వివాహాల గురించి చర్చలు ముందుకు సాగవొచ్చు. మీరు వివాహ వయస్సులో ఉనట్టు అయితే, వివాహానికి సంబంధించిన చర్చలు పురోగమించవొచ్చు. వృషభరాశిలో శుక్ర సంచారం మీకు అనుకూలమైన ఫలితాలను తెస్తుంది అని భావిస్తున్నారు.
పరిహారం: శ్రేయస్సు కోసం మీ తల్లి లేదంటే మాతృమూర్తిలకు సేవ చెయ్యండి మరియు వారి ఆశీర్వాదాలను పొందండి.
కుంభరాశి
మీ నాల్గవ ఇంటికి మరియు తొమ్మిదవ ఇంటికి శుక్రుడు అధిపతి, వృషభరాశి గుండా వెళ్ళే సమయంలో, శుక్రుడు మీ నాల్గవ ఇంట్లో ఉంటాడు. జ్యోతిష్యశాస్త్ర గ్రంథాల ప్రకారం, నాల్గవ ఇంట్లో శుక్ర సంచారం సాధారణంగా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది.
ఈ సంచారం మీ కోరికలను నెరవేర్చడంలో సహాయపడుతుంది, ఆర్టిక విషయాలలో సానుకూల ఫలితాలను తెస్తుంది మరియు ఆస్తి, గృహాలు మరియు వాహనాలకు సంబంధించిన సౌకర్యాన్ని అందిస్తుంది, ఇది బంధువులతో ఆహ్లాదకరమైన సంభాషణాలకు దారితీస్తుంది మరియు మీ సామాజిక సంబంధాలను పెంచుతుంది. మీరు వ్యక్తిగత విజయం మరియు మానసిక సంతృప్తిని పెంచుకోవొచ్చు.
మీరు సుదూర ప్రాంతాలకు సంబంధించిన విషయాల పైన ఆసక్తిని పెంచుకోవొచ్చు లేదంటే దూర ప్రాంతాల నుండి బంధువు లేదంటే స్నేహితుడు మిమల్ని సందర్శించడానికి రావొచ్చు. ఈ శుక్ర సంచారం సమయంలో అనుకూలమైన ఫలితాలను తెస్తుంది అని, మిమల్ని ఇబ్బంది పెడుతున్న ఏవైనా కుటుంబం లేకపోతే గరుగా సమస్యలను క్రమంగా పరిష్కరిస్తుంది అని భావిస్తున్నారు.
పరిహారం: ప్రహవించే నీటిలో బియ్యాన్ని దారపొయ్యండి.
మీనరాశి
మీ మూడవ మరియు ఎనిమిదవ ఇళ్లకు శుక్రుడు అధిపతి మరియు ఈ సంచారం సమయంలో అది మీ మూడవ ఇంట్లోనే ఉంటుంది. మూడవ ఇంట్లోని శుక్రుడు సానుకూల ఫలితాలను తెస్తాడు అని భావిస్తారు. వృషభరాశిలో శుక్ర సంచారం సమయంలో అది మీ మూడవ ఇంట్లోనే ఉంటుంది. మూడవ ఇంట్లోని శుక్రుడు సానుకూల ఫలితాలను ఇస్తున్నాడు అని భావిస్తారు. ఈ సంచారం మీ తోబుట్టువులు మరియు స్నేహితులతో మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది మరియు మీరు కొత్త స్నేహాలను కూడా ఏర్పరచుకోవొచ్చు. మీరు మీ పోటీదారుల కంటే మెరుగ్గా రాణిస్తారు. ఈ శుక్రుడి సంచారం కారణంగా మీ మొదటి ఇంట్లో ఉంచిన శని గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించవొచ్చు. మీరు కొన్ని శుభవార్తలను అందుకుంటారు అలయహే సౌకర్యం మరియు శ్రేయస్సులో పెరుగుదలను అనుభవించవొచ్చు. అదృష్టం నుండి మెరుగైన సహాయంతో మీరు జీవితంలోని దాదాపు అన్ని అంశాలలో మెరుగుదలలను అనుభవించే అవకాశం ఉంది.
పరిహారం: మహిళలని గౌరవించడం మరియు వారి ఆశీర్వాదాలను తీసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి.
జ్యోతిష్య నివారణలు & సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ !
మా బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోసేజ్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!
తరచుగా అడుగు ప్రశ్నలు
1. 2025లో శుక్రుడు వృషభరాశిలో ఎప్పుడు సంచరిస్తాడు?
జూన్ 29,2025.
2. శుక్రుడు దేనిని సూచిస్తాడు?
శుక్రుడిని సంపద, విలాసం, శ్రేయస్సు, ఇంద్రియ కోరికలు, కళ, సంగీతం, అందం మరియు శ్రేయస్సుని సూచిస్తారు.
3. వృషభరాశిని పాలించే గ్రహం?
శుక్రుడు.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






